NZ Tour Of England: న్యూజిలాండ్‌ను గెలిపించిన గ్లెన్‌ ఫిలిప్స్‌ | NZ Tour Of England: Glenn Phillips Shines With Unbeaten Half Century In Second Practice Match | Sakshi
Sakshi News home page

NZ Tour Of England: న్యూజిలాండ్‌ను గెలిపించిన గ్లెన్‌ ఫిలిప్స్‌

Published Mon, Aug 28 2023 6:31 PM | Last Updated on Mon, Aug 28 2023 6:36 PM

NZ Tour Of England: Glenn Phillips Shines With Unbeaten Half Century In Second Practice Match - Sakshi

ఇంగ్లండ్‌ పర్యటనలో న్యూజిలాండ్‌ యంగ్‌ వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ అదరగొడుతున్నారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అజేయమైన ఇన్నింగ్స్‌లు ఆడి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. వార్సెస్టర్‌షైర్‌తో‌ జరిగిన తొలి మ్యాచ్లో 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 32 పరుగులు బాదిన ఫిలిప్స్‌.. గ్లోసెస్టర్‌షైర్‌తో నిన్న (ఆగస్ట్‌ 27) జరిగిన మ్యాచ్‌లో అజేయమైన అర్ధసెంచరీతో (37 బంతుల్లో 65 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు.

ఫిలిప్స్‌ ఫామ్‌లో ఉండటంతో ఇంగ్లండ్‌ పర్యటనలో న్యూజిలాండ్‌కు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌ సిరీస్‌ కోసం ఎంపిక చేసిన న్యూజిలాండ్‌ టీ20, వన్డే జట్లలో సభ్యుడిగా ఉన్న ఫిలిప్స్‌ భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌లో కీలకంగా మారవచ్చని కివీస్‌ మేనేజ్‌మెంట్‌ అంచనా వేస్తుంది.

ఇదిలా ఉంటే 4 టీ20లు, 4 వన్డేల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న  న్యూజిలాండ్‌ టీమ్‌..  తొలుత టీ20 సిరీస్‌ (ఆగస్ట్‌ 30 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు), ఆతర్వాత వన్డే సిరీస్ (సెప్టెంబర్‌ 8-15)‌ ఆడుతుంది.

తొలి టీ20 ఆగస్ట్‌ 30న, రెండోది సెప్టెంబర్‌ 1న, మూడోది సెప్టెంబర్‌ 3న, నాలుగో టీ20 సెప్టెంబర్‌ 5న జరుగనున్నాయి. అనంతరం సెప్టెంబర్‌ 8న తొలి వన్డే, సెప్టెంబర్‌ 10న రెండో వన్డే, సెప్టెంబర్‌ 13న మూడో వన్డే, సెప్టెంబర్‌ 15న నాలుగో వన్డే జరుగనుంది.

ఇంగ్లండ్‌తో టీ20లకు కివీస్‌ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్‌), ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ రవీంద్ర సీఫెర్ట్, ఇష్ సోధి

ఇంగ్లండ్‌తో వన్డేలకు న్యూజిలాండ్‌ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్‌), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, విల్ యంగ్

న్యూజిలాండ్‌ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ టీ20 జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్‌), రెహాన్ అహ్మద్, మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, క్రిస్‌ జోర్డన్‌, ల్యూక్ వుడ్

న్యూజిలాండ్‌ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్‌), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement