
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 2) జరుగతున్న మ్యాచ్‌లో కివీస్ ఆటగాళ్లు మైదానంలో పాదరసంలా కదిలారు. పరుగులు నియంత్రించడంతో పాటు పలు అద్భుతమైన క్యాచ్‌లు పట్టారు. కివీస్ స్టార్ ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్ పట్టిన ఓ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. కెరీర్‌లో 300వ వన్డే ఆడుతున్న విరాట్ కోహ్లిని ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్‌తో పెవిలియన్ బాట పట్టించాడు.
కోహ్లి బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆడిన షాట్‌ను ఫిలిప్స్ నమ్మశకంకాని క్యాచ్‌గా మలిచాడు. కుడివైపు గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో సూపర్ మ్యాన్ క్యాచ్ అందుకున్నాడు. కోహ్లి ఆడిన షాట్‌కు ఫిలిప్స్ సెకెన్ల వ్యవధిలో రియాక్టయ్యాడు. ఈ క్యాచ్‌ను చూసి కోహ్లి సహా మైదానంలో ఉన్న వారంతా నివ్వెరపోయారు. కోహ్లి సతీమణి అనుష్క అయితే తలపట్టుకుంది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.
ఈ మ్యాచ్‌లో మరో అద్భుతమైన క్యాచ్ కూడా నమోదైంది. రవీంద్ర జడేజాను కేన్ విలియమ్సన్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మ్యాట్ హెన్నీ (8-0-42-5) ఐదేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించారు. భారత టాప్-3 బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మ 15, శుభ్‌మన్ గిల్ 2, విరాట్ కోహ్లి 11 పరుగులు చేశారు.
అక్షర్ పటేల్ ఔటయ్యాక కేఎల్ రాహుల్ (23) శ్రేయస్‌తో కలిసి కాసేపు నిలకడగా ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు. కాగా, గ్రూప్-ఏలో భారత్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్‌కు చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాయి.
తుది జట్లు..
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఓరూర్కీ
Comments
Please login to add a commentAdd a comment