
హండ్రెడ్ లీగ్‌లో వెల్ష్ ఫైర్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసం సృష్టించాడు. సథరన్ బ్రేవ్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేశాడు. ఫిలిప్స్‌తో పాటు లూక్ వెల్స్ (30 బంతుల్లో 53; 7 ఫోర్లు, సిక్స్), టామ్ కొహ్లెర్ కాడ్‌మోర్ (12 బంతుల్లో 23; ఫోర్, 2 సిక్సర్లు), స్టెఫెన్ ఎస్కినాజీ (21 బంతుల్లో 28; 3 ఫోర్లు, సిక్స్), జానీ బెయిర్‌స్టో (11 బంతుల్లో 17; 2 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సథరన్ బ్రేవ్ బౌలర్లలో టైమాల్ మిల్స్ 2, అకీల్ హొసేన్, జోఫ్రా ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు.
కాగా, హండ్రెడ్ లీగ్ 2024 నుంచి వెల్ష్ ఫైర్ ఇదివరకు ఎలిమినేట్ అయ్యింది. సథరన్ బ్రేవ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. ఓవల్ ఇన్విన్సిబుల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోగా.. సథరన్ బ్రేవ్‌తో పాటు నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ బర్మింగ్హమ్ ఫీనిక్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచాయి. వెల్ష్ ఫైర్, ట్రెంట్ రాకెట్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్, లండన్ స్పిరిట్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment