
మహిళల హండ్రెడ్ లీగ్‌లో సథరన్ బ్రేవ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధన కళ్లు చెదిరే రీతిలో ఓ అద్భుతమైన రనౌట్ చేసింది. ట్రెంట్ రాకెట్స్‌తో నిన్న (ఆగస్ట్ 10) జరిగిన మ్యాచ్‌లో మంధన.. బ్రైవోని స్మిత్‌ను డైరెక్ట్ త్రోతో పెవిలియన్ బాట పట్టించింది. మంధన మెరుపు విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరవలవుతంది. ఇన్నింగ్స్ తొలి బంతికే మంధన స్మిత్‌ను పెవిలియన్‌కు పంపడం విశేషం.
A direct hit by Smriti Mandhana! 🎯pic.twitter.com/FIlRG1Jo4g
— CricTracker (@Cricketracker) August 10, 2024
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ నాట్ సీవర్ బ్రంట్ (60 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రాకెట్స్ ఇన్నింగ్స్‌లో గ్రేస్ స్క్రీవెన్స్ (36) ఓ మోస్తరు పరుగులు చేయగా.. నటాషా (12), గార్డ్‌నర్ (18), హీథర్ గ్రహం (15) రెండంకెల స్కోర్లు చేశారు. సథరన్ బ్రేవ్ బౌలర్లలో లారెన్ బెల్ 3, లారెన్ చియాటిల్, ఆడమ్స్, క్లో టైరాన్ తలో వికెట్ పడగొట్టారు.
156 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రేవ్.. నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. స్మృతి మంధన (27 బంతుల్లో 42; 7 ఫోర్లు), క్లో టైరాన్ (31 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వీరిద్దరు మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ జార్జియా ఆడమ్స్ 29 బంతులు ఎదుర్కొని 27 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాకెట్స్ బౌలర్లలో స్టోన్‌హౌస్ 2, ఆష్లే గార్డ్‌నర్, హీథర్ గ్రహం తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment