నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టీ20 సిరీస్‌ను 2-2తో కివీస్ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ బ్యాటర్లలో జానీ బెయిర్‌స్టో(41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 73 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్ మూడు, సోధి రెండు వికెట్లు సాధించారు.
చాప్‌మాన్, ఫిలిఫ్స్ విధ్వంసం..
176 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి కేవలం 17.2 ఓవర్లలోనే న్యూజిలాండ్ ఛేదించింది. కివీస్ బ్యాటర్లలో ఓపెపర్ సీఫెర్ట్(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. గ్లెన్ ఫిలిఫ్స్(25 బంతుల్లో 42), చాప్‌మాన్(25 బంతుల్లో 40) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.
ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్ రెండు వికెట్లు, లూక్ వుడ్ ఒక్క వికెట్ పడగొట్టారు. ఇక కార్డిఫ్ వేదికగా సెప్టెంబర్ 8న ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.
చదవండి: ODI WC 2023: వరల్డ్‌కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. టికెట్ ధర రూ.57లక్షలు!
Comments
Please login to add a commentAdd a comment