మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 95 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టీ20ల సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టు 2-0 అధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఇంగ్లండ్ బ్యాటర్లలో జానీ బెయిర్ స్టో, హ్యరీ బ్రూక్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో అదరగొట్టారు. కివీస్ బౌలర్లకు వీరిద్దరూ చుక్కలు చూపించారు. బెయిర్ స్టో 60 బంతుల్లో 8 ఫోర్లు, 4సిక్స్‌లతో 86 పరుగులు చేయగా.. బ్రూక్ 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో ఇష్ సోథీ రెండు వికెట్లు, శాంట్నర్, సౌథీ తలా వికెట్ సాధించారు.
అరంగేట్రంలోనే అదుర్స్..
ఇక ఇంగ్లండ్ యువ పేసర్ గుస్ అట్కిన్సన్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అట్కిన్సన్.. నాలుగు వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు.
అతడితోపాటు రషీద్ రెండు, లివింగ్ స్టోన్, సామ్ కర్రాన్, జాక్స్ తలా వికెట్ సాధించారు. ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి లక్ష్య చేధనలో న్యూజిలాండ్ 103 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బ్యాటర్లలో సీఫర్ట్(39) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం చేస్తారో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment