Bair Stow
-
ఇంగ్లండ్ యవ పేసర్ సంచలనం.. ఆరంగేట్రంలోనే 4 వికెట్లు! కివీస్ చిత్తు
మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 95 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టీ20ల సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టు 2-0 అధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జానీ బెయిర్ స్టో, హ్యరీ బ్రూక్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో అదరగొట్టారు. కివీస్ బౌలర్లకు వీరిద్దరూ చుక్కలు చూపించారు. బెయిర్ స్టో 60 బంతుల్లో 8 ఫోర్లు, 4సిక్స్‌లతో 86 పరుగులు చేయగా.. బ్రూక్ 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో ఇష్ సోథీ రెండు వికెట్లు, శాంట్నర్, సౌథీ తలా వికెట్ సాధించారు. అరంగేట్రంలోనే అదుర్స్.. ఇక ఇంగ్లండ్ యువ పేసర్ గుస్ అట్కిన్సన్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన అట్కిన్సన్.. నాలుగు వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. అతడితోపాటు రషీద్ రెండు, లివింగ్ స్టోన్, సామ్ కర్రాన్, జాక్స్ తలా వికెట్ సాధించారు. ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి లక్ష్య చేధనలో న్యూజిలాండ్ 103 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బ్యాటర్లలో సీఫర్ట్(39) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం చేస్తారో తెలుసా? -
హై హై హైదరాబాద్...
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ఒక పెద్ద విజయంతో ఐపీఎల్లో తమ విలువను ప్రదర్శించింది. అభిమానులు మెచ్చేలా ఒక అద్భుత ప్రదర్శనతో సంతోషం పంచింది. ఓపెనర్లు బెయిర్‌స్టో, వార్నర్‌ల మెరుపు సెంచరీ భాగస్వామ్యంతో భారీ స్కోరు నమోదు చేసిన జట్టు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తొక్కేసింది. ముందుగా పేలవ బౌలింగ్, ఆ తర్వాత చేవ లేని బ్యాటింగ్‌తో కుప్పకూలిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లీగ్‌లో తాము ముందంజ వేసే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో మూడో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 69 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బెయిర్‌స్టో (55 బంతుల్లో 97; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... వార్నర్ (40 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధసెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 91 బంతుల్లో 160 పరుగులు జోడించారు. అనంతరం పంజాబ్ 16.5 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. నికోలస్ పూరన్ (37 బంతుల్లో 77; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. 12 పరుగులకే 3 వికెట్లు తీసి రషీద్ ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. మరో 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ ముగియడం పంజాబ్ వైఫల్యాన్ని సూచిస్తోంది. శతక భాగస్వామ్యం... సీజన్లో తొలిసారి ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాట్రెల్ వేసిన మొదటి ఓవర్లోనే 13 పరుగులు రాబట్టడంతో వీరి జోరు మొదలైంది. పవర్‌ప్లేలో హైదరాబాద్ స్కోరు 58 పరుగులకు చేరింది. రవి బిష్ణోయ్ ఓవర్లో వరుసగా 6, 4, 6 బాది బెయిర్‌స్టో దూకుడు ప్రదర్శించాడు. ఈ క్రమంలో 28 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. అంతకుముందు 19 పరుగుల వద్ద మిడాఫ్‌లో రాహుల్ కష్టసాధ్యమైన క్యాచ్ వదిలేయడం కూడా బెయిర్‌స్టోకి కలిసొచ్చింది. హైదరాబాద్ 10 ఓవర్లలో 10 రన్‌రేట్‌తో సరిగ్గా 100 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టిన బెయిర్‌స్టో... ముజీబ్ ఓవర్లో వరుసగా మరో రెండు సిక్సర్లు సాధించడం విశేషం. మరోవైపు 37 బంతుల్లో వార్నర్ అర్ధసెంచరీ పూర్తయింది. 5 ఓవర్లలో 6 వికెట్లు... 15 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు వికెట్ కోల్పోకుండా 160 పరుగులు. కానీ జట్టు బ్యాటింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. పంజాబ్ చక్కటి బౌలింగ్‌కు తర్వాతి మూడు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే వచ్చాయి. బిష్ణోయ్ ఓవర్లో వరుస బంతుల్లో వార్నర్, బెయిర్‌స్టో అవుట్ కాగా, భారీ షాట్లు ఆడే క్రమంలో పాండే (1), సమద్ (8) వెనుదిరిగారు. అయితే చివరి రెండు ఓవర్లలో విలియమ్సన్ (20 నాటౌట్) చకచకా రన్స్ చేయడంతో స్కోరు 200 పరుగులు దాటింది. ఆఖరి 5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ 41 పరుగులు చేసింది. 202 పరుగుల భారీ ఛేదనలో పంజాబ్ ఏ దశలోనూ లక్ష్యం చేరేలా కనిపించలేదు. కొద్దిసేపు పూరన్ జోరు మినహా మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. పూరన్ మెరుపులు.. పంజాబ్ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచిన అంశం పూరన్ బ్యాటింగ్ ఒక్కటే. తొలి బంతినే కవర్‌డ్రైవ్ బౌండరీగా మలచి ఖాతా తెరిచిన అతను, అభిషేక్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో ధాటిని పెంచాడు. సమద్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లోనైతే పూరన్ భీకరంగా చెలరేగిపోయాడు. ఈ ఓవర్ తొలి ఐదు బంతుల్లో 6, 4, 6, 6, 6 బాది 28 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 17 బంతుల్లోనే అతను అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రివ్యూ నిర్ణయంపై రివ్యూ... పంజాబ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఖలీల్ వేసిన ఐదో బంతి ముజీబ్ బ్యాట్‌కు తాకుతూ కీపర్ చేతుల్లో పడటంతో అప్పీల్ చేయగా, అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఆపై రైజర్స్ రివ్యూ కూడా కోరలేదు. అయితే ఇద్దరూ అంపైర్లు చర్చించి మూడో అంపైర్‌ను సంప్రదించారు. బంతిని నేలను తాకిందా లేదా అనేదానిని మాత్రమే సమీక్షించిన థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో ముజీబ్ మైదానం వీడబోయాడు. అంతలోనే వెనక్కి వచ్చి అవుట్‌పై సందేహం వ్యక్తం చేస్తూ రివ్యూ కోరాడు. దాంతో అల్ట్రా ఎడ్జ్ రీప్లే చూసిన అనంతరం బంతి బ్యాట్‌కు తగిలిందంటూ మూడో అంపైర్ అవుట్ ఇచ్చాడు. ప్రధాన బ్యాట్స్‌మన్ కాకపోయినా రివ్యూపై మళ్లీ రివ్యూ కోరడంతో మైదానంలో కొద్దిసేపు డ్రామా కనిపించింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) రవి బిష్ణోయ్ 52; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 97; సమద్ (సి) అర్‡్షదీప్ (బి) బిష్ణోయ్ 8; పాండే (సి అండ్ బి) అర్‡్షదీప్ 1; విలియమ్సన్ (నాటౌట్) 20; ప్రియమ్ గార్గ్ (సి) పూరన్ (బి) అర్‡్షదీప్ 0; అభిషేక్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) షమీ 12; రషీద్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–160; 2–160; 3–161; 4–173; 5–175; 6–199. బౌలింగ్: కాట్రెల్ 3–0–33–0; ముజీబ్ 4–0–39–0; షమీ 4–0–40–1; మ్యాక్స్‌వెల్ 2–0–26–0; బిష్ణోయ్ 3–0–29–3; అర్‡్షదీప్ 3–0–33–2. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) విలియమ్సన్ (బి) అభిషేక్ 11; మయాంక్ (రనౌట్) 9; సిమ్రన్ సింగ్ (సి) గార్గ్ (బి) ఖలీల్ 11; పూరన్ (సి) నటరాజన్ (బి) రషీద్ 77; మ్యాక్స్‌వెల్ (రనౌట్) 7; మన్దీప్ (బి) రషీద్ 6; ముజీబ్ (సి) బెయిర్‌స్టో (బి) ఖలీల్ 1; రవి బిష్ణోయ్ (నాటౌట్) 6; షమీ (ఎల్బీ)(బి) రషీద్ 0; కాట్రెల్ (బి) నటరాజన్ 0; అర్‡్షదీప్ (సి)వార్నర్ (బి)నటరాజన్ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (16.5 ఓవర్లలో ఆలౌట్) 132. వికెట్ల పతనం: 1–11; 2–31; 3–58; 4–105; 5–115; 6–126; 7–126; 8–126; 9–132; 10–132. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–27–0; ఖలీల్ అహ్మద్ 3–0–24–2; నటరాజన్ 3.5–0–24–2; అభిషేక్ 1–0–15–1; రషీద్ ఖాన్ 4–1–12–3; సమద్ 1–0–28–0. -
359 పరుగుల లక్ష్యం...45 ఓవర్లలోపే ఉఫ్!
రన్ పవర్ పెరుగుతోంది. ఛేదనెంతైనా సులువవుతోంది. మూడొందల పైచిలుకు కొండంత స్కోరైనా... బ్యాట్స్‌మెన్ ధాటికి కరిగిపోతోంది. పాపం బౌలర్లు! టి20ల దెబ్బకు కుదేలవుతున్నారు. వన్డేల్లోనూ వారిని దంచేస్తున్నారు. బ్రిస్టల్: పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ చెలరేగితే... ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చితక్కొట్టారు. అంతే... కొండంత లక్ష్యం కాస్తా చిన్నబోయింది. 359 పరుగుల లక్ష్యాన్ని 5.1 ఓవర్ల ముందే ఛేదించి ఆతిథ్య ఇంగ్లండ్ జయభేరి మోగించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా పాక్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఓపెనర్ ఇమాముల్ హక్ (131 బంతుల్లో 151; 16 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లోనే బెస్ట్ సెంచరీ బాదేశాడు. ఆసిఫ్ అలీ (53; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), హారిస్ సొహైల్ (41; 7 ఫోర్లు) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లు పడగొట్టగా, టామ్ కరన్ 2 వికెట్లు తీశాడు. తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 44.5 ఓవర్లలోనే 4 వికెట్లకు 359 పరుగులు చేసి గెలిచింది. ఈ జట్టులోనూ ఓపెనర్లే చెలరేగారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జానీ బెయిర్‌స్టో (93 బంతుల్లో 128; 15 ఫోర్లు, 5 సిక్స్‌లు), జేసన్ రాయ్ (55 బంతుల్లో 76; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కలిసి తొలి వికెట్‌కు 17.3 ఓవర్లలోనే 159 పరుగులు జోడించడమే ఇంగ్లండ్ విజయానికి పునాది అయింది. తర్వాత వచ్చిన వారిలో రూట్ (43; 4 ఫోర్లు, 1 సిక్స్), మొయిన్ అలీ (46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో ఇంగ్లండ్ ఈజీగా ఛేజింగ్ చేసింది. మోర్గాన్‌పై సస్పెన్షన్ వేటు దుబాయ్: స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. అతనిపై ఒక వన్డే నిషేధం విధించడంతో పాటు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించారు. 12 నెలల వ్యవధిలో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదవడంతో ఐసీసీ నిబంధనల మేరకు మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ అతనిపై చర్య తీసుకున్నారు. దీంతో మోర్గాన్ నాటింగ్‌హామ్‌లో రేపు జరిగే నాలుగో వన్డేకు దూరమయ్యాడు. -
హైదరాబాద్ చిత్తుగా...
ఏమైంది హైదరాబాద్‌కు! వారం క్రితం ఇక్కడే ఉప్పెనలా చెలరేగింది. ఇద్దరు ఓపెనర్లే (వార్నర్, బెయిర్ స్టో) 200 పైచిలుకు భాగస్వామ్యం చేశారు. తర్వాత అద్భుతమైన బౌలింగ్‌తో కోహ్లి సేనను చిత్తుగా ఓడించింది.కానీ ఇప్పుడు ఓ సులభసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ముంబై ఇండియన్స్‌ను చక్కగా కట్టడి చేసినా... బ్యాటింగ్‌లో మాత్రం చేతులెత్తేసింది. ఒక్కడి (జోసెఫ్ అల్జారి) బౌలింగ్‌కు కకావికలమైంది. మూడు వరుస విజయాల తర్వాత సన్ జోరుకు చుక్కెదురైంది. సాక్షి, హైదరాబాద్: విండీస్ బౌలర్ అల్జారి జోసెఫ్... ఐపీఎల్‌కు కొత్త. ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేశాడు. 12 పరుగులే ఇచ్చి ఏకంగా 6 వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరుకు బ్రేకులేశాడు. దీంతో సొంతగడ్డపై స్వల్పలక్ష్యాన్ని ఛేదించలేక హైదరాబాద్ పరాజయం పాలైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 40 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ చేతిలో ఘోరంగా ఓడింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పొలార్డ్ (26 బంతుల్లో 46 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే వెన్నెముకగా నిలబడ్డాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్ 17.4 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటైంది. దీపక్ హుడా చేసిన 20 పరుగులే టాప్ స్కోర్. అల్జారి జోసెఫ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రోహిత్ మళ్లీ విఫలం... ముంబై ఇండియన్స్ జట్టులో ఒక్కడు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ కనీసం 20 పరుగులైనా చేయలేకపోయారు. కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ నుంచి పాండ్యా బ్రదర్స్ దాకా అందరూ రైజర్స్ బౌలింగ్‌కు తలొగ్గారు. ఓపెనర్ డికాక్ 19 పరుగులు చేశాడు. టాస్ నెగ్గిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో మొదట ముంబై ఇండియన్స్ పరుగుల ఆట ప్రారంభించింది. రోహిత్ శర్మ (11)ను నబీ ఔట్ చేయడంతో మొదలైన వికెట్ల పతనం 65 పరుగులకే సగం వికెట్లను కూల్చేసింది. సూర్యకుమార్ (7)ను సందీప్ ఎల్బీగా పంపాడు. పవర్ ప్లేలో ఈ రెండు వికెట్లను కోల్పోయి 30 పరుగులు చేసిన ముంబై 10 ఓవర్లు ముగిసేసరికి మరో వికెట్ (డికాక్)ను చేజార్చుకొని 51 పరుగులే చేసింది. ఆఖర్లో పొలార్డ్ మెరుపులు ముంబై ఇన్నింగ్స్‌కు పొలార్డ్ ఆపద్బాంధవుడయ్యాడు. 8 పరుగుల వద్ద రషీద్ క్యాచ్ మిస్చేయడంతో బతికిపోయిన పొలార్డ్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యా (14; 1 సిక్స్) 17వ ఓవర్‌దాకా క్రీజులో ఉన్నా చేసేదేమీ లేకపోయింది. 18 ఓవర్లు ముగిశాయి. ముంబై వంద పరుగులైనా చేయలేదు. ఇక మిగిలింది 12 బంతులే! ఈ దశలో సిద్ధార్థ్ కౌల్ 19వ ఓవర్లో పొలార్డ్ 3 సిక్సర్లు బాదడంతో 20 పరుగులొచ్చాయి. భువీ ఆఖరి ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టడంతో 19 పరుగులు లభించాయి. సన్రైజర్స్దీ తడబాటే.. స్వల్ప లక్ష్యమే అయినా హైదరాబాద్ తడబడింది. మూడో ఓవర్లో వార్నర్ ఒక బౌండరీ, బెయిర్ స్టో 2 ఫోర్లు కొట్టారు. 27/0 స్కోరుతో బాగానే ఉన్న ఆ తర్వాతి ఓవర్ నుంచి కష్టాలు మొదలయ్యాయి. మూడు బంతుల వ్యవధిలో బెయిర్ స్టో (10 బంతుల్లో 16; 3 ఫోర్లు), వార్నర్ (13 బంతుల్లో 15; 2 ఫోర్లు) ఔటయ్యారు. ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్ తొలి బంతికే అల్జరి జోసెఫ్... వార్నర్ వికెట్ తీశాడు. అప్పటికి జట్టు స్కోరు 33/2. ఇక ఇక్కడి నుంచి హైదరాబాద్ ఇన్నింగ్స్ గతితప్పింది. తొలి సగం ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లకు 59 పరుగులు చేసింది. మనీశ్ పాండే (16), యూసుఫ్ పఠాన్ (0) ఔట్ కావడంతో పరాజయం దిశగా పయనించింది. ►6/12 ఐపీఎల్లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. సొహైల్ తన్వీర్ (6/14) రికార్డును అల్జారి సవరించాడు. ►96 ఐపీఎల్లో సన్‌రైజర్స్‌కు ఇదే అత్యల్ప స్కోరు. 2015లో హైదరాబాద్‌లోనే ముంబై చేతిలో 113 పరుగులకు ఆలౌటైంది. -
సన్‌రైజర్స్ హ్యాట్రిక్ విజయం
-
సన్‌రైజర్స్ హ్యాట్రిక్ విజయం
న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. గురువారం స్థానిక ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ జయభేరి మోగించింది. దీంతో సన్‌రైజర్స్ హ్యాట్రిక్ విజయం తో పాటు పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానానికి ఎగబాకింది. ఢిల్లీ నిర్దేశించిన 130 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. మరో 9 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. ఛేదనలో బెయిర్ స్టో(48) అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. బెయిర్ స్టో అవుటయిన తర్వాత వెంటవెంటనే వార్నర్(10), విజయ్ శంకర్(16), పాండే(10), హుడా(10)లు నిష్క్రమించి విజయాన్ని ఆలస్యం చేశారు. ఢిల్లీ బౌలర్లలో లామ్‌చెన్, అక్షర్ పటేల్, రబడ, తెవాటియా, ఇషాంత్‌లు తలో వికెట్ సాధించారు. అంతకముందు టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుగా ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి శుభారంభం లభించలేదు. ఓపెనర్లు పృథ్వీ షా(11), శిఖర్ ధావన్(12)లు ఆదిలోనే వికెట్లను చేజార్చుకున్నారు. దాంతో ఢిల్లీ 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రిషభ్ పంత్(5) కూడా నిరాశపరిచాడు. కాగా, శ్రేయస్ అయ్యర్(43) రాణించడంతో ఢిల్లీ తేరుకుంది. చివర్లో అక్షర్ పటేల్(23 నాటౌట్), క్రిస్ మోరిస్(17) బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నబీ, సిద్దార్థ్ కౌల్‌ఖ తలో రెండు వికెట్లు సాధించగా, రషీద్ ఖాన్, సందీప్ శర్మలు చెరో వికెట్ తీశారు. అయ్యర్ మినహా.. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ మినహా ఎవరూ రాణించలేదు. ఫస్ట్ డౌన్లో వచ్చిన అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా, మరొక ఎండ్ నుంచి సహకారం లభించలేదు. వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్ బాటపట్టడంతో ఢిల్లీ స్కోరు నత్తనడకన సాగింది. మరొకసారి మిడిల్ ఆర్డర్ విఫలమైంది. రిషబ్ పంత్, తెవాతియా, ఇన్‌గ్రామ్‌లు తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో ఢిల్లీ స్కోరు వంద దాటడం కూడా కష్టమే అనిపించింది. అయితే చివర్లో అక్షర్ పటేల్ 1 ఫోర్, 2 సిక్సర్లతో 23 పరుగులు చేయడంతో ఢిల్లీ సాధారణ స్కోరును సన్‌రైజర్స్ ముందుంచింది. -
వార్నర్-బెయిర్‌స్టోల భాగస్వామ్యం అసాధారణం
సాక్షి, హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో నెలకొల్పిన 185 పరుగుల రికార్డు భాగస్వామ్యంపై పలువురు క్రీడా దిగ్గజాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వాతావరణంలో వేడి అధికంగా ఉన్నప్పటికీ అలసిపోకుండా, వికెట్ల మధ్య చకాచకా పరుగులు తీస్తూ, అద్బుతమైన క్రికెటింగ్ షాట్లు ఆడుతూ మరిచిపోలేని భాగస్వామ్యం ఈ ఇద్దరు నెలకొల్పారని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో సెంచరీల మోత వల్ల సన్‌రైజర్స్ ఐపీఎల్లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ కెరీర్లో వార్నర్ నాలుగు సెంచరీలు చేయగా మూడు సెంచరీలు ఇదే మైదానంలో సాధించడం విశేషం. వార్నర్ ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 114 పరుగులు చేసిన బెయిర్ స్టో ఐపీఎల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 231 పరుగులు భారీ స్కోరు చేయగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్.. సన్‌రైజర్స్ బౌలర్ మహ్మద్ నబీ(11/4) ధాటికి 19.5 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 118 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. తమ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టోలు అద్భుతంగా బ్యాటింగ్ చేశారని, మహ్మద్ నబీ, సందీప్‌లు బౌలింగ్‌లో రాణించడంతో బెంగుళూర్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగామని, సీరిస్ మొత్తం ఇలాగే విజయ పరంపర కొనసాగిస్తామని సన్‌రైజర్స్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
వన్డే క్రికెట్లో పెను సంచలనం.!
నాటింగ్‌హామ్: 50 ఓవర్లలో 41 ఫోర్లు, 21 సిక్సర్లతో ఏకంగా 481 పరుగులు... ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సొంతగడ్డపై సృష్టించిన వీర విధ్వంసం ఇది. ఆస్ట్రేలియాపై సునామీలా విరుచుకుపడిన మోర్గాన్ సేన వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మంగళవారం జరిగిన డే–నైట్ మూడో వన్డేలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 481 పరుగులు చేసింది. ఫలితంగా ఇప్పటి వరకు తమ పేరిటే ఉన్న 444 పరుగుల (2016లో పాకిస్తాన్‌పై) రికార్డును తుడిచి పెట్టింది. అలెక్స్ హేల్స్ (92 బంతుల్లో 147; 16 ఫోర్లు, 5 సిక్సర్లు), జాన్ బెయిర్‌స్టో (92 బంతుల్లో 139; 15 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకాలతో విరుచుకు పడగా... జేసన్ రాయ్ (61 బంతుల్లో 82; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇయాన్ మోర్గాన్ (30 బంతుల్లో 67; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో తమ వంతు పాత్ర పోషించారు. మ్యాచ్‌లో మూడు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు కావడం విశేషం. ఇంగ్లండ్ ధాటికి ఆసీస్ బౌలర్లలో టై అత్యధికంగా 100 పరుగులు సమర్పించుకోగా, రిచర్డ్సన్ 92, స్టొయినిస్ 85 పరుగులు ఇచ్చారు. 46 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 450 వద్ద నిలిచింది. బ్యాటింగ్ జోరు చూస్తే స్కోరు 500 పరుగులు దాటుతుందని అనిపించింది. అయితే చివరి నాలుగు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా లేకుండా 31 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆసీస్... వరుస బంతుల్లో హేల్స్, మోర్గాన్ వికెట్లు కూడా తీయడంతో స్కోరు 481కే పరిమితమైంది. 482 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రషిద్ (4/47) దెబ్బకు 239 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటింగ్‌లో ట్రావిస్ హెడ్ (51), స్టోయినీస్ (44)లు టాప్ స్కోరర్లుగా నిలిచారు. 5 వన్డేల సిరీస్‌లో 3-0తో ఇంగ్లండ్ సిరీస్ కైవసం చేసుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వదిలినా దొరికారు
► ఇంగ్లండ్ 268/8 బెయిర్ స్టో అర్ధసెంచరీ ► సమష్టిగా రాణించిన భారత బౌలర్లు ► నాలుగు క్యాచ్‌లు వదిలేసిన ఫీల్డర్లు ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా నాలుగు క్యాచ్‌లు వదిలేశారు. పిచ్ నుంచి బౌలర్లకు పెద్దగా సహకారం లేదు... ఇలాంటి స్థితిలో ఏ ప్రత్యర్థరుునా దొరికిన అవకాశాలను వినియోగించుకుని చెలరేగుతుంది. కానీ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మాత్రం నిర్లక్ష్యపు షాట్లతో... ఏ మాత్రం బాధ్యత లేని ఆటతీరుతో తొలిరోజే భారత్‌కు దొరికారు. ఫీల్డర్ల నుంచి సహకారం లేకపోరుునా... బౌలర్లు మాత్రం క్రమశిక్షణతో రాణించి మూడో టెస్టులో భారత్‌కు మంచి ఆరంభాన్నిచ్చారు. మొహాలీ: ఆరంభంలో బౌన్స... పాత బంతితో పేసర్ల రివర్స్ స్వింగ్... స్పిన్‌కు అనుకూలిస్తుందని భావించిన పిచ్ నుంచి సహకారం లేకపోరుునా బంతుల్లో వైవిధ్యంతో స్పిన్నర్లు... వెరసి బౌలర్ల సమష్టి కృషితో మూడో టెస్టు తొలి రోజును భారత్ సంతృప్తికరంగా ముగించింది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శనివారం ప్రారంభమైన మూడో టెస్టులో మొదటిరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలిఇన్నింగ్సలో 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. బెరుుర్‌స్టో (177 బంతుల్లో 89; 6 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్సతో అర్ధసెంచరీ చేయగా... బట్లర్ (80 బంతుల్లో 43; 5 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. స్టోక్స్ (29) పర్వాలేదనిపించాడు. ఆట ముగిసే సమయానికి రషీద్ (4 బ్యాటింగ్), బ్యాటీ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఉమేశ్, జయంత్, జడేజా తలా రెండు వికెట్లు తీసుకోగా... షమీ, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు. సెషన్ 1: ఆరంభంలో వికెట్లు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జాగ్రత్తగా ఇన్నింగ్‌సను ప్రారంభించింది. మూడు, పదో ఓవర్లలో షమీ బౌలింగ్‌లో కుక్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను జడేజా, అశ్విన్‌లు వదిలేయడంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. మరో ఎండ్‌లో డిఫెన్సకే ప్రాధాన్యమిచ్చిన హమీద్ (9)... ఉమేశ్ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండు బౌండరీలతో ధాటిగా ఇన్నింగ్‌సను ప్రారంభించిన రూట్ (15)కూడా ... వికెట్ల ముందు జయంత్‌కు దొరికిపోయాడు. అశ్విన్ తన తొలిబంతికే కుక్ (27)ను పెవిలియన్‌కు పంపించి ఇంగ్లండ్ వెన్నువిరిచాడు. దీంతో 51 పరుగులకే ఇంగ్లండ్ కీలకమైన మూడు వికెట్లను కోల్పోరుుంది. లంచ్ విరామానికి మరో రెండు ఓవర్లు ఉందనగా అలీ (16) వికెట్‌ను షమీ తీయడంతో సెషన్లో భారత్ ఆధిపత్యం కొనసాగింది. ఓవర్లు: 29; పరుగులు: 92; వికెట్లు: 4 సెషన్ 2: సూపర్ భాగస్వామ్యం ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ స్టోక్స్, బెరుుర్‌స్టో చెత్త బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును నడిపించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అద్భుతమైన బంతితో స్టోక్స్ (29)ను అవుట్ చేసి జడేజా ఈ జంటను విడదీశాడు. బట్లర్ అండతో 76 బంతుల్లో బెరుుర్‌స్టో అర్ధసెంచరీ మార్కును చేరుకున్నాడు. తర్వాత మరో వికెట్ పడకుండా ఈ జంట జాగ్రత్త పడింది. ఈ సెషన్లో పార్థీవ్ ఒక క్యాచ్ వదిలేశాడు. ఓవర్లు: 33; పరుగులు: 113; వికెట్లు: 1 సెషన్ 3: బ్యాటింగ్‌లో తడబాటు టీ విరామానంతరం జడేజా బౌలింగ్‌లో బట్లర్ (43) ఇచ్చిన క్యాచ్‌ను మిడాఫ్‌లో కోహ్లి ఒడిసిపట్టడంతో ఆరోవికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను పార్థీవ్ వదిలేశాడు. అనంతరం మరో ఆరు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందనగా బెరుుర్స్టోను... 89వ ఓవర్లో వోక్స్‌ను అవుట్ చేసి భారత బౌలర్లు రోజును ముగించారు. ఓవర్లు: 28; పరుగులు: 63; వికెట్లు 3 కోహ్లి, స్టోక్స్ వాగ్వాదం భారత కెప్టెన్ కోహ్లి, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్టోక్స్ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. రెండో సెషన్లో నిలకడగా ఆడుతోన్న స్టోక్స్‌ను రవీంద్ర జడేజా అవుట్ చేయడంతో కోహ్లిసేన సంబరాల్లో మునిగింది. వికెట్ కోల్పోరుున ఉక్రోశంలో ఉన్న స్టోక్స్... పెవిలియన్‌కు వెళ్తూ వెళ్తూ కోహ్లిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. దీంతో కోహ్లి కూడా స్టోక్స్‌ను ఉద్దేశించి జవాబు ఇచ్చాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. చివరికి కోహ్లి ఈ విషయంపై అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఈ ఉదంతంలో స్టోక్స్‌ను ఐసీసీ మందలించింది. అతని ఖాతాలో ఒక డీమెరిట్ పారుుంట్‌ను చేర్చింది. రాహుల్‌కు మళ్లీ గాయం భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ మళ్లీ గాయపడ్డాడు. విశాఖలో జరిగిన రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా తన ముంజేతికి గాయమైంది. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తను ఇబ్బందిపడ్డాడు. దీంతో రాహుల్ స్థానంలో కరుణ్ నాయర్ జట్టులోకి వచ్చాడు. గావస్కర్ చేతుల మీదుగా కరుణ్ టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు. ‘క్రికెట్లో ఫీల్డర్ల నుంచి క్యాచ్‌లు చేజారిపోవడం సాధారణమే. ఒక్కోసారి వారే అద్భుతమైన క్యాచ్‌లతో బౌలర్‌కి న్యాయం చేస్తారు. ఇదంతా ఆటలో భాగంగానే చూడాలి. రోజురోజుకీ నా ఆట పరిణతి చెందుతుంది. కుంబ్లే, సంజయ్ బంగర్ చెప్పిన విధంగా నా బౌలింగ్‌ను మార్చుకున్నాను. ఆఫ్ స్టంప్ ఆవల బంతుల్ని సంధించి మంచి ఫలితాలను సాధిస్తున్నాను.’ - ఉమేశ్ యాదవ్ -
ఇంగ్లండ్ 279/6
లండన్: బెయిర్ స్టో (107 బ్యాటింగ్) అజేయ సెంచరీతో చెలరేగడంతో... శ్రీలంకతో గురువారం ప్రారంభమైన మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్లకు 279 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి బెయిర్‌స్టో, వోక్స్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 84 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను కుక్ (85), బెయిర్‌స్టో ఐదో వికెట్‌కు 80 పరుగులు జోడించి ఆదుకున్నారు.