బిగ్‌బాస్ పని అయిపోయింది.. ఈ షో క్రేజ్ తగ్గిపోయింది.. దీన్నెవరు చూస్తారు? పరమ సోది.. ఇలా ఈ రియాలిటీ షో గురించి నానామాటలన్నారు. కారణం.. రానురానూ షోలో పస తగ్గింది. లీకులు ఎక్కువైపోయాయి. ఫేవరిజం పెరిగింది. కంటెస్టెంట్ల ఎంపిక, ఎలిమినేషన్‌పైనా తీవ్ర వ్యతిరేకత.. వెరసి.. బిగ్‌బాస్‌కు ఆదరణ తగ్గుతూ వచ్చింది. దీంతో ఎలాగైనా బిగ్‌బాస్‌కు పూర్వవైభవం తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు మేకర్స్.
19 మందితో బిగ్‌బాస్ 7
అందులో భాగంగానే సీజన్ 7ను ఉల్టాపల్టా పేరిట వినూత్నంగా మొదలుపెట్టారు. సెప్టెంబర్ 3న కేవలం 14 మంది మాత్రమే హౌస్‌లో అడుగుపెట్టారు. షో మొదలైన నెలరోజుల తర్వాత మరో ఐదుగురు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఈ సీజన్‌లో 19 మంది పాల్గొనగా ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఓటీటీల పుణ్యమా అని గంట ఎపిసోడ్ మాత్రమే కాకుండా 24 గంటల లైవ్ స్ట్రీమ్ కూడా హాట్‌స్టార్‌లో ప్రసారం చేస్తున్నారు. శని, ఆదివారాల్లో మాత్రం లైవ్ ఆపేసేవారు.
మిడ్‌వీక్ ఎలిమినేషన్.. హింటివ్వని నాగ్
మరో మూడు రోజుల్లో షోకి ఎండ్‌కార్డ్ పడనున్న తరుణంలో సడన్‌గా లైవ్ ఆపేశారు. గత సీజన్‌లో మిడ్‌వీక్ ఎలిమినేషన్‌కు ముందు కూడా ఇలాగే లైవ్ ఆపేశారు. కానీ అప్పటికి ఫైనలిస్టులను ఇంకా ప్రకటించలేదు. పైగా మిడ్‌వీక్ ఎలిమినేషన్ ఉందని హోస్ట్ జనాలను ముందే హెచ్చరించాడు. అన్నట్లుగానే శ్రీసత్యను వారం మధ్యలో ఎలిమినేట్ చేసి ఆ తర్వాత మిగిలిన ఐదుగురిని ఫైనలిస్టులుగా ప్రకటించారు. కానీ ఈసారి నాగార్జున మిడ్ వీక్ ఎలిమినేషన్ ఊసే ఎత్తలేదు. పైగా ఫైనలిస్టులను సైతం ప్రకటించేశాడు.
సడన్‌గా ఆగిపోయిన లైవ్
కానీ సడన్‌గా లైవ్ ఆపేశారు. దీంతో అసలు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా? లేదా? అని జనాలు అయోమయానికి లోనవుతున్నారు. అయితే సోషల్ మీడియా బజ్ చూస్తుంటే మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు 50-50 ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈసారి కప్పు కోసం టాప్ 6 గట్టిగానే కొట్టుకున్నారు. ఇప్పటిదాకా కంటెస్టెంట్లు శాయశక్తులా పోరాడగా ఇప్పుడు వారి అభిమానులు తమ ఫేవరెట్స్‌ను గెలిపించుకునేందుకు ఓట్లు గుద్దుతున్నారు. టైటిల్ రేసులో ప్రశాంత్, అమర్ ముందు వరుసలో ఉన్నారు. వీరి మధ్యే అసలైన పోటీ నడుస్తోంది. రేపటితో ఓటింగ్‌కు ఎండ్‌కార్డ్ పడనుంది. మరి ఆలస్యం చేయకుండా మీ అభిమాన కంటెస్టెంట్‌కు ఓటేసుకోండి.
Comments
Please login to add a commentAdd a comment