బిగ్‌బాస్ షోలో గీతూ రాయల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్ షోపై రివ్యూలు చెప్పుకునే ఈ యూట్యూబర్ ఆరో సీజన్‌లో అడుగుపెట్టి నానారచ్చ చేసింది. ఎలిమినేట్ అయినప్పుడు గుండె బాదుకుని ఏడ్చింది. అయితే ఈ షో వల్ల మనుషుల విలువ తెలిసిందని.. మరెన్నో నేర్చుకున్నానని చెప్పింది. ఇక ఏడో సీజన్‌లో బిగ్‌బాస్ బజ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది గీతూ. జనాలు అడగాలనుకున్న ప్రశ్నలన్నింటినీ కంటెస్టెంట్ల ముఖం పట్టుకుని అడిగేసింది. నాగార్జున సైతం టచ్ చేయని టాపిక్‌లను లేవనెత్తి మరీ వారిని ఇరకాటంలో పెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున హోస్ట్‌గా ఫెయిలయ్యాడంటోంది.
స్క్రిప్ట్ వస్తుందని తెలియదు
ఇంకా గీతూ మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే కంటెస్టెంట్లపై జనాలకు చాలా డౌట్స్ ఉంటాయి. అడగాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. నాగార్జున అడుగుతారనుకుంటే.. ఇప్పటివరకు ఆయన చేసిన సీజన్స్ అన్నింటిలోనూ చప్పచప్పగా ప్రశ్నలడిగేవారు. స్క్రూ టైట్ చేసే ప్రశ్నలు, బెండు తీసేలా ఎప్పుడూ మాట్లాడలేదు. కూల్‌గా వచ్చి కూల్‌గా మాట్లాడేసి వెళ్లిపోయారు. ఈ ఒక్క సీజన్‌కు మాత్రమే నాగార్జున కఠినంగా ఉన్నాడు. నాగార్జు హోస్ట్‌గా ఫెయిలయ్యారనే చెప్పాలి.. ఈ మాట ఎందుకన్నానంటే.. నాగార్జున ఎపిసోడ్స్ చూసి మాట్లాడతారనుకున్నాను. తనకు స్క్రిప్ట్ వస్తుందన్న విషయం నాకు తెలియదు.
నా తప్పు లేదు
ఆరో సీజన్‌లో చంటిగారు కీర్తిని వెటకారంగా మాట్లాడారు. అప్పుడు వీకెండ్‌లో రెండుసార్లు వీడియో తిప్పి తిప్పి చూపించి నాదే తప్పు అని ఒప్పించడానికి ప్రయత్నించారు. చంటి-కీర్తి విషయంలో నా తప్పే లేదు. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నాను. అలాంటివి జరిగినప్పుడు నాగార్జున స్టాండ్ తీసుకుని ఏది కరెక్ట్? ఏది తప్పు? అనేది గట్టిగా చెప్తే బాగుండేది. నా విషయంలోనే కాదు సన్నీ- షణ్ముఖ్ విషయంలోనూ సన్నీ తప్పు లేకపోయినా హౌస్ మొత్తానితో తనదే తప్పు అనిపించారు. ఇక బిగ్‌బాస్ బజ్‌లో నాగార్జున అడగలేకపోయిన వాటిని నేను అడిగాను' అని చెప్పుకొచ్చింది గీతూ.
చదవండి: గీతాంజలి, నిన్నే పెళ్లాడతా.. మిస్ అయ్యా! రెండోపెళ్లిపై ఏమందంటే?
Comments
Please login to add a commentAdd a comment