బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్స్ ఏదైన తప్పు చేసిన.. తప్పుడు మాటలు మాట్లాడినా.. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున ఫుల్ క్లాస్ తీసుకుంటాడు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఎవరు నోరు జారినా.. సహించడు. అలాంటి నాగ్.. సీజన్ 7లో మాత్రం శివాజీ బూతు పదాలు వాడినా.. అబద్దాలు ఆడినా.. జస్ట్ లైట్ అంటూ పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. అతను చేసిన తప్పులను కూడా ధైర్యంగా చెప్పలేక..సున్నితంగా హెచ్చరిస్తున్నారు.
అమ్మాయిలపై వెకిలి కూతలు
బిగ్‌బాస్ హౌస్‌లో గేమ్ ఆడకుండా పదివారాల పాటు నెట్టుకొస్తున్న ఏకైక కంటెస్టెంట్స్ శివాజీ. ఇప్పటి వరకు హౌస్‌లో శివాజీ పొడిచిందేమి లేదు కానీ.. మాయ మాటలతో కంటెస్టెంట్స్‌ని బురుడి కొట్టిస్తూ నెట్టుకొస్తున్నాడు. చెప్పేవి శ్రీరంగ నీతులు..చేసేవి దొంగ పనులు అన్నట్లుగా శివాజీ ప్రవర్తన ఉటుంది. ఇతురులకేమో ఇలా మాట్లాడొద్దు.. అలా ఆడొద్దని చెబుతాడు..తన వరకు వస్తే మాత్రం వెంటనే మాట మారుస్తాడు.
ఈ వారం నామినేషన్ ప్రక్రియలో రాజమాతలుగా వ్యవహరించిన శోభ, రతిక, ప్రియాంక, అశ్వినిలను ఉద్దేశిస్తూ..బూతులు వ్యాఖ్యలు చేశాడు. తన మాటని వినకపోవడంతో ‘రాజ మాతలు..**** పగుల్తాయ్’ అంటూ అసభ్యకర పదాలు వాడాడు. అందంతా రికార్డు అయింది. దాన్ని శనివారం ఎపిసోడ్‌లో కూడా మళ్లీ ప్లే చేశారు.
శివాజీ కాబట్టే..
అలాంటి బూతులు ఎవరైనా మాట్లాడితే.. నాగార్జున ఒంటికాలుపై లేస్తాడు. అమ్మాయిలను అలా అంటారా అంటూ రెచ్చిపోయి క్లాస్ పీకేవాడు. కానీ అక్కడ ఆ పిచ్చి కూతలు కూసింది శివాజీ కాబట్టి..సున్నితంగా హెచ్చరించి ముంగించేశాడు. ఇక మన నటరత్నం శివాజీ అయితే ఈజీగా మాట మార్చేస్తూ.. ‘నేనేదో సరదాగా అన్నాను బాబుగారు’ అంటూ కమల్ హాసన్ రేంజ్ ఫెర్పార్మెన్స్ ఇచ్చాడు. అది చూసి ఫిదా అయినా నాగ్..‘సరదాగానైనా సరే అలాంటి మాటాల్ని వాడకపోవడం మంచిది’అని సున్నితంగా హెచ్చరించి వదిలేశాడు.
అయితే అక్కడే షో చూస్తున్న ఓ ప్రేక్షకుడు మాత్రం శివాజీ సరదాగా ఆ మాటలు అనలేదని, ఇప్పుడేదో వివరణ ఇచ్చుకునేందుకు అలా చెబుతున్నాడని, ఆయన కోపంతోనే అన్నట్లుగా వీడియో చూస్తే అర్థమవుతుందని చెప్పాడు. అతనొక్కడే కాదు.. షో చూస్తున్న ప్రేక్షకులందరికి శివాజీ మాటమార్చారనే విషయం అర్థం అయింది. కానీ నాగార్జున మాత్రం అతన్ని గట్టిగా హెచ్చరించలేకపోయాడు. ఇతరుకు మాస్ వార్నింగ్ ఇచ్చే నాగార్జున.. శివాజీకి మాత్రం ‘క్లాస్’ గా క్లాస్ తీసుకుంటున్నాడు.
పోనీ..శివాజీ ఏమన్నా ఈ ఒక్కసారే అలా చేశాడా అంటే అదీ కాదు. గతంలో అనేకసార్లు ఇలాంటి బూతు వ్యాఖ్యలు చేశాడు. లెక్కలేనన్ని అబద్దాలు ఆడారు. గౌతమ్ కృష్ణ అప్పుడప్పుడు అతని నిజస్వరూపాన్ని బయటపెడతున్నాడు. కానీ శివాజీ మాత్రం తన నటనానుభవంతో తోటి కంటెస్టెంట్స్‌ని బురుడీ కొట్టిస్తున్నాడు.
శివాజీ కోసమే ఆ టాస్క్?
ఈ వారం కెప్టెన్సీ బరిలో శివాజీ, అర్జున్ ఉన్నారు. ఎలాంటి ఫిజికల్ టాస్క్ పెట్టిన అర్జున్ ఈజీగా గెలుస్తాడు. ఈ విషయం నాగార్జునతో పాటు బిగ్‌బాస్ నిర్వాహకులకు కూడా తెలుసు. అందుకే శివాజీని కెప్టెన్సీ చేయడం కోసం ఫిజికల్ టాస్క్ పెట్టకుండా హౌస్‌మేట్స్ నుంచి రహస్య అభిప్రాయ సేకరణ నిర్వహించారు. నిర్వాహకులు ఊహించినట్లే అంతా శివాజీకే ఓటు వేశారు. దీంతో వారనుకున్నట్లుగానే శివాజీని కెప్టెన్ అయ్యాడు. అయితే ఇక్కడ శివాజీ పొడిచిందేమి లేదనే విషయం షో చూస్తున్న ప్రేక్షకులందరికి తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment