
Asia Cup 2022 Broadcast: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం(ఆగష్టు 28) రాత్రి ఏడున్నర గంటలకు దాయాదుల పోరు ఆరంభానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీరాభిమానులు ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేశారు.
ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2022 టోర్నీ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రసారం చేయనుంది. మొబైల్‌లో వీక్షించేందుకు వీలుగా డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం జరుగనుంది. అయితే, ఈ రెండు మాధ్యమాల్లో మ్యాచ్‌లు చూడాలంటే తగినంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. క్రికెట్ వీరాభిమానులైతే కచ్చితంగా సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారనుకోండి!
అయితే, మెగా టోర్నీ మ్యాచ్‌లను టీవీలో ఫ్రీగా చూడాలనుకుంటున్న దేశీవాసులకు మాత్రం ఓ గుడ్‌న్యూస్! అదేమిటంటే.. భారత ప్రభుత్వానికి చెందిన దూరదర్శన్ ఆధ్వర్యంలోని డీడీ స్పోర్ట్స్, డీడీ ఫ్రీడిష్‌లో ఉచితంగా మ్యాచ్‌లు చూడవచ్చు.
కాగా దూరదర్శన్‌లో ఆసియా కప్ ప్రసారాలపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఫ్రీగా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ చూసే అవకాశం.. భలే బాగుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. ఇక అత్యధిక ఆసియా కప్ టైటిళ్లు గెలిచిన, డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా.. చిరకాల ప్రత్యర్థి పాక్‌తో మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రయాణాన్ని ఆరంభించనుంది.
చదవండి: Asia Cup 2022: ఆసియా కప్ ఎలా పుట్టిందో తెలుసా?.. ఆసక్తికర విషయాలు
It’s momentous. It’s legendary. It’s epic.💥 #AsiaCup2022 #INDvPAK
— Doordarshan Sports (@ddsportschannel) August 24, 2022
pic.twitter.com/cpHI0G4qm0