తుపాకితో కాలుస్తూ.. ఫేస్‌బుక్‌లో లైవ్! | US man 'live streams' gun shooting on Facebook | Sakshi
Sakshi News home page

తుపాకితో కాలుస్తూ.. ఫేస్‌బుక్‌లో లైవ్!

Published Sat, Apr 2 2016 2:07 PM | Last Updated on Fri, Aug 24 2018 8:02 PM

తుపాకితో కాలుస్తూ.. ఫేస్‌బుక్‌లో లైవ్! - Sakshi

తుపాకితో కాలుస్తూ.. ఫేస్‌బుక్‌లో లైవ్!

ఫేస్‌బుక్‌లో 'లైవ్ వీడియో' అనే ఫీచర్ మామూలువాళ్లకు ఎంతవరకు ఉపయోగపడుతోందో గానీ, దుర్వినియోగం చేసుకునేవాళ్లకు మాత్రం అది చక్కగా ఉంది. గన్ కల్చర్ వెర్రితలలు వేస్తున్న అమెరికాలో ఓ వ్యక్తి తుపాకితో వేరేవాళ్లను కాలుస్తూ ఆ దృశ్యాలను ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ కావడంతో షికాగో పోలీసులు దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

నీలిరంగు టోపీ పెట్టుకున్న ఓ వ్యక్తి ముందుగా షికాగోలోని వెస్ట్ ఈగిల్‌వుడ్ ప్రాంతంలో గల ఓ స్టోర్స్ బయట కెమెరా ఎదుట మాట్లాడుతూ కనిపించాడు. కొంతసేపటి తర్వాత, తుపాకి కాల్పుల మోత వినిపించి, కెమెరా వీధివైపు తిరిగింది. నిందితుడు కూడా ఫ్రేమ్‌లోకి వచ్చి కాల్పులు కొనసాగిస్తాడు. కాసేపటికి ఓ మహిళ అరుపులు వినిపించాయి. వీడియో నిజమైనదేనని షికాగో పోలీసులు నిర్ధారించారు. సోషల్ మీడియాలో ఉన్న ఈ వీడియో గురించి తమకు తెలుసని, నిందితుడి గురించి కూడా విచారణ జరుపుతున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ నిందితుడు పరారీలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement