తమిళనాడుకు రెడ్‌ అలర్ట్‌.. | IMD Says Rain Red Alert To Tamil Nadu | Sakshi
Sakshi News home page

తమిళనాడుకు రెడ్‌ అలర్ట్‌..

Published Wed, May 22 2024 12:46 PM | Last Updated on Wed, May 22 2024 12:46 PM

IMD Says Rain Red Alert To Tamil Nadu

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వాతావరణ శాఖ తమిళనాడులో రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 

కాగా, తమిళనాడులోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నీలగిరి పర్వత శ్రేణుల్లోనూ భారీ వర్షపాతం నమోదవుతుంది. ఊటీలోనూ కుండ పోత వర్షం కురుస్తుంది. దీంతో జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. ఇక, కన్యాకుమారి, టెన్‌కాశీ, కోయంబత్తూరు, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. 

 

 

ఇక, భారీ వర్షాల నేపథ్యంలో జనజీవనం స్తంభించిపోయింది. ఊటీలో కుండపోత కారణంగా పర్యాటకలు గదులకే పరిమితమయ్యారు. మరోవైపు.. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. దీంతో, అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement