సాక్షి, హైదరాబాద్: భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంతో.. తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మూడు రోజులపాటు కుండపోత వానలు ఉండడంతో అప్రమత్తం చేసింది.
మంగళవారం(నేటి) నుంచి మూడు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు కోరుతున్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని చెబుతున్నారు.
► పనులకు వెళ్లేవాళ్లు వర్షం పరిస్థితులు.. ట్రాఫిక్‌ను అంచనా వేసుకుని బయటకు రావాలని సూచిస్తున్నారు.
► పాత భవనాల్లో ఉంటున్నవాళ్లు తక్షణమే ఖాళీ చేయాలని సూచిస్తున్నారు.
► కరెంట్ పోల్‌ల విషయంలో జాగ్రత్తలు సూచిస్తున్నారు.
► రోడ్లపై వెళ్తున్నప్పుడు మ్యాన్ హోల్స్‌ను గమనించాలని సూచిస్తున్నారు.
► సీజనల్ వ్యాధులు చెలరేగే అవకాశం ఉన్నందున.. తాగే నీరు, అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ సైతం సూచిస్తోంది.
పలు జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్‌కు కుండపోత ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27 దాకా సెలవులు ప్రకటించాలంటూ పలువురు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment