శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు లేఖ | Bomb Threat letter to Shamshabad Airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు లేఖ

Published Fri, Feb 21 2014 12:33 PM | Last Updated on Tue, Aug 28 2018 7:22 PM

శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు లేఖ - Sakshi

శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు లేఖ

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బాంబు బెదిరింపు లేఖతో శుక్రవారం విమానాశ్రయ అధికారులు అప్రమత్తం అయ్యారు. దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది రెడ్ అలర్ట్ ప్రకటించారు.  ఢిల్లీ నుంచి వచ్చే విమానాన్ని పేల్చివేస్తామంటూ సెక్యూరిటీ అధికారికి లేఖ రావటంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు బెదిరింపు లేఖపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సీఐఎస్ఎఫ్ అధికారులు అప్రమత్తమై రెడ్ అలర్ట్ ప్రకటించారు. బెదిరింపు లేఖ వచ్చిన విషయాన్ని సీఐఎస్ఎఫ్ అదనపు డైరెక్టర్ ఓపీ సింగ్ కూడా ధ్రువీకరించారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన మర్నాడే ఇలాంటి లేఖ రావడంతో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారు. విమానాశ్రయానికి వచ్చి, వెళ్లే ప్రయాణికులతో పాటు సందర్శకులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement