నగరంలో ఏం జరిగింది? | What is happening in city | Sakshi
Sakshi News home page

నగరంలో ఏం జరిగింది?

Published Mon, Oct 19 2015 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM

నగరంలో ఏం జరిగింది?

నగరంలో ఏం జరిగింది?

 హైదరాబాద్‌లో జరిగే వినాయకుడి నిమజ్జనాన్ని కళ్లారా చూడాలని నలుగురు యువకులు తమ గ్రామం నుంచి నగరానికి వస్తారు. అక్కడ ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు. ఆ సంఘటనలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపుకి కారణం అయ్యాయి? అనే కథాంశంతో చంద్రమహేశ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రెడ్ అలర్ట్’. హెచ్.హెచ్. మహదేవ్, అంజనా మీనన్ జంటగా పీవీ శ్రీరామ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన తొలి సినిమాగా ‘ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ని సాధించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ‘‘కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి భారీ ఎత్తున ప్రేక్షకాదరణ లభించింది. తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చంద్రమహేశ్ తెలిపారు.

రవి, అమర్, తేజ, సుమన్, కె. భాగ్యరాజా, అలీ, పోసాని తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: శ్రీరామ్ చౌదరి, సంగీతం: రవివర్మ, కెమెరా: కల్యాణ్ సమి, సమర్పణ: యస్. త్రిలోక్‌రెడ్డి, సహనిర్మాత: శ్రీమతి  పిన్నింటి శ్రీరామ్ సత్యరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. జైపాల్‌రెడ్డి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement