విజయవాడలో రెడ్ అలర్ట్
- పోలీసుల విస్తృత తనిఖీలు
- అనుమానిత ప్రాంతాల్లో సోదాలు
- చెక్‌పోస్టుల్లో భద్రతా బలగాల మోహరింపు
విజయవాడ క్రైం, న్యూస్‌లైన్ : చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో గురువారం ఆగి ఉన్న గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానిత ప్రాం తాల్లో సోదాలు నిర్వహించడంతో పాటు నగరవ్యాప్తంగా వి స్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సహా పలువురు ఏఐసీసీ అగ్రనేతలు శుక్రవారం నగరానికి రానున్నారు.
దీం తో నగర పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో గురువారం ఉదయం బెంగళూరు-గౌహతి వయా గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో బాంబులు పేల డంతో గుంటూరుకు చెందిన యువతి మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో అన్ని జిల్లాల పోలీసులను అప్రమత్తం చేస్తూ రాష్ట్ర నిఘా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరులో వినియోగించేందుకు ర వాణా చేసే క్రమంలో చెన్నైలో బాంబులు పేలి ఉండొచ్చని నిఘా వర్గాలు భావించాయి. దీంతో ఇక్కడి పోలీసులను అప్రమత్తం చేసింది.
ఈ మేరకు నగర పోలీసులు తనిఖీలు చేపట్టారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో 10 నాటుబాంబులు దొరికాయి. అడవి జంతువులను చంపడానికి వీటిని ఉపయోగిస్తుంటారని గుర్తించారు. ఈ ఘటనలతో నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు ఆదేశాల మేరకు పోలీసులు అన్ని ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేశారు. ప్ర యాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేస్టేషన్, పండిట్ నెహ్రూ బస్టాండ్‌ల్లో తనిఖీలు ముమ్మరం చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఆయాచోట్ల నగర పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు. కనకదుర్గ ఆల యంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌తో పాటు సాయుధ పోలీసుల గస్తీని పెంచారు. గతంలో కోయంబత్తూరు బాం బు పేలుళ్ల కేసు నిందితులు ఇక్కడ ఆశ్రయం పొందడం, ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లోని చర్చిల్లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిన దీన్‌దార్ అంజుమన్ సభ్యులు నగరంలో మకాం చేసిన ఘటనలను పరిగణనలోకి తీసుకొని ఆయా ప్రాంతాల్లో తనిఖీలను విస్తృతం చేశారు.
ఆయా ప్రాంతాలతో పాటు అనుమానిత వ్యక్తులు ఆశ్రయం పొందేందుకు అవకాశం ఉందని భావిస్తున్న నగర శివారు ప్రాంతాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఆయా ప్రాం తాల్లో అనుమానిత వ్యక్తుల కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లాడ్జీల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తు న్నారు. మరో ఐదు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుం డటం.. ఎన్నికల ప్రచారం కోసం అన్ని పార్టీలకు చెందిన అ గ్రనేతలు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు, సిబ్బంది తనిఖీలను ముమ్మరం చేయాలని నగర పోలీసు కమిషనర్ ఆదేశించారు.
జిల్లా పోలీసు యంత్రాంగం కూడా అ న్ని భద్రతా చర్యలు చేపట్టింది. ఎన్నికల కోసం జిల్లా స రిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో భద్రతా బ లగాలను పెంచారు. జిల్లాకు రాకపోకలు సాగించే అన్ని వా హనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వదిలేస్తున్నారు. ఇక్కడ చేపట్టిన భద్రతా చర్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ఇంటిలిజెన్స్ అధికారులకు సమాచారం ఇస్తున్నట్టు ఓ సీని యర్ పోలీసు అధికారి తెలిపారు.