'ఇందిరకున్న సత్తా ఉంది.. ఆమె రావాల్సిందే' | Congress wants Priyanka Gandhi to enter active politics: Digvijaya Singh | Sakshi
Sakshi News home page

'ఇందిరకున్న సత్తా ఉంది.. ఆమె రావాల్సిందే'

Published Wed, May 18 2016 5:57 PM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM

'ఇందిరకున్న సత్తా ఉంది.. ఆమె రావాల్సిందే' - Sakshi

'ఇందిరకున్న సత్తా ఉంది.. ఆమె రావాల్సిందే'

న్యూఢిల్లీ: 'ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఎందుకంటే ఆమెకు ప్రజా నేతగా మారేంత సత్తా ఉంది' అని కాంగ్రెస్ పార్టీ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. ప్రియాంకకు తన నాయనమ్మ మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఉన్నంత సామర్థ్యం, తెలివితేటలు ఉన్నాయని చెప్పారు.

ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అమేథీ, రాయ్ బరేలీలో ప్రియాంకను ప్రచారానికి దింపుతారా అన్న ప్రశ్నకు అది వారి కుటుంబం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాహుల్ కు ఇంకా పార్టీ పగ్గాలు అప్పజెప్పకపోవడంపై స్పందిస్తూ దాని వల్ల పార్టీకి ఎలాంటి ఇబ్బందులు రావడం లేదని.. అయితే నిర్ణయం పార్టీ చీఫ్ సోనియాగాంధీ చేతిలో ఉందని అన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల గురించి ప్రశ్నించగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement