ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఎలాంటి చర్యలూ తీసుకోబోమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఎలాంటి చర్యలూ తీసుకోబోమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లును తిరస్కరిస్తూ సీఎం తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించడంపై దిగ్విజయ్ స్పందిస్తూ.. ఆయన నుంచి ఎలాంటి వివరణా కోరమని చెప్పారు.
శనివారం సాయంత్రం హైదరాబాద్ వచ్చిన ఆయన శంషాబాద్ లో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులతో సమావేశమయ్యారు. కేవీపీ రామచంద్రరావు, టి సుబ్బిరామిరెడ్డి, ఎంఏ ఖాన్.. దిగ్విజయ్ ను కలిశారు. రాష్ట్రం నుంచి ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, కాంగ్రెస్ తరపున ఈ ముగ్గురూ బరిలో నిలిచారు. రాష్ట్ర విభజన అంశం గురించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో పూర్తి స్వేచ్ఛ ఉందని, ఆవిధంగా ముఖ్యమంత్రి మాట్లాడి ఉంటారని దిగ్విజయ్ అన్నారు.