దమ్ముంటే పేర్లు బయటపెట్టండి: దిగ్విజయ్ సింగ్ | Black money: Digvijay Singh dares Centre to reveal names of Black money account holders | Sakshi
Sakshi News home page

దమ్ముంటే పేర్లు బయటపెట్టండి: దిగ్విజయ్ సింగ్

Published Thu, Oct 30 2014 3:40 PM | Last Updated on Wed, Apr 3 2019 8:09 PM

దమ్ముంటే పేర్లు బయటపెట్టండి: దిగ్విజయ్ సింగ్ - Sakshi

దమ్ముంటే పేర్లు బయటపెట్టండి: దిగ్విజయ్ సింగ్

సంభాల్: దమ్ముంటే నల్ల కుబేరుల పేర్లను బయటపెట్టాలని కేంద్రానికి  కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సవాల్ విసిరారు. కేంద్రానికి కొంచమైనా ధైర్యముంటే విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న ఖాతాల, వ్యక్లుల పేర్లను బయటపెట్టాలని దిగ్విజయ్ డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లో సంభాల్ లోని కల్కి మహోత్సవాలను ప్రారంభించానికి వచ్చిన దిగ్విజయ్ మీడియాతో మట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
వంద రోజుల్లో నల్లధనాన్ని వెనక్కి తెప్పించి, ప్రతి ఒక్క వ్యక్తి ఖాతాలో మూడు లక్షల రూపాయలు జమ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్ధానాల్ని అమలు చేయడంలో నరేంద్రమోడీ, బీజేపీ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. 
 
జన్ ధన్ కార్యక్రమం కోసం ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఖాతా నెంబర్ ను ప్రధాని నరేంద్రమోడీకి పంపి..ఐదు లక్షల రూపాయలు జమ చేయమని ప్రజలు డిమాండ్ చేయాలని దిగ్విజయ్ సూచించారు. కాంగ్రెస్ లేదా బీజేపీ లోని ఎవరైనా సరే నోటీసులందుకున్న తర్వాత జవాబివ్వాల్సిందేనని దిగ్విజయ్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement