guwahati express
-
నిలిచిన గువాహటి ఎక్స్‌ప్రెస్
దొరవారిసత్రం: గువాహటి నుంచి బెంగళూరు వెళ్లాల్సిన గువాహటి ఎక్స్‌ప్రెస్ వర్షం కారణంగా నిలిచి పోయింది. నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం పోలిరెడ్డిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన రైల్వే యంత్రాంగం రైలును స్టేషన్లో నిలిపివేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
పట్టాలు తప్పిన గౌహతి ఎక్స్‌ప్రెస్
ఎర్రగుంట్ల : వైఎస్సార్ జిల్లా నందలూరు సమీపంలో మంటపంపల్లి వద్ద మంగళవారం ఉదయం గౌహతి-చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఎక్స్‌ప్రెస్ రెండు బోగీలు పట్టాలు తప్పాయి, ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఆ బోగీలలో ఉన్న ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు రైలు మార్గాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఎర్రగుంట్లలో హరిప్రియ ఎక్స్‌ప్రెస్‌ను, కమలాపురంలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ను, భాకరాపేటలో చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రైల్వే అధికారులు వివరించారు. -
రైలుపై రాళ్లు, ప్రయాణికులకు గాయాలు
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్ల రైల్వే స్టేషన్లో గౌహతి ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణీకులు గాయపడ్డారు. రైలు సిగ్నల్ కోసం స్టేషన్లో గంట సేపు వేచి ఉంది. ఈ సమయంలో రాళ్లు రువ్వడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం గూంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తక్షణమే స్పందించి నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్ కు తరలించారు. -
చెదిరిన స్వాతి కలలు
సీటు మారడం వల్లే ప్రమాదం పీటలెక్కని ప్రేమ వివాహం మృతురాలు స్వాతి దీనగాథ చెన్నై, సాక్షి ప్రతినిధి : అందరినీ అలరిస్తూ ఆటపాటలతో తడిసిముద్దచేసే ‘స్వాతి’ కలలు చెదిరిపోయూయి. తల్లిదండ్రులతో ముచ్చట్లు, బామ్మతో కబుర్లు, ప్రేమించిన వ్యక్తితో వివాహం...ఇలా ఆమె కన్నకలలను రైలు బాంబు కబళించివేసింది. ఇటీవలే చేరిన ఉద్యోగంలో విరామం తీసుకుని తల్లిదండ్రులను కలుసుకునేందుకు బెంగళూరులో బయలుదేరింది. తనను అమితంగా ప్రేమించే అవ్వకు బహుమతులు, కుటుంబ సభ్యులకు తినుబండారాలను సిద్ధం చేసుకుంది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లోనే ఆలస్యం కావడంతో పరుగుపరుగున ఆటోలో రైల్వే స్టేషన్‌కు చేరుకుని బెంగళూరు- గువాహటి ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. ఆమెకు అప్పుడు తెలియదు తాను మృత్యుకుహరంలోనే కూర్చుంటున్నానని. తనతో పాటు రైలు ఎక్కిన చెన్నైకి చెందిన స్నేహితురాలు రజితతో కలిసి వారికి కేటాయించిన సీటు నెంబరు 9,10లో కూర్చున్నారు. అయితే ఒక కుటుంబం వచ్చి ‘ప్లీజ్ 23, 24 సీట్లలో కూర్చుంటారా’ అని అడిగింది. స్నేహశీలైన స్వాతి సంతోషంగా అంగీకరించింది. మంచి ఉద్యోగం, ఇంటివారికి బహుమతులు వారిని కలవబోతున్నామనే ఆనందం, తాను ప్రేమించిన వ్యక్తితో జరగనున్న వివాహం ఆమెను నిద్రపోనివ్వలేదు. అలాగే గుంటూరులోని వారింటిలో కూడా ఎపుడు తెల్లారుతుందా, స్వాతి వస్తుందా అని జాగారం చేశారు. సీటు మారడంతో దురదృష్టం ఆమె వెన్నంటే నిలిచింది. వారు కూర్చున్న సీటు కిందనే బాంబును అమర్చి ఉన్నారు. చెన్నై రాగానే స్నేహితురాలికి టాటా చెప్పి సాగనంపింది. ఆ వెంటనే పెద్ద శబ్దంతో బాంబు పేలడంతో స్వాతి కన్నుమూసింది. పేలుడు జరగడంతో వెంటనే వెనక్కు వచ్చిన స్నేహితురాలి రజిత కన్నీరుమున్నీరైంది. వెళ్లొస్తానని చెప్పింది... ఇలా వెళ్లిపోతుందని అనుకోలేదంటూ విలపించింది. తెల్లారగానే వచ్చిన ఫోన్‌ను అందుకున్న స్వాతి తండ్రి రామకృష్ణన్, తల్లి కామాక్షిదేవి, బామ్మ రాజ్యలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బీటెక్‌లో 91 శాతం మార్కులతో వర్సిటీ పరిధిలోనే మెరుగైన ర్యాంకును సొంతం చేసుకున్నారు. స్వాతి. చిత్రలేఖనం, కవిత, ఫొటోగ్రఫీలలో దిట్ట. బీటెక్ ఉత్తీర్ణతలో సాధించిన ఉత్సాహంతో ఎంటెక్ పూర్తిచేసి క్యాంపస్ సెలక్షన్ ద్వారా బెంగళూరులో ఉద్యోగం పొందారు. పరిచయం లేని ఊరు వద్దన్నారు పెద్దలు. అందివచ్చిన తొలి ఉద్యోగం వద్దనకూడదంటూ వారికి నచ్చజెప్పి స్వాతి బెంగళూరు వెళ్లిపోయారు. జనవరిలో తొలి జీతంతో బామ్మకు సెల్‌ఫోన్ కొనిచ్చారు. ప్రతిరోజు రాత్రి స్వాతితో మాట్లాడితేగానీ నిద్రపోను, ఇక తనను నిద్రపుచ్చేదెవరని బామ్మ కన్నీరుమున్నీరయ్యూరు. కాలేజీలోనే ప్రేమ హైదరాబాద్‌లో చదువుతుండగానే తన సహ విద్యార్థిని ఆమె ప్రేమించారు. అయితే సాధారణ కుటుంబం, బాధ్యతలు ఉండటం వల్ల పెళ్లివాయిదా వేద్దామని చెప్పి అతడిని ఆమె ఒప్పించారు. ఆతను సైతం ఆనందంగా అంగీకరించాడు. ఈ దశలో ప్రేమికునికి ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. వెంటనే స్వాతి తన ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. వారుసైతం అంగీకరించారు. మరో నెలన్నర రోజుల్లో వారిద్దరి వివాహం జరిపేలా నిశ్చయించారు. చక్కనైన ఉద్యోగం, పెద్దల అనుమతితో ప్రేమించిన వ్యక్తితో వివాహం వంటి రంగుల రంగుల కలలు కంటున్న స్వాతిని రైలు బాంబు కబళించివేసింది, భవిష్యత్తుపై ఆమె కన్న కలల ఆమె దేహం మాదిరే ఛిద్రమైపోయాయి. ఆమెను అభిమానించి, ప్రేమించే వారిని కన్నీటి సంద్రంలోకి నెట్టివేశాయి. -
విజయవాడలో రెడ్ అలర్ట్
పోలీసుల విస్తృత తనిఖీలు అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చెక్‌పోస్టుల్లో భద్రతా బలగాల మోహరింపు విజయవాడ క్రైం, న్యూస్‌లైన్ : చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో గురువారం ఆగి ఉన్న గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానిత ప్రాం తాల్లో సోదాలు నిర్వహించడంతో పాటు నగరవ్యాప్తంగా వి స్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సహా పలువురు ఏఐసీసీ అగ్రనేతలు శుక్రవారం నగరానికి రానున్నారు. దీం తో నగర పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో గురువారం ఉదయం బెంగళూరు-గౌహతి వయా గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో బాంబులు పేల డంతో గుంటూరుకు చెందిన యువతి మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో అన్ని జిల్లాల పోలీసులను అప్రమత్తం చేస్తూ రాష్ట్ర నిఘా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరులో వినియోగించేందుకు ర వాణా చేసే క్రమంలో చెన్నైలో బాంబులు పేలి ఉండొచ్చని నిఘా వర్గాలు భావించాయి. దీంతో ఇక్కడి పోలీసులను అప్రమత్తం చేసింది. ఈ మేరకు నగర పోలీసులు తనిఖీలు చేపట్టారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో 10 నాటుబాంబులు దొరికాయి. అడవి జంతువులను చంపడానికి వీటిని ఉపయోగిస్తుంటారని గుర్తించారు. ఈ ఘటనలతో నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు ఆదేశాల మేరకు పోలీసులు అన్ని ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేశారు. ప్ర యాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేస్టేషన్, పండిట్ నెహ్రూ బస్టాండ్‌ల్లో తనిఖీలు ముమ్మరం చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయాచోట్ల నగర పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు. కనకదుర్గ ఆల యంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌తో పాటు సాయుధ పోలీసుల గస్తీని పెంచారు. గతంలో కోయంబత్తూరు బాం బు పేలుళ్ల కేసు నిందితులు ఇక్కడ ఆశ్రయం పొందడం, ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లోని చర్చిల్లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిన దీన్దార్ అంజుమన్ సభ్యులు నగరంలో మకాం చేసిన ఘటనలను పరిగణనలోకి తీసుకొని ఆయా ప్రాంతాల్లో తనిఖీలను విస్తృతం చేశారు. ఆయా ప్రాంతాలతో పాటు అనుమానిత వ్యక్తులు ఆశ్రయం పొందేందుకు అవకాశం ఉందని భావిస్తున్న నగర శివారు ప్రాంతాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఆయా ప్రాం తాల్లో అనుమానిత వ్యక్తుల కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లాడ్జీల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తు న్నారు. మరో ఐదు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుం డటం.. ఎన్నికల ప్రచారం కోసం అన్ని పార్టీలకు చెందిన అ గ్రనేతలు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు, సిబ్బంది తనిఖీలను ముమ్మరం చేయాలని నగర పోలీసు కమిషనర్ ఆదేశించారు. జిల్లా పోలీసు యంత్రాంగం కూడా అ న్ని భద్రతా చర్యలు చేపట్టింది. ఎన్నికల కోసం జిల్లా స రిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో భద్రతా బ లగాలను పెంచారు. జిల్లాకు రాకపోకలు సాగించే అన్ని వా హనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వదిలేస్తున్నారు. ఇక్కడ చేపట్టిన భద్రతా చర్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ఇంటిలిజెన్స్ అధికారులకు సమాచారం ఇస్తున్నట్టు ఓ సీని యర్ పోలీసు అధికారి తెలిపారు. -
పోలీసుల అప్రమత్తం
నెల్లూరు(నవాబుపేట), న్యూస్‌లైన్: చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో గురువారం బాంబుపేలుళ్ల నేపథ్యంలో ఇక్కడ రైల్వేపోలీసులు అప్రమత్తమయ్యారు. రైల్వేస్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ఒకవైపు నరేంద్రమోడీ బహిరంగ సభ, మరోవైపు గౌహతీ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్లు జరగడంతో తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. పినాకినీ ఎక్స్‌ప్రెస్‌లోని బోగీలో గుర్తు తెలియని సూట్‌కేస్‌ను ప్రయాణికులు గుర్తించి నెల్లూరు రైల్వేపోలీసులకు సమాచారం ఇచ్చారు. నెల్లూరు స్టేషన్‌లోని మూడో నంబర్ ఫ్లాట్‌పారంపై సూట్‌కేస్‌ను రైల్వేపోలీసులు దింపారు. బాంబ్‌స్క్వాడ్‌కు సమాచారం అందించారు. ఈ లోపు సూట్‌కేస్ సంబంధీకులు అక్కడికి చేరుకున్నారు. బాంబ్‌స్క్వాడ్ వచ్చి పరీక్షించిన అనంతరం సూట్‌కేస్‌ను తెరచి చూశారు. అందులో పెళ్లి వస్తువులు ఉండటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పెళ్లి వస్తువుల సూట్కేసే.. విజయవాడ రామానగర్‌లో నివసించే పొదిలి వెంకటేశ్వర్లు, నరసమ్మ కుమార్తె పద్మావతిని బుచ్చిరెడ్డిపాళెం రేబాల నివాసి శ్యామ్‌బాబుతో పెళ్లి కుదిరింది. గురువారం రాత్రి జరగబోయే పెళ్లికి పెళ్లికూతురు బంధువులతో కలిసి గురువారం ఉదయం 6 గంటలకు విజయవాడ నుంచి నెల్లూరు వచ్చేందుకు పినాకినీ ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ బోగీలో ఎక్కారు. దాదాపు 25 మంది పెళ్లి బృందం ఉండటంతో మూడు బోగీలలో ఎక్కారు. పెళ్లి ప్రతాణ వస్తువులున్న సూట్‌కేస్ బోగీలోనే వదిలి నెల్లూరు రైల్వేస్టేషన్లో దిగి వెళ్లిపోయారు. కొంత దూరం వెళ్లిన తర్వాత సూట్‌కేస్ విషయమై జ్ఞాపకం రావడంతో తిరిగి వచ్చారు. అప్పటికే సూట్‌కేస్‌ను రైల్వే ఎస్సై సుభాన్ తనిఖీ చేపట్టారు. సూట్‌కేస్ తమదే అని వివరణ ఇచ్చారు. వారిని రైల్వే డీఎస్పీ రాజేంద్రకుమార్ వద్దకు తీసుకెళ్లి విచారించారు. అనంతరం వివరాలు తీసుకొని వారిని పంపించారు. -
ఉలిక్కిపడ్డ చెన్నై
సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజధాని నగరం ప్రశాంతతకు నిలయం. ఉద్యోగ రీత్యా స్థిరపడ్డ వాళ్లు, వివిధ పనుల నిమిత్తం చెన్నైకు వచ్చి వెళ్లే వారు ఇక్కడ లక్షల్లో ఉన్నారు. ఈ నగరం తీవ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉన్నా విధ్వంసకర సంఘటనలు మాత్రం ఇంతవరకు చోటు చేసుకోలేదు. ఒకప్పుడు అన్నా వంతెనను పేల్చేందుకు బాంబు దాడి జరిగింది. అది పెను ప్రమాదాన్ని సృష్టించలేదు. ఆ తర్వాత ఎప్పుడూ రాజధాని నగరంలో ఎలాంటి విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకోలేదు. కోయంబత్తూరు, మదురై, తిరుచ్చిలో పేలుడు ఘటనలు జరిగినా, కుట్రలు చేసినా ఆ ప్రభావం రాజధాని నగరం మీద పడలేదు. 2009 ఏప్రిల్ 29న చెన్నై సబర్బన్ స్టేషన్ నుంచి విద్యుత్ రైలు హైజాక్‌కు గురికావడం, వ్యాసార్పాడి వద్ద ఆ రైలు ప్రమాదం బారిన పడడంతో నగర వాసులతోపాటు రైలు ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఇది జరిగి ఐదేళ్లు అవుతున్నా, ఇంత వరకు విచారణ పూర్తికాలేదు. సరిగ్గా ఐదేళ్లకు చెన్నై సెంట్రల్ వేదికగా మరో ఘటన చోటు చేసుకోవడం ప్రజల్ని ఉలిక్కి పడేలా చేసింది. నగరంలో అసాంఘిక శక్తులు నగరంలో పోలీసులు అను నిత్యం నిఘాతో వ్యవహరిస్తున్నా అసాంఘిక శక్తులు చాపకింద నీరులా తమ పనితనాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇటీవల విద్యార్థి ముసుగులో నిషేధిత సిమి తీవ్రవాద సంస్థ మద్దతుదారుల కార్యకలాపం వెలుగు చూసింది. రాజధానిలో నక్కి ఉన్న వీరిని కేంద్ర నిఘా వర్గాలు వచ్చి పట్టుకెళ్లే వరకు నగర పోలీసులు నిద్రావస్థలో ఉండడం గమనార్హం. అలాగే ఉగ్రవాది బిలాల్ కూడా చెన్నైలో కొన్నాళ్లు తిష్ట వేసినట్టుగా కేంద్రం పేర్కొనడం, గత ఏడాది అజ్ఞాత తీవ్రవాదులు తొలుత చెన్నైలో చిక్కడం, ఇక్కడ సాగుతున్న దొంగ నోట్ల వ్యవహారం, స్మగ్లింగ్ తదితర వ్యవహారాలు వెరసి రాజధాని నగరం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. మంగళవారం రాత్రి చెన్నైలో ఐఎస్ఐ తీవ్రవాది జాకీర్ హుస్సేన్, మరుసటి రోజు అతడి మద్దతుదారులు పట్టుబడటం, ఆ మరుసటి రోజు సెంట్రల్లో పేలుడు చోటు చేసుకోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. నిఘా కట్టుదిట్టం కేంద్రం నుంచి రాష్ట్రానికి తరచూ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. అలాగే బూచీల సంఖ్య పెరుగుతోంది. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరిస్తోంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే తీవ్రంగా స్పందిస్తామన్నట్టుగా పోలీసు యంత్రాంగం పరిస్థితి ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రమాదం అనంతరం మేల్కొన్న రైల్వే, నగర పోలీసు యంత్రాంగం హడావుడి సృష్టించాయి. చెన్నైలోని సబర్బన్ స్టేషన్లలో నిఘా కట్టుదిట్టం చేశారు. ఎగ్మూర్ స్టేషనల్లో ఆరంచెల భద్రత పెంచారు. సెంట్రల్, ఎగ్మూర్ స్టేషన్లలో అడుగడుగునా బాంబ్, డాగ్ స్క్వాడ్లు తనిఖీలు చేశాయి. ప్రతి రైలును అనువనువు పరిశీలించారు. గతంలో కేంద్రం నుంచి వచ్చిన సమాచారం మేరకు అన్నా వంతెన(జెమిని), ఎల్ఐసీ, జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాల్ని నిఘా వలయంలోకి తెచ్చారు. తాజా ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన స్టేషన్లు విల్లుపురం, తిరుచ్చి, మదురై, కోయంబత్తూరు, తిరునల్వేలి, సేలంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంతో పాటు అన్ని విమానాశ్రయూల్లో నిఘాను పటిష్టం చేశారు. తనిఖీల పేరుతో ఎక్కడి రైళ్లను అక్కడే ఆపడంతో సుమారు గంటన్నర ఆలస్యంగా నడిచారుు. దీంతో ప్రయూణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పరుగులు సెంట్రల్లో ఉదయాన్నే బాంబులు పేలినట్టు టీవీల్లో వచ్చిన వార్తలతో జనం ఉలిక్కి పడ్డారు. సంఘటనా స్థలాన్ని చూడడానికి పెద్ద ఎత్తున పరుగులు తీశారు. వారిని కట్టడి చేసేందుకు భద్రతా సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. తమ వాళ్లెవరైనా ఉన్నారా..? అన్న ఆందోళనలో పడ్డ అనేక మంది ఉత్కంఠతో హెల్ప్లైన్ల ద్వారా సమాచారం సేకరించే పనిలో పడ్డారు. -
మిన్నంటిన క్షతగాత్రుల ఆర్తనాదాలు
సాక్షి, చెన్నై:గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలు బాధితుల ఆర్తనాదాలతో జీహెచ్ మార్మోగిం ది. కాళ్లకు తగిన గాయాలతో కొందరు. తలకు తగిలిన గాయాలతో మరికొం దరు నరకయాతన అనుభవించారు. సెలవు మీద ఇంటికి వెళుతూ కొందరు, పనుల నిమిత్తం వెళుతూ మరి కొందరు పేలుడు రూపంలో ఆస్పత్రి పాలయ్యా రు. వీరి ని ఓదార్చేందుకు నేతలు జీహెచ్‌కు పరుగులు పెట్టారు. తమ వంతు భరోసా ఇచ్చారు. చెన్నై సెంట్రల్లో బెం గళూరు - చెన్నై - గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నారుు. ఇందులో గాయపడిన వారిని రాజీవ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎస్-3, ఎస్-4, ఎస్-5 బోగీల్లో నిద్రిస్తున్న వారు కొందరు, స్టేషన్ వచ్చినట్టుందే అని నిద్ర లేచి చూసిన వారు కొందరు. ఉన్నట్టుండి వచ్చిన శబ్దంతో ఏమి జరి గిందో తెలియని పరిస్థితి. చివరకు ఆస్పత్రిలో క్షతగాత్రులుగా కొందరు మిగలాల్సి వచ్చింది. వీరిలో సీమాంధ్రకు చెందిన ఇద్దరు యువకులు ఉన్నారు. అలాగే ఉత్తరాదికి చెందిన వారు ఎక్కు వ మంది ఉన్నారు. కాళ్లకు తగిలిన పెద్ద గాయాలతో కొందరు, తలకు తగిలిన గాయాలతో మరికొందరు చేస్తున్న ఆర్తనాదాలు వర్ణణాతీతం. తమకు ఈ గాయాలు ఎలా అయ్యాయో కూడా తెలి యని వారూ ఉన్నారు. నిద్రలో ఉన్నామని, కళ్లు తెరిచి చూస్తే ఆస్పత్రిలో ఉన్నామంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. బెర్త్ రూపంలో తాము గాయాలపాలయ్యామంటూ ఒకరు, తన సీటు కిందే బాంబు పేలిందంటూ మరొకరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం వైద్య సేవలు ప్రమాద సమాచారంతో సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న రాజీవ్ గాంధీ ఆస్పత్రి(జీహెచ్) ఎమర్జెన్సీలో సర్వం సిద్ధం చేశారు. క్షతగాత్రుల్ని అంబులెన్స్‌ల్లో హుటా హుటిన ఆస్పత్రి వద్దకు తీసుకురాగానే అక్కడి సిబ్బంది ఆగమేఘాలపై ఎమర్జెన్సీలో వైద్య సేవల్ని అందించారు. ఓవైపు మీడియా హడావుడి, మరో వైపు ఇతర ప్రమాదాలతో ఎమర్జెన్సీకి వచ్చిన వారి ఆర్తనాదాలు వెరసి ఆ పరిసరాల్లో ఉత్కంఠను రేపాయి. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి వచ్చిన 14 మందిలో ఇద్దరి పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో శస్త్ర చికిత్సలు చేయాల్సి వచ్చింది. పరామర్శలు ప్రమాద సమాచారం తెలియగానే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వలర్మతి నేరుగా జీహెచ్ చేరుకున్నారు. ప్రమాదంలో మరణించిన గుంటూరుకు చెంది న స్వాతి మృతదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. గాయాలతో ఆస్పత్రిలో ఉన్న వారిని ఓదార్చారు. వీసీకే నేత తిరుమావళవన్, కాంగ్రెస్ నేత విజయ ధరణి, డీఎంకే నేత టీకేఎస్ ఇళంగోవన్, కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జీకే వాసన్ బాధితులను పరామర్శించారు. సెలవు మీద వెళుతూ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగో లు సమీపంలోని చీరాలకు చెందిన ఆంజేయులు బెంగళూరులో సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. చెన్నైకు చెందిన స్నేహితుడు ప్రదీప్‌తో కలిసి బెంగళూరులో బుధవారం రాత్రి రైలు ఎక్కారు. చెన్నైలో ప్రదీప్ దిగేశారు. సైడ్ బెర్త్ తనకు కేటాయించినప్పటికీ, ఖాళీ గా ఉండడంతో సెంటర్ బెర్త్‌లో వెళ్లి ఆం జేయులు నిద్రకు ఉపక్రమించారు. అదే బెర్త్ కింద పేలుడు జరగడంతో కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమాచారంతో ప్రదీప్ వెనక్కి వచ్చి మిత్రు డికి సాయంగా ఆస్పత్రిలో సహకారం అందించడంతోపాటు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఇంటర్వ్యూలకు వెళ్లి వస్తూ వైజాగ్‌కు చెందిన పి.మురళి బెంగళూరులో ఓ ఇంటర్వ్యూకు వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని తిరుగు ప్రయూణంలో ఉండగా బాంబు పేలుడులో గాయపడి చికిత్స పొందుతున్నాడు. -
రైల్వే స్టేషన్లో హై అలర్ట్
ఆర్పీఎఫ్, జీఆర్పీ, సివిల్ పోలీసుల సంయుక్త తనిఖీలు కర్నూలు, న్యూస్‌లైన్: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో జంట పేలుళ్ల సంఘటన నేపథ్యంలో జిల్లాలో రైల్వే స్టేషన్లో హై అలర్ట్ ప్రకటించారు. చెన్నై పేలుళ్ల సంఘటన జరిగిన గంట వ్యవధిలోనే విజయవాడ రైల్వే స్టేషన్లో కూడా పోలీసులకు నాటు బాంబులు లభించడంతో గురువారం జిల్లాలోని కర్నూలు, నంద్యాల, డోన్ రైల్వే స్టేషన్లలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో పాటు రైల్వే పోలీసులు కూడా అప్రమత్తమై రంగంలోకి దిగారు. ఆర్పీఎప్, జీఆర్పీ, సివిల్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ప్లాట్ఫారం బయట, లోపల, రైల్వే స్టేషన్ చుట్టు పక్కల క్లాక్ రూమ్స్‌లో సోదాలు చేశారు. కర్నూలులో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్నజీముద్దీన్, జీఆర్పీ సీఐ వివి.నాయుడు, రెండవ పట్టణ సీఐ బాబు ప్రసాద్ నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. అనుమానితులు, బ్యాగులు సోదాలు చేశారు. అలాగే గుంటూరు-కాచిగూడ, గుంతకల్లు-కాచిగూడ ప్యాసింజర్ రైళ్లలో పెట్టెల వారీగా తనిఖీలు చేపట్టారు. నంద్యాలలో ఐదు రైళ్లు, డోన్‌లో నాలుగు రైళ్లు, కర్నూలులో రెండు రైళ్లు కలిపి మొత్తం 11 రైళ్లల్లో తనిఖీలు నిర్వహించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. తీవ్రవాదుల పేలుళ్లపై అనుమానం వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లకు, రైల్వే పోలీసులకు తక్షణమే సమాచారం ఇవ్వాలంటూ పోలీసు, రైల్వే అధికారులు ప్రయాణికులకు తగు సూచనలు చేశారు. అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కర్నూలు రైల్వే స్టేషన్లో ఆ చివర నుంచి ఈ చివరి వరకు దాదాపు గంటపాటు పోలీస్ జాగిలంతో పాటు బాంబు స్క్వాడ్ బృందంతో సోదాలు నిర్వహించారు. ఒకేసారి పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహిస్తుండటంతో ఏమి జరిగిందోనని కొంత మంది ప్రయాణికులు ఆందోళనకు లోనయ్యారు. -
పోలీసులు అదుపులో 300 మంది అనుమానితులు
-
పోలీసులు అదుపులో 300 మంది అనుమానితులు
ఈ రోజు తెల్లవారుజామున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అనంతరం దాదాపు 300 మంది ప్రయాణీకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరిని సికింద్రాబాద్ లోని టీవోలీ సినిమా హాల్ సమీపంలోని కేజేఆర్ గార్డెన్ కు తరలించి విచారిస్తున్నారు. వారిలో కొంత మందిని పోలీసులు విచారించిన పంపించారు. బంగ్లాదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అక్రమంగా వలస వస్తున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో అధికమైందని నిఘా వర్గాలు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సోదాలు నిర్వహించినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. తమ ఆదుపులో ఉన్న వారికి ఉగ్రవాద కార్యకలాపాలతో ఏమైన సంబంధాలు ఉన్నాయా లేదా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన వివరించారు. పూర్తి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడించగలమని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.