మిన్నంటిన క్షతగాత్రుల ఆర్తనాదాలు | Two blasts in Bangalore-Guwahati Express at Chennai | Sakshi
Sakshi News home page

మిన్నంటిన క్షతగాత్రుల ఆర్తనాదాలు

Published Thu, May 1 2014 11:54 PM | Last Updated on Sat, Aug 25 2018 6:52 PM

Two blasts in Bangalore-Guwahati Express at Chennai

సాక్షి, చెన్నై:గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలు బాధితుల ఆర్తనాదాలతో జీహెచ్ మార్మోగిం ది. కాళ్లకు తగిన గాయాలతో కొందరు. తలకు తగిలిన గాయాలతో మరికొం దరు నరకయాతన అనుభవించారు. సెలవు మీద ఇంటికి వెళుతూ కొందరు, పనుల నిమిత్తం వెళుతూ మరి కొందరు పేలుడు రూపంలో ఆస్పత్రి పాలయ్యా రు. వీరి ని ఓదార్చేందుకు నేతలు జీహెచ్‌కు పరుగులు పెట్టారు. తమ వంతు భరోసా ఇచ్చారు. చెన్నై సెంట్రల్‌లో బెం గళూరు - చెన్నై - గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నారుు. ఇందులో గాయపడిన వారిని రాజీవ్ గాంధీ ఆస్పత్రికి    
 
  తరలించారు. ఎస్-3, ఎస్-4, ఎస్-5 బోగీల్లో నిద్రిస్తున్న వారు కొందరు, స్టేషన్ వచ్చినట్టుందే అని నిద్ర లేచి చూసిన వారు కొందరు. ఉన్నట్టుండి వచ్చిన శబ్దంతో ఏమి జరి గిందో తెలియని పరిస్థితి. చివరకు ఆస్పత్రిలో క్షతగాత్రులుగా కొందరు మిగలాల్సి వచ్చింది. వీరిలో సీమాంధ్రకు చెందిన ఇద్దరు యువకులు ఉన్నారు. అలాగే ఉత్తరాదికి చెందిన వారు ఎక్కు వ మంది ఉన్నారు. కాళ్లకు తగిలిన పెద్ద గాయాలతో కొందరు, తలకు తగిలిన గాయాలతో మరికొందరు చేస్తున్న ఆర్తనాదాలు వర్ణణాతీతం. తమకు ఈ గాయాలు ఎలా అయ్యాయో కూడా తెలి యని వారూ ఉన్నారు. నిద్రలో ఉన్నామని, కళ్లు తెరిచి చూస్తే ఆస్పత్రిలో ఉన్నామంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. బెర్త్ రూపంలో తాము గాయాలపాలయ్యామంటూ ఒకరు, తన సీటు కిందే బాంబు పేలిందంటూ మరొకరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
 
 తక్షణం వైద్య సేవలు
 ప్రమాద సమాచారంతో సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న రాజీవ్ గాంధీ ఆస్పత్రి(జీహెచ్) ఎమర్జెన్సీలో సర్వం సిద్ధం చేశారు. క్షతగాత్రుల్ని అంబులెన్స్‌ల్లో హుటా హుటిన ఆస్పత్రి వద్దకు తీసుకురాగానే అక్కడి సిబ్బంది ఆగమేఘాలపై ఎమర్జెన్సీలో వైద్య సేవల్ని అందించారు. ఓవైపు మీడియా హడావుడి, మరో వైపు ఇతర ప్రమాదాలతో ఎమర్జెన్సీకి వచ్చిన వారి ఆర్తనాదాలు వెరసి ఆ పరిసరాల్లో ఉత్కంఠను రేపాయి. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి వచ్చిన 14 మందిలో ఇద్దరి పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో శస్త్ర చికిత్సలు చేయాల్సి వచ్చింది.
 
 పరామర్శలు
 ప్రమాద సమాచారం తెలియగానే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వలర్మతి నేరుగా జీహెచ్ చేరుకున్నారు. ప్రమాదంలో మరణించిన గుంటూరుకు చెంది న స్వాతి మృతదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. గాయాలతో ఆస్పత్రిలో ఉన్న వారిని ఓదార్చారు. వీసీకే నేత తిరుమావళవన్, కాంగ్రెస్ నేత విజయ ధరణి, డీఎంకే నేత టీకేఎస్ ఇళంగోవన్, కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జీకే వాసన్ బాధితులను పరామర్శించారు.
 
 సెలవు మీద వెళుతూ
 ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగో లు సమీపంలోని చీరాలకు చెందిన ఆంజేయులు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. చెన్నైకు చెందిన స్నేహితుడు ప్రదీప్‌తో కలిసి బెంగళూరులో బుధవారం రాత్రి రైలు ఎక్కారు. చెన్నైలో ప్రదీప్ దిగేశారు. సైడ్ బెర్త్ తనకు కేటాయించినప్పటికీ, ఖాళీ గా ఉండడంతో సెంటర్ బెర్త్‌లో వెళ్లి ఆం జేయులు నిద్రకు ఉపక్రమించారు. అదే బెర్త్ కింద పేలుడు జరగడంతో కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమాచారంతో ప్రదీప్ వెనక్కి వచ్చి   మిత్రు డికి సాయంగా ఆస్పత్రిలో సహకారం అందించడంతోపాటు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.
 
 ఇంటర్వ్యూలకు వెళ్లి వస్తూ
 వైజాగ్‌కు చెందిన పి.మురళి బెంగళూరులో ఓ ఇంటర్వ్యూకు వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని తిరుగు ప్రయూణంలో ఉండగా బాంబు పేలుడులో గాయపడి చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement