సిమ‍్లా: ఎడతెరిపిలేని వర్షాలతో ఉత్తర భారతం వణికిపోతోంది. ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరఖండ్ సహా పలు రాష్ట్రాల్లో కుంభవృష్టి సంభవిస్తోంది. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్‌లోనూ గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది ప్రభుత్వం. వర్షాలకు కొండ చరియలు, మంచు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొంది.
నిత్యం పర్యటకులతో కిటకిటలాడే హిమాచల్ ప్రదేశ్‌లో ట్రెక్కింగ్ కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. పలు పర్యాటక ప్రాంతాల్లో ట్రాఫిక్ పై ఆంక్షలు విధించారు. అటు.. భారీ వర్షాలతో దేశ రాజధాని అతలాకుతలం అవుతోంది. గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఒక్కరోజులో 153 సెంటీమీటర్ల వర్షం సంభవించింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అధికారులు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు.
#Pandohdam #HimachalPradesh pic.twitter.com/Ox5Pts1Va1
— rajni singh (@imrajni_singh) July 9, 2023
शिमला डींगू माता मंदिर के पास भयंकर भूस्खलन, देखते ही देखते टूट गई सड़क#sanjauli #shimla #HimachalPradesh pic.twitter.com/5CCQbvZjOq
— Ankush Dobhal🇮🇳 (@DobhalAnkush) July 8, 2023
ఇదీ చదవండి: ఢిల్లీని కుదిపేస్తున్న కుంభవృష్టి.. 40 ఏళ్లలో ఇదే తొలిసారి..
Comments
Please login to add a commentAdd a comment