శంషాబాద్: పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంపై రెండు రోజులుగా జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో రెడ్‌అలర్ట్ ప్రకటించారు. కేంద్రం ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో భద్రతను పెంచారు. ఇందులో భాగంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కూడా అంతర్గత భద్రతను పెంచినట్లు విమానాశ్రయ భద్రతా అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.