
శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారుల విజ్ఞప్తి
శంషాబాద్: విమాన ప్రయాణికులు నిర్ధా రిత సమయానికి 2 గంటలు ముందుగానే చేరుకోవాలని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిపబ్లిక్‌డే సందర్భంగా ఎయిర్‌పోర్టులో రెడ్ అలర్ట్ ప్రకటించారన్నారు.
ప్రయాణికులు 2 గంటలు ముందుగా చేరుకుని చెక్‌ఇన్ చేయించుకోవాలన్నారు. ఎయిర్‌పోర్టులో రద్దీ దృష్ట్యా ర్యాంపు పనులను కూడా విస్తరిస్తున్నామని తెలిపారు.