
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: గత మూడు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లల్లో వరద బీభత్సం సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయి జన జీవనం స్థంభించింది.
మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో.. తెలంగాణ ప్రభుత్వం అప్రత్తమయ్యింది. 9 జిల్లల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో రెడ్ అలర్ట్ పక్రటించింది. ఇప్పటికే వరదల వల్ల ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పెద్దవాగులో 9 మంది కార్మికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారిని బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment