హైదరాబాద్: రెడ్ అలర్ట్‌కు కొనసాగింపుగా తెలంగాణలో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో విద్యాసంస్థలకు బంద్ ప్రకటించింది ప్రభుత్వం. అలాగే.. ఆఫీసులు, కంపెనీలు సైతం నిర్ణీత సమయాల్లో బంద్ కావడం మంచిదని.. రైతులూ అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది. ప్రత్యేకించి హైదరాబాద్‌కు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది Hyderabad Rains వాతావరణ శాఖ. ఈ క్రమంలో జోన్ల వారీగా అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు అలర్ట్ జారీ చేసింది జీహెచ్‌ఎంసీ.
నగరంలో.. చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్, ఎల్బీనగర్ జోన్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కూకట్‌పల్లి జోన్‌కు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ సైతం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటలో 3 నుంచి 5 సెం.మీ. వర్షం కురిసే సూచనలున్నాయని, కొన్నిచోట్ల 5 నుంచి 10 సెం.మీ. కూడా కావచ్చని వెల్లడించింది. భారీగా గాలులు వీస్తాయని తెలిపింది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో నాలల కెపాసిటీ 2 నుంచి 3 సెం.మీ. వర్షాన్ని తట్టుకునేలా ఉంటాయి. ఈ నేపథ్యంలో.. అంచనాకి తగట్లు గనుక వాన పడితే.. రోడ్లపైకి భారీగా వరద చేరుకునే ఛాన్స్ ఉంది.
మోస్తరు వాన పడింది..
సోమవారంతో పోలిస్తే.. మంగళవారం వరుణుడు కాస్త శాంతించాడు. నగరంలో అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. ఒక చోట మోస్తరు వాన పడగా, మరోచోట భారీగా కురిసింది. ఆసిఫ్‌నగర్‌లో 43.5 మి.మీ., టోలిచౌకిలో 19.8 మి.మీ. వర్షం పడినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధి సొసైటీ(టీఎస్‌డీపీఎస్) వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో 10 మి.మీ.లోపే పడింది.
ఇలా జరగొచ్చు.. జాగ్రత్త!
భారీ నుంచి అతి భారీ వర్షంతో రహదారులన్నీ జలమయమవుతాయి. గాలులతో చెట్లు నేలకూలే ప్రమాదం ఉంది. విద్యుత్తు స్తంభాలు దెబ్బతినడం, కరెంటు సరఫరాలో అంతరాయాలకు అవకాశం. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తవచ్చు. రేపు ఇలా.. ఐదు జోన్ల పరిధిలో అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వీటి పరిధిలో గురువారం మోస్తరు నుంచి కొన్నిసార్లు భారీ వర్షం కురియవచ్చు.
ఇక.. శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఉండవచ్చని వెల్లడించింది. గంటలో 2 నుంచి 3 లేదా 5 సెం.మీ. దాకా వర్షపాతానికి వీలుందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ వర్షాలపై నగర పౌరులకు ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా అలర్ట్ సందేశాలు అధికారులు పంపుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment