vijay hazare final
-
షా విధ్వంసం.. తారే సూపర్ సెంచరీ.. ముంబై చాంపియన్
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని ముంబై జట్టు నాలుగోసారి ఎగురేసుకుపోయింది. ముంబై కెప్టెన్ పృథ్వీ షా (39 బంతుల్లో 73; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్‌కు, వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ ఆదిత్య తారే (107 బంతుల్లో 118 నాటౌట్; 18 ఫోర్లు) అద్భుత శతకం తోడవ్వడంతో పాటు శివం దూబే(42 నాటౌట్; 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి ఆడటంతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో యూపీపై ఘన విజయం సాధించింది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఉత్తర్‌ప్రదేశ్ జట్టు.. ఓపెనర్ మాధవ్ కౌశిక్ (156 బంతుల్లో 158 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకం సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 312 పరుగులు సాధించింది. కౌశిక్ శతకానికి మరో ఓపెనర్ సమర్థ్ సింగ్ (73 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అక్షదీప్‌నాథ్ (40 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకాలు తోడవ్వడంతో యూపీ జట్టు ముంబైకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ముంబై బౌలర్లలో యశ్ దయాల్, శివమ్ మావి, శివమ్ శర్మ, సమీర్ చౌదరీలు తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఛేదనలో పృథ్వీ షా (39 బంతుల్లో 73 పరుగులు), ఆదిత్య తారే (107 బంతుల్లో 118 నాటౌట్; 18 ఫోర్లు) అద్భుతంగా రాణించడంతో ముంబై జట్టు భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ముంబై జట్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (30 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్), షమ్స్ ములాని (43 బంతుల్లో 36; 2 సిక్సర్లు), ఆల్‌రౌండర్ శివమ్ దూబే దూకుడుగా ఆడడంతో ముంబై 41.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. యూపీ బౌలర్లు తనుశ్ కోటియన్ 2, ప్రశాంత్ సోలంకీ ఒక వికెట్ సాధించారు. -
చరిత్ర సృష్టించిన పృథ్వీ షా..
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ముంబై కుర్రాడు పృథ్వీ షా ధానాధన్ ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నాడు. ప్రస్తుత సీజన్లో ఇప్పటికే 4 శతాకాలతో (105 నాటౌట్, 227 నాటౌట్, 185 నాటౌట్, 165) శివాలెత్తిన ఈ ముంబై ఆటగాడు.. ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సైతం విధ్వంసం సృష్టించి, విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో 800కుపైగా పరుగులు (827 పరుగులు) సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పృథ్వీ షా (39 బంతుల్లో 73; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి..తన జట్టుకు శుభారంభాన్ని అందించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఉత్తర్‌ప్రదేశ్ జట్టు.. ఓపెనర్ మాధవ్ కౌశిక్ (156 బంతుల్లో 158 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకం సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 312 పరుగులు సాధించింది. కౌశిక్ శతకానికి మరో ఓపెనర్ సమర్థ్ సింగ్ (73 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అక్షదీప్‌నాథ్ (40 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకాలు తోడవ్వడంతో యూపీ జట్టు ముంబైకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. -
అదరగొట్టిన పార్థీవ్ పటేల్
బెంగళూరు: విజయ్ హజారే వన్డే ట్రోఫీ ఫైనల్ పోరులో గుజరాత్ కెప్టెన్ పార్థీవ్ పటేల్ సెంచరీతో అదరగొట్టాడు. సోమవారం ఢిల్లీతో జరుగుతున్నతుదిపోరులో పార్థీవ్ పటేల్(105;119 బంతుల్లో 10 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ .. గుజరాత్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ ఆదిలోనే ప్రియాంక్ పంచాల్(14) వికెట్ ను కోల్పోయింది. అనంతరం భార్గవ్ మెరాయ్(5) కొద్ది వ్యవధిలోనే రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఈ తరుణంలో పార్థీవ్ కు రుజు భట్ జతకలిశాడు. వీరిద్దరూ మంచి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ స్కోరును ముందుకు కదిలించారు.ఈ జోడీ మూడో వికెట్ కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలోనే రిజు భట్(60) హాఫ్ సెంచరీ, పార్థీవ్ పటేల్ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ 193 పరుగుల వద్ద వరుసగా పెవిలియన్ చేరడంతో గుజరాత్ తడబడినట్లు కనిపించింది. ఆ తరువాత చిరాగ్ గాంధీ(44 నాటౌట్ ) దూకుడుగా ఆడటంతో గుజరాత్ స్కోరు బోర్డు ముందుకు కదిలింది. కాగా, చివర్లో కలారియా(21) మినహా మిగతా ఎవరూ రాణించకపోవడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 273 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. ఢిల్లీ బౌలర్లలో సైనీ, నేగీ, భాటిలకు తలో రెండు వికెట్లు దక్కగా, ఇషాంత్ శర్మ, రానా, మనన్ శర్మలకు ఒక్కో వికెట్ లభించింది.