ముంబై: భారత జట్టులో చోటు కోసం సెలెక్టర్ల దృష్టిలో పడేందుకు తాను క్రికెట్ ఆడటంలేదని వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్నాడు. ఆదివారం ముగిసిన ఐపీఎల్–10లో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడైన పార్థివ్, చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపికైన భారత తుది జట్టులో చోటు దక్కనందుకు బాధేం లేదని చెప్పాడు. ‘నిజం చెప్పాలంటే సెలక్షన్స్ గురించి ఆలోచించను.
అది నా పని కాదు. సెలెక్టర్ల దృష్టిలో పడేందుకే క్రికెట్ ఆడను. చాలా ఏళ్లుగా ఈ ఆటలో ఉన్నా. క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తా. ఈ ఏడాది నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. రంజీ ట్రోఫీ గెలవడంతో పాటు టెస్టుల్లో పునరాగమనం, టైటిల్ విజేత ముంబై ఇండియన్స్‌లో భాగమవడం చాలా ఆనందాన్నిచ్చింది. నా ప్రదర్శనను ఇలాగే కొనసాగిస్తా జరగాల్సినవన్నీ అవే జరుగుతాయి’ అని పార్థివ్ పేర్కొన్నాడు.
సెలెక్టర్ల కోసం క్రికెట్ ఆడను: పార్థివ్
Published Tue, May 23 2017 1:39 AM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM
Advertisement
Advertisement