పార్థీవ్ పటేల్కు కోపం వచ్చింది! | I don't compete just to play for India anymore: Parthiv Patel | Sakshi
Sakshi News home page

పార్థీవ్ పటేల్కు కోపం వచ్చింది!

Published Thu, Jan 26 2017 3:52 PM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM

పార్థీవ్ పటేల్కు కోపం వచ్చింది!

పార్థీవ్ పటేల్కు కోపం వచ్చింది!

న్యూఢిల్లీ: భారత టెస్టు జట్టులో రెగ్యులర్ కీపర్ గా తమ తొలి ప్రాధాన్యత వృద్ధిమాన్ సాహాకే అని ఇటీవల  క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక్కడ పార్థివ్‌ వికెట్‌ కీపింగ్‌ కూడా ఎంతో మెరుగైనా, సాహానే మా అత్యుత్తమ వికెట్‌ కీపర్‌’ అని ఎంఎస్కే స్పష్టం చేశాడు.  ఇదే నిర్ణయాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా దాదాపు సమర్ధించాడు. తమ రెండో కీపర్ పార్ధీవ్ అంటూ విరాట్ తెలిపాడు.  అయితే ఇదే విషయంపై పార్ధీవ్ పటేల్ పరోక్షంగా తన అసంతృప్తి వ్యక్తం చేశాడు.  ఇక్కడ ఎవర్నీ విమర్శించకుండానే తన మనసులోని మాటను పార్థీవ్ బహిర్గతం చేశాడు.

'నేను భారత్ జట్టులో స్థానం కోల్పోయినప్పుడు పునరాగమనం చేస్తానని అస్సలు అనుకోలేదు. ఆ సమయంలో సంతోషంగా జట్టు నుంచి తప్పుకున్నా. నేను విపరీతంగా శ్రమించే తిరిగి చాలా ఏళ్ల తరువాత జట్టులో స్థానం దక్కించుకున్నా. కేవలం భారత జాతీయ జట్టులో స్థానం కోసమే నేను క్రికెట్ ఆడటం లేదు. వికెట్ కీపర్గా నాకు కొన్ని పరిమితులున్నాయి.. అదే క్రమంలో లక్ష్యాలు కూడా ఉన్నాయి. వాటిని సాధించడం కోసం నేను ఎప్పుడూ యత్నిస్తూ ఉంటా. దీనిలో భాగంగానే నా మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉంటా. నేను భారత జట్టులోకి తిరిగి ఎలా వచ్చానో నాకు తెలుసు. నేను సత్తా చాటాను కాబట్టే జట్టులో స్థానం దక్కింది. నాకు గేమ్ అంటే ఇష్టం. ఆ క్రమంలోనే ఇప్పటికీ ఆడుతున్నా. కేవల భారత జట్టులో స్థానం కోసమైతే కాదు' అని పార్థీవ్ పటేల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.  ఇటీవల పార్థీవ్ పటేల్ ఎనిమిదేళ్ల తరువాత టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే సాహా తిరిగి కోలుకోవడంతో పార్థీవ్ ను రెండో కీపర్గా పరిమితం కావాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే మన  చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే చేసిన వ్యాఖ్యలు పార్థీవ్కు  కోపాన్ని తెప్పించినట్లు కనబడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement