న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పిన పార్థివ్ పటేల్..టీ20 ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్‌ను మార్చాలని సూచించాడు. టీమిండియా టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లి స్థానంలో రోహిత్ శర్మను చేయాలని పేర్కొన్నాడు. టీ20 క్రికెట్‌లో రోహిత్ ఒక సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అనే విషయాన్ని బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటే మంచిదన్నాడు. ఆటగాళ్లను ఎలా ముందుకు నడిపించాలనే విషయం రోహిత్‌కు బాగా తెలుసన్నాడు. స్పోర్ట్ తక్‌తో మాట్లాడిన పార్థివ్.. టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్‌ను సారథిగా చేయాలన్నాడు. ఒక ఫార్మాట్‌కు కెప్టెన్‌ను మార్చినంత మాత్రాన నష్టం ఏమీ ఉండదన్నాడు. (అది బీసీసీఐ-రోహిత్‌లకు మాత్రమే తెలుసు: సచిన్)
ఇలా చేస్తే కోహ్లిపై కూడా ఒత్తిడి తగ్గించివారు అవుతారన్నాడు. ‘ రోహిత్ చాలా టోర్నమెంట్లు గెలిచాడు. ఒత్తిడిలో ఎలా నిర్ణయాలు తీసుకుంటాడో చూశాం. ముంబై ఇండియన్స్‌కు ఎన్నో ట్రోఫీలను తీసుకొచ్చాడు రోహిత్. ప్రతీ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఒక సెటిల్డ్ టీమ్ కాదనే విషయం కూడా గుర్తించాలి. జట్టు బరిలోకి దిగిన తర్వాత ఆటగాళ్లను సమర్ధవంతంగా వినియోగించుకుంటూ జట్టును నడిపిస్తాడు రోహిత్. టీ20లకు కెప్టెన్‌గా రోహిత్‌ను ఎంపిక చేయండి’ అని పార్థివ్ కోరాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలను అందించాడు రోహిత్. అదే ఆర్సీబీకి కోహ్లి ఇప్పటివరకూ ఒక ట్రోఫీ కూడా సాధించలేకపోయాడు. ప్రతీ ఐపీఎల్ సీజన్‌కు ముందు రోహిత్-కోహ్లి కెప్టెన్సీపై పెద్ద చర్చే నడుస్తూ ఉంటుంది. ఈ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావించిన పార్థివ్.. టీ20 వరల్డ్‌కప్ నాటికి కెప్టెన్‌ను మార్చాలన్నాడు. ప్రత్యేకంగా పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్‌గా రోహిత్ సరైనవాడనే విషయాన్ని బీసీసీఐ తెలుసుకోవాలని పరోక్షంగా సూచించాడు.
Comments
Please login to add a commentAdd a comment