ముంబై : టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు బుధవారం తెలిపాడు. 35 ఏళ్ల పార్థివ్ టీమిండియా తరపున 25 టెస్టులు, 38 వన్డేలు, రెండు టీ20లు కలిపి 1706 పరుగులు.. 93 క్యాచ్‌లు, 19 స్టంపింగ్స్ చేశాడు.ఇక దేశవాలి క్రికెట్‌లో గుజరాత్ తరపున 194 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 2002లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే ద్వారా పార్థివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో( 17 సంవత్సరాల 153 రోజులు) అరంగేట్రం చేసిన ఆటగాడిగా పార్థివ్ అప్పట్లో రికార్డు సృష్టించాడు. ఆరంభంలో కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా అదే ప్రదర్శను చూపించలేకపోయాడు.
అదే సమయంలో దినేష్ కార్తిక్, ఎంఎస్ ధోనిలు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టడంతో పార్థివ్ కెరీర్ డౌన్‌ఫాల్ మొదలైంది. ముఖ్యంగా ధోని అన్ని ఫార్మాట్లకు రెగ్యులర్ వికెట్ కీపర్‌గా మారిన తర్వాత పార్థివ్‌కు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక పార్థివ్ తన చివరి టెస్టు మ్యాచ్‌ను 2018లో దక్షిణాఫ్రికాతో ఆడగా.. 2012లో ఇంగ్లండ్‌తో చివరి వన్డే ఆడాడు. ఐపీఎల్‌లో పార్థివ్ పటేల్ చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, డెక్కన్ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
Parthiv Patel announces his retirement from all cricket.
— ICC (@ICC) December 9, 2020
👕 25 Tests, 38 ODIs, two T20Is
🏏 1706 runs
🧤 93 catches, 19 stumpings
He remains the youngest wicket-keeper to play Test cricket, having made his debut at 17 years and 152 days ⭐ pic.twitter.com/O5i8FeRUiW
Comments
Please login to add a commentAdd a comment