టీమిండియా రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం టీ20ల్లో భారత జట్టు ఓపెనింగ్ సమస్యను ఎదుర్కొంటుంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో రోహిత్ జోడిగా పంత్ జత కట్టగా.. ప్రస్తుతం జరుగతోన్న విండీస్ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్‌గా ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాడు. అయితే తొలి రెండు టీ20ల్లో నిరాశపరిచిన సుర్య.. మూడో టీ20లో 76 పరుగులతో దుమ్ము రేపాడు.
రాహుల్ లేకుంటే!
ఇక ఆగస్టు 27 నుంచి జరగనున్న ఆసియాకప్‌కు కూడా కేఎల్ రాహుల్ అందుబాటుపై సందిగ్ధం నెలకొంది. ఒకవేళ రాహుల్ అసియా కప్‌కు దూరమైతే సూర్యకుమార్ యాదవ్‌నే ఓపెనర్‌గా కొనసాగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ కీలక వాఖ్యలు చేశాడు. రాహుల్ ఇంకా ఫిట్‌నెస్ సాధించనందున ఆసియా కప్‌లో విరాట్ కోహ్లి ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు.
కోహ్లికి ఛాన్స్! ఎందుకంటే..
ఇటీవలి కాలంలో భారత ఇప్పటికే అనేక ఓపెనింగ్ కాంబినేషన్‌లను పరీక్షించిందని, ఆసియా కప్‌లో కోహ‍్లికి కూడా ఛాన్స్ ఇవ్వవచ్చు అని పటేల్ తెలిపాడు. ఇక ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న కోహ్లి ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు.కోహ్లి ఆసియా కప్‌తో తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్ షోలో పార్థివ్ పటేల్ మాట్లాడుతూ.. "విరాట్ కోహ్లి అద్భుతమైన ఆటగాడు. అతడు ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చాడంటే ఆపడం ఎవరి తరం కాదు.
అతడు అసియా కప్‌తో తిరిగి తన రిథమ్‌ను పొందుతాడని ఆశిస్తున్నాను. కోహ్లికి ఆసియా కప్ చాలా కీలకం. అదే విధంగా అతడు ఫామ్‌లోకి రావడం భారత్‌కు కూడా చాలా ముఖ్యం. ఇక ఈ మెగా టోర్నీకు కేఎల్ రాహుల్ దూరమైతే.. విరాట్ కోహ్లి ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. ఈ జట్టుకైనా ఓపెనింగ్ కాంబినేషన్ కీలకం. గత కొన్ని సిరీస్‌ల నుంచి రాహుల్ అందుబాటు లేకపోవడంతో ఓపెనింగ్ జోడీలో భారత్ ప్రయోగాలు చేస్తోంది.
ఇప్పటికే ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, పంత్, సూర్యకుమార్ యాదవ్‌లను ఓపెనర్లుగా జట్టు మెనేజేమెంట్ అవకాశం ఇచ్చింది. ఈ ప్రయోగాల్లో భాగంగా కోహ్లిని కూడా ఓపెనర్‌గా పంపే అవకాశం ఉంది" అని పేర్కొన్నాడు. ఇక ఆసియా కప్-2022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆగస్టు 28న తలపడనుంది.
చదవండి: IND vs WI: కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. తొలి భారత కెప్టెన్‌గా!
Comments
Please login to add a commentAdd a comment