
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను విజయంతో ఆరంభించిన టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా శనివారం జరగనున్న రెండో టీ20లో ఇంగ్లండ్‌తో భారత తలపడనుంది. అయితే తొలి టీ20కు విశ్రాంతి తీసుకున్న భారత సీనియర్ ఆటగాళ్లు రెండో టీ20కు అందు బాటులోకి రానున్నారు. దీంతో భారత తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో భారత తుది జట్టుపై టీమిండియా మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ తన అభిప్రాయాలను వెల్లడించాడు.
"అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకు రావాలి. అదే విధంగా అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా రానున్నాడు. ఇక విరాట్ కోహ్లి.. దీపక్ హుడా స్థానంలో జట్టులోకి వస్తాడని నేను భావిస్తున్నాను. మరో వైపు శ్రేయాస్ అయ్యర్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవచ్చు. దినేష్ కార్తీక్ స్ధానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది" అని పార్థివ్ పటేల్ క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
భారత తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్
చదవండి: '37 ఏళ్ల వయస్సులో అదరగొడుతున్నాడు.. అతడిని జట్టులోకి తీసుకోండి'
Comments
Please login to add a commentAdd a comment