రిషభ్ పంత్ (PC: BCCI)
Bangladesh vs India, 2nd Test- Rishabh Pant: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. టాపార్డర్ చేతులెత్తేసిన వేళ శ్రేయస్ అయ్యర్(87)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ క్రమంలో 105 బంతులు ఎదుర్కొన్న పంత్.. 93 పరుగులు(7 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో) సాధించాడు. అయితే, 67.5వ ఓవర్లో మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో నూరుల్ హసన్‌కు క్యాచ్ ఇచ్చిన పంత్ సెంచరీ మిస్ అయ్యాడు.
ధోని రికార్డు బద్దలు
కాగా పంత్ ఇలా తొంభై పరుగుల పైచిలుకు స్కోరు చేసి అవుట్ కావడం ఇది ఆరోసారి. ఇదిలా ఉంటే.. శతకం చేజార్చుకున్నప్పటికీ పంత్.. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.
సాహా తర్వాత
మిర్పూర్ టెస్టులో రెండో రోజు ఆటలో భాగంగా ఈ మేరకు అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 49 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి అర్ధ శతకం సాధించాడు పంత్. తద్వారా టెస్టుల్లో బంగ్లాదేశ్‌పై ధోని తర్వాత అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు.
కాగా 2007లొ ఇదే వేదికపై ధోని 50 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. అదే విధంగా ధోని, వృద్ధిమాన్ సాహా తర్వాత బంగ్లాపై యాభై పైచిలుకు పరుగులు చేసిన మూడో వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ నిలిచాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి ఆట తీరుతో మరోసారి తనకు టెస్టుల్లో తిరుగులేదని నిరూపించుకున్నాడంటూ పంత్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: Kohli- Pant: పంత్‌పై గుడ్లురిమిన కోహ్లి! కానీ.. ఈసారి కింగ్ ‘మాట వినకపోవడమే’ మంచిదైంది! లేదంటే..
Harry Brook: బ్రూక్ పంట పండింది.. ఎస్‌ఆర్‌హెచ్ తలరాత మారేనా!
Comments
Please login to add a commentAdd a comment