సాహా అవుట్‌.. పార్థివ్‌ కు ఛాన్స్‌ | Saha ruled out of third Test, Parthiv named as replacement | Sakshi
Sakshi News home page

సాహా అవుట్‌.. పార్థివ్‌ కు ఛాన్స్‌

Published Wed, Nov 23 2016 11:49 AM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

సాహా అవుట్‌.. పార్థివ్‌ కు ఛాన్స్‌

సాహా అవుట్‌.. పార్థివ్‌ కు ఛాన్స్‌

మొహాలి: టీమిండియా వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌ తో జరగనున్న మూడో టెస్టు మ్యాచ్‌ లో అతడు ఆడడం లేదు. అతడి స్థానంలో పార్థివ్‌ పటేల్‌ కు చోటు కల్పించారు. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ లో సాహా గాయపడ్డాడు. అతడి ఎడమ కాలి తొడ భాగంలో గాయమైందని బీసీసీఐ వైద్య బృందం వెల్లడించింది. గాయం పెద్దది కాకుండా ఉండాలంటే విశ్రాంతి తీసుకోవాలని సాహాకు వైద్యులు సూచించారు. దీంతో మొహాలీలో ఈనెల 26 నుంచి జరగనున్న మూడో టెస్టుకు అతడు దూరమయ్యాడు.

సాహా స్థానంలో యంగ్‌ వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌ మన్‌ రిషబ్‌ పంత్‌ ను తీసుకోవాలని అనుకున్నారు. రంజీ ట్రోఫి కారణంగా అతడు అందుబాటులో లేకవపోవడంతో పార్థివ్‌ పటేల్‌ కు అవకాశం కల్పించారు. ఇంగ్లండ్‌ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో కోహ్లి సేన 1-0 ఆధిక్యంలో నిలిచింది. రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టు డ్రా అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement