సాహా అజేయ సెంచరీ | Saha unbeaten century | Sakshi
Sakshi News home page

సాహా అజేయ సెంచరీ

Jan 23 2017 11:47 PM | Updated on Sep 5 2017 1:55 AM

సాహా అజేయ సెంచరీ

సాహా అజేయ సెంచరీ

గాయంతో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి మూడు టెస్టులకు దూరమైన వృద్ధిమాన్‌ సాహా తన పునరాగమన మ్యాచ్‌లో కీలక శతకం

విజయానికి 113 పరుగుల దూరంలో రెస్టాఫ్‌ ఇండియా  

ముంబై: గాయంతో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి మూడు టెస్టులకు దూరమైన వృద్ధిమాన్‌ సాహా తన పునరాగమన మ్యాచ్‌లో కీలక శతకం సాధించాడు. పార్థివ్‌ పటేల్‌కు పోటీగా తన బ్యాటింగ్‌ సత్తాను ప్రదర్శించి సెలక్టర్ల దృష్టి తనపై పడేలా చేశాడు. సాహా (123 బ్యాటింగ్‌; 16 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీ కారణంగా... గుజరాత్‌తో ఇక్కడ జరుగుతున్న ఇరానీ కప్‌ మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియా విజయం దిశగా సాగుతోంది.

379 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రెస్ట్‌ జట్టు నాలుగో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 266 పరుగులు చేసింది. సాహాతో పాటు చతేశ్వర్‌ పుజారా (83 బ్యాటింగ్‌; 10 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 203 పరుగులు జోడించారు. చేతిలో ఆరు వికెట్లు ఉన్న రెస్టాఫ్‌ ఇండియా చివరి రోజు విజయం కోసం మరో 113 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 227/8తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన గుజరాత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement