
ముంబై: గాయం కారణంగా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా దూరం కావడంతో... ఈ నెల 14 నుంచి అఫ్గానిస్తాన్‌తో బెంగళూరులో జరిగే చారిత్రాత్మక టెస్టులో పాల్గొనే భారత జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. సాహా స్థానంలో మరో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేసినట్లు సెలక్షన్ కమిటీ తెలిపింది.