
నా బ్యాటింగ్ సంతృప్తినిచ్చింది
వృద్ధిమాన్ సాహా వ్యాఖ్య
న్యూఢిల్లీ : ఇటీవలి శ్రీలంక పర్యటనలో వరుసగా చేసిన రెండు అర్ధ సెంచరీలు తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని భారత వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా అన్నాడు. మూడో టెస్టుకు గాయం కారణంగా దూరమైనప్పటికీ వేగంగా కోలుకుంటున్నానని చెప్పాడు. ‘రెండు టెస్టుల్లో వరుస అర్ధ సెంచరీలు నాలో నమ్మకాన్ని పెంచాయి. జట్టు సిరీస్ విజయంలో నాది కూడా చిన్న పాత్ర ఉన్నందుకు సంతోషంగా ఉంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉంది. అంతకుముందే నేను ఫిట్‌గా ఉంటాననే నమ్మకం ఉంది’ అని 30 ఏళ్ల సాహా తెలిపాడు.