‘అతనికి కీపింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తున్నా’ | Saha more confident after keeping to Rashid Khan | Sakshi
Sakshi News home page

‘అతనికి కీపింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తున్నా’

Published Sun, Apr 15 2018 6:49 PM | Last Updated on Sun, Apr 15 2018 6:50 PM

Saha more confident after keeping to Rashid Khan - Sakshi

కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌కు కీపింగ్‌ చేయడాన్ని ఆస‍్వాదిస్తున్నట్లు సహచర ఆటగాడు వృద్ధిమాన్‌ సాహా పేర్కొన్నాడు. శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ విజయం సాధించిన తర్వాత మాట్లాడిన సాహా.. ప్రత్యేకంగా రషీద్‌ ఖాన్‌ వైవిధ్యమైన బౌలింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘రషీద్‌ ఖాన్‌ వైవిధ్యమైన బౌలర్‌. అతనికి కీపింగ్‌ చేయడం నాకు దొరికిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా.

రషీద్‌ తరహా బౌలర్‌కు కీపింగ్‌ చేయడం ఒక మంచి అనుభవం. అతని బౌలింగ్‌లో విపరీతమైన టర్న్‌తో పాటు పేస్‌ కూడా ఉంటుంది.  అటువంటి బౌలర్‌కు కీపింగ్‌ చేయడం చాలా కష్టం. దాంతో రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అత్యంత నమ్మకంతో కీపింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో అశ్విన్‌, జడేజా, మిశ్రా, కుల్దీప్‌ వంటి స్టార్‌ స్పిన్నర్లకు కీపింగ్‌ చేశా. వారి తర్వాత రషీద్‌కు కీపింగ్‌ చేస్తున్నా.డెత్‌ ఓవర్ల స్పెషలిస్టు బౌలర్లలో రషీద్‌ ఒకడు’ అని సాహా పేర్కొన్నాడు.ప్రస్తుతం అంతర్జాతీయ టీ 20 ఫార్మాట్‌లో రషీద్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాంతోపాటు ఇటీవల వన్డేల్లో వేగవంతంగా వంద వికెట్లను సాధించిన బౌలర్‌గా రషీద్‌ గుర్తింపు సాధించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement