
కోల్‌కతా: ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రషీద్ ఖాన్ కొట్టిన హెలికాప్టర్ గురించే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. హెలికాప్టర్ షాట్లకు పెట్టింది పేరు మహేంద్ర సింగ్ ధోని.. అయితే తాజాగా రషీద్ ఖాన్ కూడా హెలికాప్టర్ షాట్‌ను అవలీలగా కొట్టిపారేశాడు.
కోల్‌కతాతో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కనీసం 150 పరుగులు మార్కును చేరడమే కష్టమనిపించిన తరుణంలో రషీద్ చెలరేగి ఆడాడు. 10 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో అలరించాడు. అందులోనూ హెలికాప్టర్ షాట్‌ను ఇక‍్కడ మరో విశేషం.
కేకేఆర్ బౌలర్ ప్రసీద్ కృష్ణ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరీని రషీద్ ఖాన్ స్వేర్ లెగ్ మీదుగా సిక్సర్‌గా కొట్టాడు. బంతిని హెలికాప్టర్ షాట్ ఆడే క్రమంలో ఆఫ్ స్టంప్ వైపుకు జరిగి హిట్ చేయడంతో అది సిక్సర్‌గా వెళ్లింది. దీనిపై కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని కొట్టే హెలికాప్టర్‌తో పోల్చాడు. మరొకవైపు సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానిస్తూ.. షాట్ ఆఫ్ ఇన్నింగ్స్‌గా అభివర్ణించాడు.
Comments
Please login to add a commentAdd a comment