అతను గొప్ప స్పిన్నర్‌ : సచిన్‌ | Sachin Praises SRH Rashid Khan Talent On Twitter | Sakshi
Sakshi News home page

అతను గొప్ప స్పిన్నర్‌ : సచిన్‌

Published Sat, May 26 2018 12:31 AM | Last Updated on Sat, May 26 2018 12:35 AM

Sachin Praises SRH Rashid Khan Talent On Twitter - Sakshi

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌ ఆ జట్టు విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్న విషయం తెలిసిందే. బౌలర్‌గా ఓ వైపు రాణిస్తూ.. అవసరమైన సమయాల్లో బ్యాటుకు పనిచెప్తున్నాడు రషీద్‌. శుక్రవారం కొల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ 10 బంతుల్లో 34 పరుగులు చేయడమే కాక.. 3 వికెట్లు తీసుకున్నాడు. అంతే కాకుండా అత్యుతమ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతని ఆట తీరుపై పలువురు మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అతని ఆట తీరు కొనియాడుతూ.. ట్వీట్‌ చేశారు. 

‘రషీద్‌ మంచి బౌలర్‌ మాత్రమే అనుకున్నాను. ప్రస్తుతం అతను ఈ ఫార్మట్‌లో ప్రపంచంలోనే గొప్ప స్పిన్నర్‌ అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అతనిలో బంతితో కాకుండా బ్యాట్‌తో రాణించగల ప్రతిభ ఉంది. గ్రేట్‌ గాయ్‌’  అని సచిన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా ఈడెన్‌ గార్డెన్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం సాధించింది.  ఆదివారం(మే 27) సీఎస్‌కేతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌-11 ఫైనల్‌ పోరులో తలపడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement