
బంగ్లాను తక్కువ అంచనా వేయలేం: సాహా
టెస్టుల్లో 4–0తో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించినప్పటికీ... తదుపరి బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకోవడం లేదని భారత వికెట్
టెస్టుల్లో 4–0తో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించినప్పటికీ... తదుపరి బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకోవడం లేదని భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్నాడు. ర్యాంకుల పరంగా ఇరు జట్ల మధ్య ఉన్న అంతరంతో బంగ్లా చిన్న ప్రత్యర్థిగానే కనిపిస్తుంది కానీ ఆ జట్టును తక్కువగా అంచనా వేయలేమని సాహా స్పష్టం చేశాడు.
అతను నేడు (సోమవారం) హైదరాబాద్‌లో జట్టుతో కలుస్తాడు. ‘బరిలోకి దిగాక అందరి దృష్టి గెలుపుపైనే ఉంటుంది. ర్యాంకు పరంగా బంగ్లాదేశ్ వెనకబడి ఉండొచ్చు. కానీ ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. మైదానంలో ఏమైనా జరగొచ్చు. వ్యూహాలను సరిగ్గా అమలు చేసే విధానంపై విజయం ఆధారపడి ఉంటుంది’ అని సాహా పేర్కొన్నాడు.