సాహా ఆరోపణలపై కమిటీ నివేదిక.. | Wriddhiman Saha Issue: BCCI Apex Council To Review Probe Committee Report | Sakshi
Sakshi News home page

Wriddhiman Saha: సాహా ఆరోపణలపై కమిటీ నివేదిక..

Published Tue, Apr 12 2022 7:52 AM | Last Updated on Tue, Apr 12 2022 7:57 AM

Wriddhiman Saha Issue: BCCI Apex Council To Review Probe Committee Report - Sakshi

Wriddhiman Saha Allegations- న్యూఢిల్లీ: భారత వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ఇంటర్వ్యూ విషయమై బెదిరింపులకు పాల్పడిన ఉదంతంపై విచారించిన కమిటీ తమ నివేదికను బీసీసీఐకి అందజేసింది. బోర్డు ఉన్నతస్థాయి అధికారుల బృందం ఈ నెల 23న నివేదికను పరిశీలించి చర్యలు తీసుకునే అవకాశముంది. ప్రముఖ స్పోర్ట్స్‌ జర్నలిస్టు బొరియా మజుందార్‌ ... సాహాను ఇంటర్వ్యూ అడిగాడు.

క్రికెటర్‌ స్పందించకపోవడంతో బెదిరించినట్లుగా వాట్సాప్‌లో సాహాకు ఎస్సెమ్మెస్‌ పంపడం వివాదాస్పదమైంది. ఓ సీనియర్‌ క్రికెటర్, బోర్డు కాంట్రాక్టు ప్లేయర్‌ను ఓ సాధారణ జర్నలిస్టు శాసించడంపై బోర్డు విచారణ చేపట్టింది. ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, కోశాధికారి అరుణ్‌ ధుమాల్, సభ్యుడు ప్రభ్‌తేజ్‌ భాటియాలతో కూడిన త్రిసభ్య కమిటీ సాహా ఆరోపణలపై విచారించింది. 

చదవండి: IPL 2022: టైటాన్స్‌ జోరుకు రైజర్స్‌ బ్రేక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement