apex council
-
నీటి పంపిణీ బాధ్యత కృష్ణా బోర్డుదే
సాక్షి, అమరావతి: కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 అవార్డు అమల్లోకి వచ్చేవరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాలు పంపిణీ చేసే బాధ్యత కృష్ణా బోర్డుదేనని కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేసింది. నీటి పంపకాల్లో అపెక్స్ కౌన్సిల్ జోక్యం చేసుకోబోదని బోర్డుకు తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలకు నీటి పంపిణీపై జనవరి 21న నిర్వహించే 19వ సర్వసభ్య సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా 811 టీఎంసీలను ఉమ్మడి ఏపీకి కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. విభజన నేపథ్యంలో కృష్ణా నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తకుండా చూసేందుకు 2014 మే 28న కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన నీటి కేటాయింపుల ఆధారంగా 2015–16 నీటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు 512.06, తెలంగాణకు 298.94 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015 జూలై 18–19న కేంద్ర జల్ శక్తి తాత్కాలిక సర్దుబాటు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో 2016 సెప్టెంబర్ 21న అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశంలో 2016–17 సంవత్సరంలోనూ తాత్కాలిక సర్దుబాటు ప్రకారమే నీటిని పంపిణీ చేసుకోవడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చాలని..రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకాల అంశాన్ని అపెక్స్ కౌన్సిల్లో చర్చించి.. తుది నిర్ణయం తీసుకునేలా అజెండాలో చేర్చాలని కేంద్ర జల్ శక్తి శాఖకు కృష్ణా బోర్డు విజ్ఞప్తి చేసింది. కృష్ణా బోర్డు పనితీరుపై 2024 జనవరి 9న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కృష్ణా జలాల పంపకం అంశాన్ని కృష్ణా బోర్డు అధికారులు లేవనెత్తారు. కృష్ణా జలాల పంపకం జోలికి అపెక్స్ కౌన్సిల్ వెళ్లబోదని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి తేల్చిచెప్పారు. కేడబ్ల్యూడీటీ–2 అవార్డు అమల్లోకి వచ్చే వరకూ ఇప్పటిలానే రెండు రాష్ట్రాలతో ఏటా సంప్రదింపులు జరిపి.. నీటిని పంపిణీ చేసే బాధ్యత కృష్ణా బోర్డుదేనని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 66:34 నిష్ఫత్తిలో పంపిణీఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో లభ్యత గల జలాల్లో ఏపీ 66 శాతం, తెలంగాణ 34 శాతం వాడుకునేలా 2017–18 నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. 2018–19, 2019–20, 2020–21, 2021–22, 2022–23 సంవత్సరాల్లో బోర్డు సర్వసభ్య సమావేశాల్లో రెండు రాష్ట్రాలతో చర్చించి అదే పద్ధతి ప్రకారం కృష్ణా బోర్డు నీటిని పంపిణీ చేసింది. కానీ.. 2023–24 నీటి సంవత్సరానికి సంబంధించి నీటి పంపకాలపై 2023 మే 10న నిర్వహించిన కృష్ణా బోర్డు సమావేశంలో తమకు 50 శాతం వాటా కావాలని తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. దీన్ని ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి తోసిపుచ్చారు. దాంతో కృష్ణా జలాల లభ్యత, అవసరాలపై ఎప్పటికప్పుడు చర్చించి, కేటాయింపులు చేసే బాధ్యతను త్రిసభ్య కమిటీకి కృష్ణా బోర్డు అప్పగించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. పాత పద్ధతి ప్రకారమే ఉమ్మడి ప్రాజెక్టుల్లో 66 శాతం ఏపీ, తెలంగాణకు 34 శాతం పంపిణీ చేస్తూ కృష్ణా బోర్డు తుది నిర్ణయం తీసుకుంది. -
‘కృష్ణా’పై మళ్లీ కొట్లాట!
సాక్షి, హైదరాబాద్: నీటి పంపకాల జోలికి అపెక్స్ కౌన్సిల్ వెళ్లదని కేంద్ర జలశక్తి శాఖ తేల్చిచెప్పడంతో కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటు అంశం మళ్లీ కృష్ణా బోర్డు ముందుకొచ్చిoది. దీంతో తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీ, ఇతర అంశాలపై చర్చించడానికి జనవరి 21న కృష్ణా బోర్డు భేటీ కానుంది. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల వాటా ఉండగా ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలిక సర్దుబాటు పేరుతో జరిపిన కేటాయింపులు 2021–22 వరకు కొనసాగాయి. ఆ తర్వాతి నుంచి తెలంగాణ రాష్ట్రం ఆ కేటాయింపులను వ్యతిరేకిస్తోంది. 50:50 నిష్పత్తిలో తాత్కాలికంగా నీటి పంపిణీ జరపాలని కోరుతోంది. అయితే ఏపీ మాత్రం 66:34 నిష్పత్తిలోనే నీటి పంపిణీ కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది.ఎజెండాలో తెలంగాణ ప్రతిపాదనలివీ..» నాగార్జునసాగర్ నిర్వహణ, పర్యవేక్షణ, యాజమాన్యాన్ని అప్పగించాలి. ఆనకట్టల భద్రత చట్టం 2021 ప్రకారం సాగర్ నిర్వహణ, పర్యవేక్షణ వంటి కార్యకలాపాలు తెలంగాణ పరిధిలోకే వస్తాయి. రాష్ట్ర విభజన నాటి నుంచి సాగర్ డ్యామ్, కుడి, ఎడమ కాల్వల రెగ్యూలేటర్ల నిర్వహణ, పర్యవేక్షణ తెలంగాణ చేతిలో ఉండగా 2023 నవంబర్ 28న ఏపీ అదీనంలోకి సగం డ్యామ్‌ను తీసుకోవడం సరికాదు. » తెలంగాణ వాడుకోకపోవడంతో సాగర్‌లో మిగిలిన తమ వాటా జలాలను తదుపరి నీటి సంవత్సరంలో వాడుకోవడానికి అనుమతించాలి. » సాగర్ టెయిల్‌పాండ్ డ్యామ్ గేట్ల నిర్వహణను తెలంగాణకే అప్పగించాలి. ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణకు ఏపీ అడ్డుకోకుండా సహకరించాలి. » ఆర్డీఎస్ కుడికాల్వ పనులను ఏపీ చేపట్టరాదు. » ఏపీ నీటి వినియోగాన్ని కచ్చితంగా లెక్కించడానికి శ్రీశైలం, సాగర్, ప్రకాశం, సుంకేశుల బరాజ్‌ల వద్ద టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. » కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పు ప్రకారం తాగునీటికి తీసుకున్న జలాల్లో 20 శాతాన్నే లెక్కించాలి. » రాయలసీమ ఎత్తిపోతలు సహా అనుమతుల్లేకుండా కృష్ణా బేసిన్లో ఏపీ చేపడుతున్న ఇతర ప్రాజెక్టులు, ఎస్ఆర్ఎంసీ కాల్వ లైనింగ్ పనులను నిలుపుదల చేయాలి. » శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, తెలుగు గంగ, హెచ్ఎన్ఎస్, నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ఇతర మార్గాల ద్వారా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు కృష్ణా జలాలను ఏపీ తరలించకుండా నిలువరించాలి. » ఏపీ పరిధిలో శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్‌కు అత్యవసర మరమ్మతులు నిర్వహించాలి. ఏపీ ప్రతిపాదించిన అంశాలు..» శ్రీశైలం, సాగర్, ఇతర ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే వరకు సాగర్ కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించుకోవాలి. » నీటి కేటాయింపుల్లేకుండా తెలంగాణ చేపట్టిన సుంకిశాల ఇన్‌టేక్ వెల్ నిర్మాణాన్ని అడ్డుకోవాలి. » పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను మాకు అందించాలి. » పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టా సిస్టమ్‌కు తరలించడానికి బదులుగా సాగర్ ఎగువన 80 టీఎంసీల కృష్ణా జలాలు వాడుకొనే అవకాశాన్ని గోదావరి ట్రిబ్యునల్ కల్పించింది. వాటిలో మిగిలిన ఉన్న 45 టీఎంసీలను తెలంగాణ పాలమూరు–రంగారెడ్డికి కేటాయించింది. ఆ జలాలపై తెలంగాణకు ఎలాంటి హక్కులు లేవు. » కల్వకుర్తి లిఫ్టు ద్వారా అదనంగా 15 టీఎంసీల తరలింపు పనులకు గెజిట్ నోటిఫికేషన్లో అనుమతుల నుంచి మినహాయింపు కల్పించడం సరికాదు.» అనుమతులు లేకుండా తెలంగాణ చేపట్టిన అచ్చంపేట, నారాయణపేట – కొడంగల్ లిఫ్టు పనులను అడ్డుకోవాలి. -
కృష్ణాపై తెలంగాణ మరో అక్రమ ఎత్తిపోతల
సాక్షి, అమరావతి: కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం మరో అక్రమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం, పర్యావరణ అనుమతి తీసుకోకుండా అచ్చంపేట ఎత్తిపోతల నిర్మాణానికి సిద్ధమైంది. శ్రీశైలం జలాశయం నుంచి 5 టీఎంసీలను తరలించి అచ్చంపేట నియోజకవర్గంలో 57,200 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా రూ.1,061.39 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టింది. బుధవారం టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిని నిలిపివేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా సిద్ధమైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా నదిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. కానీ శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీలు తరలించడానికి తెలంగాణ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను 2015లో చేపట్టింది. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కారుకు దొరికిపోయిన నాటి సీఎం చంద్రబాబు.. ఈ ఎత్తిపోతలను అడ్డుకోవడంలో, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో విఫలమయ్యారు. ఇప్పుడు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా అదనంగా 5 టీఎంసీలను శ్రీశైలం నుంచి తరలించి, వాటిని ఎదుల రిజర్వాయర్‌లో నిల్వ చేసి, అక్కడి నుంచి ఉమామహేశ్వర రిజర్వాయర్‌లోకి.. అక్కడి నుంచి అచ్చంపేట ఎత్తిపోతల కింద కొత్తగా నిర్మించే రిజర్వాయర్లలోకి తరలించేలా తెలంగాణ నూతన ప్రాజెక్టు చేపట్టింది. దీనికి పర్యావరణ అనుమతి, అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోలేదు. ఈ ఎత్తిపోతలను తక్షణమే నిలిపివేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల్ శక్తి శాఖకు, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎన్జీటీలో పిటిషన్ వేయనుంది. -
‘కృష్ణా’లో తాత్కాలిక కోటాకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటు కొనసాగింపునకు బ్రేక్ పడింది. 2015 నుంచి కొనసాగుతున్న తాత్కాలిక బటా్వడాను 2023–24 నీటి సంవత్సరంలోనూ కొనసాగించాలని ఏపీ పట్టుబట్టగా తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం కోసం కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈలోగా 2023–24లో ఇరు రాష్ట్రాల నీటి అవసరాలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు నీటి కేటాయింపులపై బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ నెల 10న హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన కృష్ణా బోర్డు 17వ సర్వసభ్య సమావేశంలో బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఇరు రాష్ట్రాలకు పంపిన సమావేశం మినట్స్‌లో ఈ అంశాన్ని బోర్డు వెల్లడించింది. 9 ఏళ్ల తర్వాత తాత్కాలిక కోటాకు బ్రేక్ బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు (66 శాతం), తెలంగాణకు 299 టీఎంసీల(34 శాతం)ను తాత్కాలిక కోటాగా 2015లో కేంద్ర జలశక్తి శాఖ కేటాయించింది. ఆ తర్వాత నుంచి ఏటా ఈ కేటాయింపులను కృష్ణా బోర్డు గతేడాది వరకు కొనసాగించింది. తమ సమ్మతి లేకుండా 66:34 నిష్పత్తిలోని కోటాను కొనసాగించే అధికారం బోర్డుకు లేదని, ఈ అంశంపై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం కోసం కేంద్రానికి రిఫర్ చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ బోర్డు సమావేశంలో పట్టుబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలోని 29 ప్రాజెక్టులకు బచావత్ ట్రిబ్యునల్ జరిపిన కేటాయింపుల ఆధారంగా 66:34 నిష్పత్తిలో తాత్కాలిక కోటాను ఖరారు చేశారని, దీన్నే కొనసాగించాలని ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ డిమాండ్ చేశారు. తాత్కాలిక కేటాయింపుల అంశాన్ని కేంద్రానికి రిఫర్ చేయాలన్న తెలంగాణ డిమాండ్‌ను వ్యతిరేకించారు. ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేసే అధికారం బోర్డుకు లేదా కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రం ఆమోదించిన తెలంగాణలోని ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు వరుసగా 40, 40, 25 టీఎంసీలు కలిపి మొత్తం 105 టీఎంసీలు అవసరం కాగా, కేటాయింపులు లేవని తెలంగాణ తరఫున రజత్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో వాటిని అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చినందున నీటి కేటాయింపులకు అడ్డంకిగా మారిందన్నారు. 66:34 ని ష్పత్తిలో జరిపిన తాత్కాలిక కేటాయింపు లకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులతో సంబంధం లేదని ఏపీ వాదనను కొట్టిపారేశారు. ఇరుపక్షాల మధ్య సమ్మతి కుదరకపోవడంతో ఈ అంశాన్ని కేంద్రానికి నివేదిస్తూ కృష్ణా బోర్డు చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం వద్దకు ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారం గెజిట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదని తెలంగాణ మరోసారి తెగేసి చెప్పింది. ఈ అంశాన్ని కేంద్రం ద్వారా అపెక్స్ కౌన్సిల్‌కు నివేదించాలని, గెజిట్ నోటిఫికేషన్‌పై పునఃసమీక్ష కోరాలని డిమాండ్ చేసింది. తెలంగాణ సూచన మేరకు ఈ అంశాన్ని కేంద్ర జలశక్తిశాఖకు రిఫర్ చేయాలని బోర్డు నిర్ణయించింది. తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టుల విభాగాలను బోర్డుకు అప్పగిస్తే తమ భూభాగంలోని విభాగాలను సైతం అప్పగిస్తామని ఏపీ స్పష్టం చేసింది. -
‘అపెక్స్’కు పాలమూరు, నక్కలగండి
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాలపై కర్ణాటక అభ్యంతరాలను అపెక్స్ కౌన్సిల్ ముందుంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. శనివారం అమిత్ షా అధ్యక్షతన తిరువనంతపురంలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రాజెక్టులపై చర్చించారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణా జలాల్లో హక్కుగా రావాల్సిన వాటాను సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా శ్రీశైలం జలాశయం ఫోర్‌షోర్ (ముందు జలాలు) నుంచి నీటిని తరలించడానికి ఈ ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని తెలంగాణ స్పష్టం చేసింది. కర్ణాటక ఆందోళనలు, అభ్యంతరాలకు తావు లేదని పేర్కొంది. పాలమూరు–రంగారెడ్డి డీపీఆర్‌ను ఇప్పటికే సీడబ్ల్యూసీకి సమర్పించామని, నక్కలగండి డీపీఆర్‌కి తుదిరూపు ఇస్తున్నామని కౌన్సిల్‌కి నివేదించింది. ఈ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కోరగా.. సదరన్ కౌన్సిల్ కేవలం సలహా మండలి మాత్రమేనని, సమస్యను అపెక్స్ కౌన్సిల్ ముందుంచాలని అమిత్ షా సూచించారు. మాకే రూ.17,828 కోట్లు రావాలి ఏపీ విద్యుత్ సంస్థల నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.17,828 కోట్ల బకాయిలను పరిగణనలోకి తీసుకోకుండానే.. ఏపీ విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన రూ.6,756 కోట్ల బకాయిలను చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ తమను ఏకపక్షంగా ఆదేశించిందని తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యుత్ బకాయిలపై సదరన్ కౌన్సిల్లో పరిశీలన జరపాలని గత మార్చి 28న 12వ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నప్పటికీ, కేంద్రం తొందరపడి ఉత్తర్వులిచ్చిందని తప్పుబట్టింది. పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుంటాం ►ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల విభజన సమస్యను పరస్పర అంగీకారంతో ఇరు రాష్ట్రాలు పరిష్కరించుకుంటాయని తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హామీ ఇచ్చారు. ►మహిళలు, పిల్లలపై లైంగిక నేరాలు, అత్యాచారాల కేసుల త్వరితగతిన విచారణ, పురోగతిపై అదనపు డీజీ స్వాతి లక్రా ఇచ్చిన ప్రజెంటేషన్‌ను అమిత్‌షా ప్రశంసించి ఇతర రాష్ట్రాలకు సైతం సహకరించాలని సూచించారు. ►పన్నుల విషయంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని కొన్ని నిబంధనలు తెలంగాణకు, మరికొన్ని ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా ఉన్నాయని, ఇప్పుడు చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. చట్ట సవరణ జరపాలని ఏపీ చేసిన ప్రతిపాదనను వ్యతిరేకించింది. ►సెక్షన్ 10లోని ప్రభుత్వ రంగ సంస్థల విభజనతోపాటు సెక్షన్ 66పై ఏపీ అభ్యంతరాల విషయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర హోంశాఖను అమిత్ షా ఆదేశించారు. ►షెడ్యూల్–9లోని 90 ప్రభుత్వరంగ సంస్థల విభజనను ఏకకాలంలో జరపాలని ఏపీ కోరగా, ఎలాంటి వివాదా లు లేని 53 సంస్థల విభజనను ముందుగా పూర్తి చేయాలని అమిత్ షా పేర్కొన్నారు. మిగిలిన వివాదాలను క్రమంగా పరిష్కరించుకోవాలని సూచించారు. జల వివాదాలను ఉమ్మడిగా పరిష్కరించుకోండి: అమిత్ షా నీటి వివాదాలకు ఉమ్మడి పరిష్కార మార్గాలు వెదకాలని దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హితవు పలికారు. ఏపీ, తెలంగాణ తమ పెండింగ్ సమస్యలన్నింటినీ పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ భేటీలో దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జల వివాదం, తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపకంపై గొడవలున్నాయని మంత్రి గుర్తు చేశారు. అనంతరం భేటీ విశేషాలపై అధికారిక ప్రకటన వెలువడింది. ‘భేటీలో 26 అంశాలపై చర్చ జరిగింది. తొమ్మిదింటికి పరిష్కారం లభించింది. మిగతా 17 అంశాలపై మళ్లీ చర్చించాలని నిర్ణయం జరిగింది. వీటిలో 9 అంశాలు ఏపీ పునర్వ్యవస్థీకరణకు సంబంధించినవే’అని పేర్కొంది. విభజన సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం: హోంమంత్రి మహమూద్ రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంలో తీవ్రజాప్యం జరుగుతుండటం పట్ల రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచినా ఉద్యోగుల విభజన, ప్రభుత్వ, ఇతర సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలు, ఇతర సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో ఆయన రాష్ట్రం తరపున పాల్గొని మాట్లాడారు. కేంద్ర హోంశాఖ చొరవతో ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు వేగవంతంగా పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ భేటీలో పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరామ్, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. -
సాహా వ్యవహారం.. స్పోర్ట్స్ జర్నలిస్ట్‌పై రెండేళ్ల నిషేధం!
టీమిండియా సీనియర్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా ఆరోపణలపై విచారణ కమిటీ సమర్పించిన నివేదికను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ శనివారం సమీక్షించింది. ఇంటర్య్వూ ఇవ్వనందుకు స్పోర్ట్స్ జర్నలిస్ట్ బొరియా మజుందార్ తనను బెదిరించాడంటూ గత ఫిబ్రవరిలో సాహా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సమాచారం ప్రకారం.. సాహా వ్యవహారంలో జర్నలిస్ట్ బొరియా మజుందార్‌దే తప్పని తేలడంతో అతనిపై రెండేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది. ఈ రెండేళ్ల కాలంలో మజుందార్ టీమిండియా ఆటగాళ్లను కలవడం గానీ.. స్వదేశంలో భారత్ ఆడే మ్యాచ్‌లకు వెళ్లడం చేయకూడదని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా సాహా చేసిన ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపేందుకు.. వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ట్రెజరర్ అరుణ్ ధుమాల్, అపెక్స్ కౌన్సిల్ మెంబర్ ప్రభుతేజ్ బాటియాలతో బీసీసీఐ ఒక కమిటీని నియమించింది. కాగా గత నెలలో కమిటీ ముందు హాజరైన సాహా, బొరియా మజుందార్లు తమ వెర్షన్‌ను వెల్లడించారు. ఇంటర్వ్యూ ఇవ్వనందుకు మజుందార్ తనను బెదిరించాడని సాహా పేర్కొనగా.. మరోవైపు సాహా వాట్సప్ చాట్‌ను తారుమారు చేసి స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని ఆరోపించాడు. ఇద్దరి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న విచారణ కమిటి నిజానిజాలు నిగ్గుతేల్చి శనివారం బీసీసీఐకి తమ నివేదికను సమర్పించింది. ''అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డుకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. సాహా వ్యవహారంలో తప్పు బొరియా మజుందార్దేనని రిపోర్టులో తేలిందని.. అందుకే భారత్ స్వదేశంలో ఆడే మ్యాచ్‌లకు మజుందార్‌ను అనుమతించకూడదు. అంతేకాదు ఆటగాళ్లను కూడా కలవకూడదు.. ఎలాంటి ఇంటర్య్వూలు తీసుకోకూడదు. ఇది రెండేళ్ల పాటు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి విషయాలు త్వరలోనే వెల్లడిస్తాం'' అంటూ బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సాహా టీమిండియా తరపున 40 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. చదవండి: సాహా ట్వీట్.. వాట్సాప్ మెసేజ్‌ల స్క్రీన్షాట్లు.. రంగంలోకి బీసీసీఐ..! ‘అతడు కాంట్రాక్ట్ ప్లేయర్..’ Wriddiman Saha: బెదిరింపులు నిజమేనా?.. సాహాను వివరణ కోరనున్న బీసీసీఐ After all of my contributions to Indian cricket..this is what I face from a so called “Respected” journalist! This is where the journalism has gone. pic.twitter.com/woVyq1sOZX — Wriddhiman Saha (@Wriddhipops) February 19, 2022 -
సాహా ఆరోపణలపై కమిటీ నివేదిక..
Wriddhiman Saha Allegations- న్యూఢిల్లీ: భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఇంటర్వ్యూ విషయమై బెదిరింపులకు పాల్పడిన ఉదంతంపై విచారించిన కమిటీ తమ నివేదికను బీసీసీఐకి అందజేసింది. బోర్డు ఉన్నతస్థాయి అధికారుల బృందం ఈ నెల 23న నివేదికను పరిశీలించి చర్యలు తీసుకునే అవకాశముంది. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టు బొరియా మజుందార్ ... సాహాను ఇంటర్వ్యూ అడిగాడు. క్రికెటర్ స్పందించకపోవడంతో బెదిరించినట్లుగా వాట్సాప్‌లో సాహాకు ఎస్సెమ్మెస్ పంపడం వివాదాస్పదమైంది. ఓ సీనియర్ క్రికెటర్, బోర్డు కాంట్రాక్టు ప్లేయర్‌ను ఓ సాధారణ జర్నలిస్టు శాసించడంపై బోర్డు విచారణ చేపట్టింది. ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్, సభ్యుడు ప్రభ్‌తేజ్ భాటియాలతో కూడిన త్రిసభ్య కమిటీ సాహా ఆరోపణలపై విచారించింది. చదవండి: IPL 2022: టైటాన్స్ జోరుకు రైజర్స్ బ్రేక్ -
‘కృష్ణా’లో మా వాటా తేల్చండి
సాక్షి, హైదరాబాద్: అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటాను ఖరారు చేసే అంశాన్ని తక్షణమే కృష్ణా ట్రిబ్యునల్–2కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84 (3) (4) కింద జల వివాదాలను నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్‌కు అప్పగించాలని అపెక్స్ కౌన్సిల్ తీసుకు న్న నిర్ణయమే అంతిమమని స్పష్టం చేసింది. ఈ విషయంలో విరుద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి కేంద్రంతో సహా ఏ అథారిటీకి అధికారం లేదంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీ) 1956లోని సెక్షన్–3 కింద 2014 జూలై 14న ఏపీపై చేసిన ఫిర్యాదును దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంచడం.. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా హక్కులను తెలంగాణకు నిరాకరించడమేనని అభిప్రాయపడింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ గురువారం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. 574.6 టీఎంసీలు కేటాయించాలి కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు కేటాయిస్తూ 2015లో తీసుకున్న తాత్కాలిక నిర్ణయం ఆధారంగానే ఇప్పటికీ కృష్ణా బోర్డు రెండు రాష్ట్రా లకు కేటాయింపులు చేయడంపై రాష్ట్రం అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర పరిధిలోని కృష్ణా బేసిన్లో సాగు విస్తీర్ణం, కరువు ప్రభావిత ప్రాంతాలు, జనాభాను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి 574.6 టీఎంసీలను కేటాయించాలని కోరినా బోర్డు పట్టించుకోవడం లేదంది. ఈ అంశం తమ పరిధిలో లేదని, ట్రిబ్యునల్ మాత్రమే సమీక్షించగలదని బోర్డు పేర్కొందని వెల్లడించింది. ట్రిబ్యునల్‌కు అప్పగించండి: సుప్రీంకోర్టులో కేసును ఉపసంహరించుకుంటే ఫిర్యాదును ట్రిబ్యునల్‌కు అప్పగించాలని 2020 అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేసును ఉపసం హరించుకున్నామని తెలంగాణ తెలిపింది. న్యాయ సల హా మేరకు కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలా లేదా కృష్ణా ట్రిబ్యునల్–2కు బాధ్యత అప్పగించాలా అనే అం శంపై నిర్ణయిస్తామని అప్పట్లో అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించిందని గుర్తు చేసింది. కృష్ణా ట్రిబ్యునల్–2 రద్దు కానందున తెలంగాణ ఫిర్యాదును దీనికే అప్పగించడం సముచితమని అభిప్రాయపడింది. కృష్ణా జలాల్లో తమ చట్ట బద్ధ హక్కులనే కోరామని.. ఇతర రాష్ట్రాల హక్కులు, ప్ర యోజనాలకు భంగం కలుగుతుందని భావించొద్దని స్ప ష్టం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టానికి పరిమితులుండటంతోనే ఐఎస్ఆర్డబ్ల్యూడీ–1956 చట్టం కింద ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకాలు జరుపుతూ కృష్ణా ట్రిబ్యునల్–2 జారీ చేసిన మధ్యంతర నివేదికలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, కర్ణాటక, మహారాష్ట్రల ప్రయోజనాలకు ఈ కేసుతో నష్టం ఉండదని అభిప్రాయపడింది. -
‘హెచ్‌సీఏపై సీబీఐ అవసరం’
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై సీబీఐ దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. క్రికెట్లో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటోందని వ్యాఖ్యానించింది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్, ఎథిక్స్ అధికారిగా జస్టిస్ దీపక్ వర్మను నియమించాలని అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని సస్పెండ్ చేస్తూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు పక్కన పెట్టడంతో హెచ్‌సీఏ, బడ్డింగ్‌స్టార్ క్రికెట్ క్లబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై గురువారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా హెచ్‌సీఏ వ్యవహారాలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ కొంత మంది మంచి వ్యక్తుల్ని నియమిస్తాం. విచారణకు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులను నియమిస్తాం. హెచ్‌సీఏలోని రెండు గ్రూపులు మేనేజ్మెంట్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. సీబీఐ దర్యాప్తు అవసరం. న్యాయవ్యవస్థను కూడా లాగాలని వారు చూస్తున్నారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘జస్టిస్ వర్మను ఎలాంటి ఆర్డర్ ఇవ్వొద్దని తెలపండి. ఆయన పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. బుధవారానికి విచారణ వాయిదా వేస్తాం. ఈ లోగా విచారణ నిమిత్తం కొందరు విశ్రాంత న్యాయమూర్తుల పేర్లు పరిశీలిస్తాం’’ అని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. -
స్పోర్ట్స్మెన్గా అజహార్‌కు మర్యాదిస్తాం.. అతనికి అడ్మినిస్ట్రేషన్ తెలీదు
సాక్షి, హైదరాబాద్: అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తూ అంబుడ్స్‌మెన్ జస్టిస్ దీపక్‌వర్మ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో కౌన్సిల్ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, కార్యదర్శి విజయానంద్ ఇతర కౌన్సిల్ సభ్యులు బుధవారం ఉప్పల్ స్టేడియంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ను తిరిగి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షునిగా నియమించిన అంబుడ్స్‌మన్‌కు అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేసే అధికారం లేదని కౌన్సిల్ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ పేర్కొన్నారు. అంబుడ్స్‌మెన్ ఇచ్చిన నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించామని, దానిపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చిందని ఆయన వెల్లడించారు. స్పోర్ట్స్మెన్గా అజహార్‌కు రెస్పెక్ట్ ఇస్తాం.. కానీ, అతనికి అడ్మినిస్ట్రేషన్ తెలీదని చురకలంటించారు. రేపటి నుండి జరిగే క్రికెట్ లీగ్స్‌కు అజహార్‌కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. అసోసియేషన్ కోసం అందరం కలిసికట్టుగా పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు, అంబుడ్స్‌మెన్‌గా దీపక్‌వర్మ నియామకం చెల్లదని అపెక్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ విజయానంద్ అన్నారు. అతన్ని అంబుడ్స్‌మెన్‌గా తాము ఎన్నికొలేదని పేర్కొన్నారు. ఏప్రిల్‌లో జరిగిన ఏజీఎమ్ సమావేశంలో మెజార్టీ సభ్యులు జస్టిస్ నిస్సార్ అహ్మద్ ఖక్రూను అంబుడ్స్‌మన్‌గా ఎన్నుకున్నారని తెలిపారు. ఈ నెల 18న అజహార్ నియమించిన జిల్లాల అఫిలియేషన్‌పై నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. తమ స్పోర్ట్స్ రూంను లాక్ చేశారని, రికార్డులు స్వాధీనం చేసుకున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ విషయమై రేపు లీగ్స్ ప్రారంభించడానికి వచ్చే స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్‌గౌడ్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కేసు విషయమై తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా పడిందని తెలిపారు. -
హైకోర్టులో అజారుద్దీన్‌కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తాజాగా బుధవారం అజారుద్దీన్‌కు naహైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవలే అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తూ అంబుడ్స్‌మెన్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. అంబుడ్స్‌మెన్ ఎవరనే దానిపై క్లారిటీ లేకపోవడంతోనే స్టే విధిస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు అపెక్స్ కౌన్సిల్ స్థానంలో అజహర్ నియమించిన కొత్త సభ్యుల నియామకంపైనా హైకోర్టు స్టే విధించింది. కాగా ఇటీవలే హెచ్‌సీఏలోని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారని, అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
హెచ్‌సీఏ వివాదం: జింఖానా వద్ద హైటెన్షన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్‌సీఏ)లో వివాదం ముదురుతోంది. సికింద్రాబాద్ జింఖానా వద్ద హెటెన్షన్ నెలకొంది. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రెస్‌మీట్‌కు పోలీసుల అనుమతి నిరాకరించారు. జింఖానా బయట భారీగా పోలీసుల మోహరించారు. ఈ క్రమంలో ఎలాగైనా ప్రెస్‌మీట్ నిర్వహిస్తామని అపెక్స్ కౌన్సిల్ అంటోంది. అంబుడ్స్‌మెన్ ప్రకటనపై అపెక్స్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అజార్ విజ్ఞప్తి మేరకు జింఖానా వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు అడ్డొస్తే ఎవరినీ ఉపేక్షించమని పోలీసులు తెలిపారు. జింఖానా నుంచి అజార్‌ను కూడా బయటకు పంపేందుకు పోలీసులు యత్నించారు. అజార్ గ్రూప్, జాన్ మనోజ్ గ్రూప్‌లను పోలీసులు అడ్డుకుంటున్నారు. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు అంబుడ్స్‌మన్ మధ్య పంచాయతీ తీవ్రమవుతోంది. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో అజార్‌కు అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అపెక్స్ కౌన్సిల్ జాన్ మనోజ్‌ను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నియమించింది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ ఫిర్యాదు మేరకు అంబుడ్స్‌మన్ దీపక్ వర్మ అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేశారు. తదుపరి విచారణ జరిపేంత వరకు అపెక్స్ కౌన్సిల్ రద్దు కొనసాగనుంది. ఈ క్రమంలో అంబుడ్స్‌మన్ నిర్ణయాన్ని అపెక్స్ కౌన్సిల్ తప్పుపట్టింది. అంబుడ్స్‌మన్‌గా దీపక్ వర్మను ఏజీఎం వ్యతిరేకించింది. అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసే అధికారం దీపక్‌వర్మకు లేదని పేర్కొంది. దీపక్‌వర్మ నియామకమే చెల్లదని అపెక్స్ కౌన్సిల్ అంటోంది. -
HCA లో కీలకపరిణామం అపెక్స్ కౌన్సిల్ రద్దు
-
హెచ్‌సీఏలో కొత్త ట్విస్ట్; అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేసిన అంబుడ్స్‌మన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తున్నట్లు అంబుడ్స్‌మన్ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ జరిపేంత వరకు అపెక్స్ కౌన్సిల్ రద్దు చేస్తున్నట్లుగా అంబుడ్స్‌మన్ తెలిపింది. కాగా ఇటీవలే హెచ్‌సీఏలోని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారని, అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అజహర్ ఫిర్యాదును పరిశీలించిన అంబుడ్స్‌మన్ అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే దీనిపై అపెక్స్ కౌన్సిల్ స్పందిస్తూ అసలు అంబుడ్స్‌మన్ నియామకం చెల్లదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబుడ్స్‌మన్‌గా దీపక్ వర్మను అజార్ ఏకపక్షంగా నియమించాడని.. ఆ వ్యక్తి అజహర్ చెప్పినట్టే వ్యవహరిస్తాడని పేర్కొంది. కాగా రేపు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. -
రాయలసీమకు అన్యాయం జరిగిందని గతంలో కేసీఆర్ అన్నారు
-
అపెక్స్ కౌన్సిల్ తీరుపై అజారుద్దీన్ ఫైర్
-
అజారుద్దీన్ వ్యాఖ్యలపై అపెక్స్ కౌన్సిల్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్, అపెక్స్ కౌన్సిల్ మధ్య హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఎ) వ్యవహారాలలో గొడవలు తార స్థాయికి చేరాయి. తాజాగా అజారుద్దీన్ వ్యాఖ్యలపై అపెక్స్ కౌన్సిల్ కౌంటర్ ఇచ్చింది. లోధా సిఫార్సుల నిబంధనల మేరకే అజారుద్దీన్‌కు నోటీసులు జారీ చేసినట్లు కౌన్సిల్ పేర్కొంది. అపెక్స్ కౌన్సిల్‌లోని ఆరుగురిలో ఐదుగురు సభ్యులకు నోటీసు పంపినట్లు తెలిపారు. ఈరోజు(గురువారం) నుంచి అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడు కాదని అపెక్స్ కౌన్సిల్ పేర్కొంది. హెచ్‌సీఏ వ్యవహారాల్లో బీసీసీఐ జోక్యం ఉండదని అపెక్స్ కౌన్సిల్ వివరించింది. కాగా నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ స్వయంగా అజహర్‌పై హెచ్‌సీఏ చర్య తీసుకుంది. సభ్యత్వం రద్దు చేసే హక్కు లేదు! అపెక్స్ కౌన్సిల్లో ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడ్డారని అజారుద్దీన్ ఆరోపించారు. తన సభ్యత్వం రద్దు చేసే హక్కు వారికి లేదని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్ల అవినీతి బయటపడుతుందనే తనపై ఆరోపణలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రెసిడెంట్ లేకుండా మీటింగ్‌లు ఎలా పెడతారు? అని అపెక్స్ కౌన్సిల్‌ను అజారుద్దీన్ ప్రశ్నించారు. అంబుడ్స్‌మన్ నియామకం సరైనదేనని హైకోర్టు కూడా చెప్పిందని గుర్తు చేశారు. 25 ఏళ్లుగా అదే వ్యక్తులు హెచ్‌సీఎలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఎవరినీ రానివ్వరు.. వచ్చినా ఉండనివ్వరు.. బ్లాక్మెయిల్ చేస్తారు.. అంటూ నిరసన వ్యక్తం చేశారు. చదవండి: వాళ్ల అవినీతి బయటపడుతుందనే నన్ను తొలగించారు: అజారుద్దీన్ -
'వాళ్ల అవినీతి బయటపడుతుందనే నన్ను తొలగించారు'
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసొసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్ష పదవి నుంచి భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ను నాటకీయ పరిణామాల మధ్య తొలిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ నోటీసులపై అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అజారుద్దీన్ మాట్లాడుతూ.. 'ఉద్దేశపూర్వకంగానే నాకు నోటీసులు ఇచ్చారు. హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగేలా నేనెప్పుడూ పనిచేయలేదు. అపెక్స్ కౌన్సిల్లో ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడ్డారు. వాళ్ల నిర్ణయమే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంగా చెబితే ఎలా?. అవినీతిని అరికట్టడానికి అంబుడ్స్‌మన్‌ను నియమిస్తే అడ్డుకున్నారు... వాళ్ల అవినీతి బయటపడుతుందనే నాపై కుట్రలు పన్నారు' అంటూ చెప్పుకొచ్చారు. కాగా నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ స్వయంగా అజహర్‌పైనే హెచ్‌సీఏ చర్య తీసుకుంది. అసోసియేషన్ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌ను ఆ పదవినుంచి తప్పిస్తున్నట్లు హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రకటించింది. ఆయన హెచ్‌సీఏ సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అజహర్‌పై పలు ఆరోపణలు చేస్తూ ఈ నెల 10న అతనికి షోకాజ్ నోటీసు జారీ చేయగా...అందుకు అజహర్ స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు అపెక్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. చదవండి: అజహరుద్దీన్‌పై వేటు! -
అజహరుద్దీన్‌పై వేటు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అనూహ్య పరిణామం! నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ స్వయంగా అధ్యక్షుడిపైనే హెచ్‌సీఏ చర్య తీసుకుంది. అసోసియేషన్ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌ను ఆ పదవినుంచి తప్పిస్తున్నట్లు హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రకటించింది. ఆయన హెచ్‌సీఏ సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అజహర్‌పై పలు ఆరోపణలు చేస్తూ ఈ నెల 10న అతనికి షోకాజ్ నోటీసు జారీ చేయగా...అందుకు అజహర్ స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు అపెక్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. యూఏఈలో జరిగిన అనధికారిక టి10 టోర్నీలో ఒక జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడం, తన రిటైర్మెంట్ తేదీపై తప్పుడు సమాచారం ఇవ్వడం, హెచ్‌సీఏ ఖాతాలను స్థంభింపజేయడం, అంబుడ్స్‌మన్ ని యామకం, ఆటగాళ్ల ఎంపికలో జోక్యం చేసుకోవడం, హెచ్‌సీఏ సమావేశాలకు హాజరు కాకపోవడం తదితర అంశాలపై ఆరోపణలు చేసిన అపెక్స్ కౌన్సిల్...ఇకపై అసోసియేషన్ కార్యకలాపాల్లో అజహర్ పాల్గొనరాదని నిషేధం విధించింది. గత కొంత కాలంగా అజహర్‌కు, అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్నాయి. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో అవతలి పక్షంపై ఇరు వర్గాలు విరుచుకు పడుతున్నాయి. వివాదం బీసీసీఐ వరకు చేరినా, దీనిపై బోర్డు పెద్దగా స్పందించలేదు. ఇదే అపెక్స్ కౌన్సిల్ విభేదించినా సరే... ఇటీవల జరిగిన ఎస్‌జీఎంలో కూడా హెచ్‌సీఏ ప్రతినిధిగా అజహర్ పాల్గొనే అవకాశం బీసీసీఐ కల్పించింది. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయానికి చట్టబద్ధత ఉందా లేదా అనే అంశంపై స్పష్టత లేని నేపథ్యంలో అజహర్‌పై వేటు అంశం ఆసక్తికరంగా మారింది. -
సత్వరమే పోలవరం ఫలాలు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ప్రాజెక్టు పోలవరానికి సవరించిన వ్యయ అంచనాల మేరకు సత్వరమే నిధులు మంజూరు చేయాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో రెండో రోజు బుధవారం ఉదయం షెకావత్‌ను కలుసుకుని సీఎం అరగంటపాటు సమావేశమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పక్ష నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. షెకావత్‌తో సీఎం చర్చించిన అంశాలు ఇవీ.. భారీగా పునరావాసం, భూసేకరణ వ్యయం.. పోలవరాన్ని గడువులోగా పూర్తి చేసి సత్వరమే ప్రజలకు ఫలాలను అందించేందుకు తగిన సహాయం అందించాలని సీఎం జగన్ కోరారు. 2017–18 ధరల ప్రకారం సవరించిన వ్యయ అంచనాలు –2 (ఆర్సీఈ) మేరకు పోలవరానికి రూ.55,656 కోట్ల మేర వ్యయం అవుతుందన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూ సేకరణ, పునరావాస పనులకు గణనీయమైన మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తోందని, 2021 డిసెంబర్‌కు వీటిని పూర్తి చేయాలని వివరించారు. 2005–06తో పోలిస్తే 2017–18 నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య 44,574 నుంచి 1,06,006కి పెరిగిందని తెలిపారు. ముంపునకు గురవుతున్న ఇళ్ల సంఖ్య కూడా భారీగా పెరిగిందని చెప్పారు. పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ. 1,779 కోట్ల మేర రీయింబర్స్ చేయాల్సి ఉందని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం జరిగితే అంచనా వ్యయం పెరిగిపోతుందని, ఏపీకి ప్రాణాధారమైన ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాల్సిన అవసరం ఉందని షెకావత్‌కు నివేదించారు. అపెక్స్ కౌన్సిల్ అంశాలపై.. అక్టోబర్‌లో జరిగిన ‘అపెక్స్’ సమావేశంలో చర్చకు వచ్చిన పలు అంశాలను సీఎం ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించిందని వివరించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. అనుసంధానానికి సహకరించండి: షెకావత్ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నదుల అనుసంధానం ప్రాజెక్టుకు సహకరించాలని జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ముఖ్యమంత్రి జగన్‌ను కోరారు. గోదావరి–కావేరీ అనుసంధానంపై జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్ వెదిరె త్వరలో ఏపీకి వస్తారని తెలిపారు. -
కృష్ణా బోర్డుకు రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్
సాక్షి, అమరావతి: అపెక్స్ కౌన్సిల్ భేటీలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు కేంద్ర జల సంఘానికి(సీడబ్ల్యూసీ) పంపారు. దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ సీడబ్ల్యూసీ సోమవారం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పీహెచ్ఆర్ (పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్) ద్వారా తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్ ఆయకట్టుకు సాగునీరు.. కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు, చెన్నైకి తాగునీటిని మరింత మెరుగ్గా సరఫరా చేసేందుకే ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వాటా నీటిని వాడుకోక ముందే.. ► విభజన చట్టాన్ని తుంగలో తొక్కి.. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండానే తెలంగాణ సర్కార్ శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను 2015లో చేపట్టింది. ఇదే తరహాలో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచడం ద్వారా రోజుకు 0.4 టీఎంసీ, ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని 30 నుంచి 40 టీఎంసీలకు పెంచడం ద్వారా రోజుకు 0.5 టీఎంసీ తరలించేలా పనులు చేపట్టింది. ► శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు 3 టీఎంసీలను తరలించేలా తెలంగాణ సర్కార్ కొత్తగా ప్రాజెక్టులు చేపట్టింది. సాగర్‌లో సరిపడా నీటి నిల్వలు ఉన్నప్పటికీ, దిగువన సాగునీటి అవసరాలు లేకపోయినా తెలంగాణ సర్కార్ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 796 అడుగుల నుంచే రోజుకు నాలుగు టీఎంసీలను తరలిస్తోంది. మొత్తంగా ఏడు టీఎంసీలను తరలిస్తుండటం వల్ల ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గిపోతోంది. 841 అడుగుల్లో చుక్క నీరు రాదు – శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పీహెచ్ఆర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు 44 వేల క్యూసెక్కులు తరలించవచ్చు. కానీ గత పదేళ్ల రికార్డులను పరిశీలిస్తే.. ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి 15 నుంచి 20 రోజులు కూడా ఉండే అవకాశం లేదు. – శ్రీశైలంలో 854 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడు పీహెచ్ఆర్ ద్వారా కాలువలోకి ఏడు వేల క్యూసెక్కులే చేరుతాయి. 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే చుక్క నీరు కూడా రాదు. – తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌కు కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు ఉన్నా సరే.. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు, చెన్నైలకు తాగునీటిని కూడా సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. – ఈ పరిస్థితిని అధిగమించడానికి ట్రిబ్యునల్ కేటాయింపు ద్వారా హక్కుగా రాష్ట్రానికి దక్కిన 512 టీఎంసీలను సమర్థవంతంగా వినియోగించుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున పీహెచ్ఆర్ దిగువన కాలువలోకి ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టింది. డీపీఆర్‌ను అధ్యయనం చేస్తున్న కృష్ణా బోర్డు – కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు అక్టోబర్ 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ అయ్యింది. – ఈ భేటీలో తెలంగాణ సర్కార్ లేవనెత్తిన అభ్యంతరాలను కొట్టిపారేస్తూ.. పాత ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు మరింత మెరుగ్గా నీళ్లందించడానికి, రాయలసీమ, చెన్నైకి తాగునీటి ఇబ్బందులను పరిష్కరించడానికే ఈ ఎత్తిపోతల చేపట్టామని సీఎం వైఎస్ జగన్ బలంగా వాదనలు వినిపించారు. కొత్తగా నీటిని నిల్వ చేయడానికి ఎలాంటి రిజర్వాయర్లు నిర్మించడం లేదని స్పష్టంగా తేల్చి చెప్పారు. – ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ గజేంద్రసింగ్ షెకావత్ కోరారు. ఇందులో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్‌ను గత నెల 16న రాష్ట్ర జల వనరుల శాఖ సీడబ్ల్యూసీకి సమర్పించింది. – రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఇదివరకే తేల్చి చెప్పింది. ఈ దృష్ట్యా దీనిపై అధ్యయనం చేస్తున్న కృష్ణా బోర్డు వారం రోజుల్లో డీపీఆర్‌ను ఆమోదిస్తూ నివేదిక ఇస్తుందని, అనంతరం సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇస్తుందని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ తర్వాత విభజన చట్టంలో నిబంధనల మేరకు రాయలసీమ ఎత్తిపోతలకు అపెక్స్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. -
మూడు అంశాలే ప్రామాణికం!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 అమల్లోకి వచ్చిన తేదీ నాటికి ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ప్రాతిపదికన గోదావరి జలాల పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నీటి లభ్యత 75 శాతం కంటే అధికంగా ఉన్న మిగులు జలాలపై పూర్తి అధికారాన్ని దిగువ రాష్ట్రానికే బచావత్ ట్రిబ్యునల్ కట్టబెట్టడాన్ని ప్రస్తావించనుంది. విభజన నేపథ్యంలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కే మిగులు జలాలపై పూర్తి హక్కులు కల్పించడాన్ని కూడా గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటుకు ప్రాతిపదికగా తీసుకోవాలని కోరాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య గోదావరి, కృష్ణా నదీ జలాల వినియోగంలో తలెత్తిన విభేదాలను పరిష్కరించేందుకు ఈనెల 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశాన్ని నిర్వహించిన విషయం విదితమే. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం(ఐఆర్డబ్ల్యూడీఏ)–1956 ప్రకారం ప్రతిపాదనలు పంపితే గోదావరి జలాల పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని షెకావత్ పేర్కొన్నారు. ఇందుకు ఏపీ, తెలంగాణ సీఎంలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖరరావు అంగీకరించారు. సీఎంల ఒప్పందాలే ప్రాతిపదికగా.. దేశవ్యాప్తంగా నదీ జలాల వివాదాలను పరిష్కరించి పరీవాహక ప్రాంతాలకు నీటిని కేటాయించేందుకు 1969 ఏప్రిల్ 10న ఆర్ఎస్ బచావత్ నేతృత్వంలో డీఎం బండారీ, డీఎం సేన్ సభ్యులుగా ట్రిబ్యునల్ ఏర్పాటైంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చేసుకున్న ఒప్పందాలు ప్రాతిపదికగా బచావత్ ట్రిబ్యునల్ గోదావరి జలాలను పంపిణీ చేసింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు 1,430 టీఎంసీల నికర జలాలను కేటాయిస్తూ 1980లో ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పర్ గోదావరి(జీ–1) నుంచి శబరి(జీ–12) వరకు నదీ పరీవాహక ప్రాంతాన్ని 12 ఉప పరీవాహక ప్రాంతాలుగా ట్రిబ్యునల్ విభజించింది. ప్రతి ఉప పరీవాహక ప్రాంతంలో రాష్ట్రాలకు కేటాయించగా మిగులుగా ఉన్న నికర జలాలను వినియోగించుకునే వెసులుబాటును దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెట్టింది. 75 శాతం కంటే అధికంగా నీటి లభ్యత ఉన్న మిగులు జలాలపై పూర్తి హక్కును ఆంధ్రప్రదేశ్‌కే కలి్పంచింది. 25 ఏళ్ల పాటు ఈ తీర్పు అమల్లో ఉంటుందని, ఆ తర్వాత సమీక్షించుకోవచ్చని సూచించింది. రెండో జీడబ్ల్యూడీటీ తెరపైకి.. అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీలో తీసుకున్న నిర్ణయంతో జీడబ్ల్యూడీటీ–2 తెరపైకి వచ్చింది. జీడబ్ల్యూడీటీ–2 ఏర్పాటుకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అంశాలపై కేంద్రానికి మూడు ప్రతిపాదనలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ప్రతిపాదనలు ఇవీ.. ► ఉమ్మడి రాష్ట్రం విడిపోయే నాటికి అంటే 2014 జూన్ 2 నాటికి గోదావరి జలాల్లో 660 టీఎంసీలను వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్, 472 టీఎంసీలు వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేశాయి. మరో 116 టీఎంసీలను వాడుకునే సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్, 178 టీఎంసీలు ఉపయోగించుకునేలా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. అంటే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు 776, తెలంగాణకు 650 వెరసి 1,426 టీఎంసీలను కేటాయించాలి. ► బచావత్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు జీ–1 నుంచి జీ–12 వరకు పరీవాహక రాష్ట్రాలకు కేటాయించగా మిగులుగా ఉన్న నికర జలాలను దిగువ రాష్ట్రమైన ఏపీకే కేటాయించాలి. ► 75 శాతం కంటే నీటి లభ్యత అధికంగా ఉండే మిగులు జలాలపై పూర్తి అధికారాన్ని బచావత్ ట్రిబ్యునల్ దిగువ రాష్ట్రమైన ఏపీకే ఇచ్చింది. ఆ మేరకు నీటి కేటాయింపులు చేస్తే, జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించిన మేరకు నదుల అనుసంధానం ప్రాజెక్టు పనులు చేపడతాం. -
మినిట్స్ వచ్చేదాకా... వేచిచూద్దాం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో రాష్ట్రానికి సమన్యాయం చేయాలని కోరుతూ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టంలోని సెక్షన్–3 కింద సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణపై ప్రభుత్వం వేచిచూసే ధోరణి అవలంబించనుంది. మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు అధికారికంగా మినిట్స్ రూపంలో వెలువడ్డాక... దానిలో కేంద్రం ఇచ్చే హామీల ఆధారంగానే పిటిషన్ ఉపసంహరించుకోవాలనే యోచనలో ఉంది. సెక్షన్–3 కింద దాఖలు చేసుకున్న పిటిషన్‌ను రాష్ట్రం ఉపసంహరించుకుంటే తెలంగాణ వినతిని కొత్త ట్రిబ్యునల్‌కు లేక ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునల్‌కు రిఫర్ చేస్తామని స్పష్టమైన హామీ పొందాకే ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ అవసరాలపై వాదనలు వినిపించే అవకాశం రాలేదు. పరవాహకం, ఆయకట్టు ఆధారంగా చూసినా రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న కేటాయింపులు 299 టీఎంసీల నుంచి 500 టీఎంసీలకు పెరగాల్సి ఉంది. ఈ దృష్ట్యా కృష్ణా జలాల్లో న్యాయం జరిగేలా కొత్త ట్రిబ్యునల్‌తో పునః విచారణ చేయించండని రాష్ట్ర ప్రభుత్వం 2014లోనే సెక్షన్–3ను ప్రస్తావిస్తూ కేంద్రాన్ని కోరింది. దీనిపై ఏడాదిలోగా నిర్ణయం చేయాల్సి ఉన్నా కేంద్రం ఇంతవరకూ స్పందించలేదు. ఏడాది వేచిచూశాక ఈ అంశంపై తెలంగాణ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇదే విషయాన్ని అపెక్స్ భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన షెకావత్ సెక్షన్–3పై సుప్రీంలో పిటిషన్ ఉన్నందున... ట్రిబ్యునల్‌కు రిఫర్ చేసే అంశం న్యాయ పరిధిలోకి వస్తుందని, తెలంగాణ పిటిషన్ ఉపసంహరించుకుంటే న్యాయ సలహా మేరకు కొత్త ట్రిబ్యునల్ లేదా ప్రస్తుత ట్రిబ్యునల్‌తో విచారణ చేయించేలా నిర్ణయం చేస్తామని హామీ ఇచ్చారు. అపెక్స్ భేటీ అనంతరం మీడియా సమావేశంలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. బుధవారమే కేసు విత్‌డ్రా చేసుకుంటానని తెలంగాణ సీఎం చెప్పారంటూ షెకావత్ ప్రకటించారు. ఈ ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ ఉపసంహరించుకుంటుందా? అన్న దానిపై అందరి దృష్టి పడింది. అయితే దీనిపై అధికారవర్గాలను కదిలించగా అపెక్స్‌లో కేంద్రం ఇచ్చిన హామీ అధికారికంగా మినిట్స్ రూపంలో రాష్ట్రానికి అందాల్సి ఉందని, అందులో విస్పష్టమైన హామీ ఉంటే పిటిషన్ ఉపసంహరణకు అభ్యంతరమేమీ లేదని తేల్చిచెప్పారు. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గోదావరి ట్రిబ్యునల్‌పై మౌనమే? ఇక, గోదావరి నదీ జల వివాదాల పరిష్కారం కోసం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఇరురాష్ట్రాల నుంచి వినతులు వస్తే ఏడాదిలోపు నిర్ణయం చేస్తామని కేంద్రమంత్రి షెకావత్ వెల్లడించారు. అయితే గోదావరిలో నీటి వినియోగం, వాటాలకు సంబంధించి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలంగాణ అంటోంది. నికర జలాల్లో 967 టీఎంసీల వాటా ఉందని, ఆ వాటాను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని చెబుతోంది. నికర జలాల వాటా 65 శాతం ఉండగా అదే నిష్పత్తిలో వరద జలాలను వినియోగించుకుంటామని అంటోంది. ఈ లెక్కన ఏడాదిలో గోదావరిలో సగటున 3 వేల టీఎంసీల వరద ఉన్నా తెలంగాణకు 1900 టీఎంసీల మేర వరద జలాలపై హక్కు ఉంటుందని చెబుతోంది. గోదావరిలో నీటి వాటాలపై బచావత్ ట్రిబ్యునల్ ఇప్పటికే స్పష్టంగా చెప్పినందున కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును కోరుతూ ఎలాంటి లేఖలు రాయబోమని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా బోర్డుల పరిధిని నోటిఫై చేస్తామని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో కృష్ణా (కేఆర్ఎంబీ), గోదావరి (జీఆర్ఎంబీ) నదీ జలాల యాజమాన్య బోర్డులు బుధవారం సమావేశమై వర్కింగ్ మాన్యువల్‌పై చర్చించాయి. -
కొత్త ప్రాజెక్టులను అపెక్స్ ఆపమంది..!
సాక్షి, వరంగల్: కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్లో ఉమ్మడి వరంగల్ ప్రాజెక్టులపై కీలక చర్చ జరిగింది. కృష్ణా బేసిన్లో ఆంధ్రప్రదేశ్, గోదావరి బేసిన్లో తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై పరస్పరం ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలలో కొత్తగా చేపడుతున్న తొమ్మిది ప్రాజెక్టుల పనులను తక్షణమే ఆపాలని కేంద్రమంత్రి ఆగస్టు 11న ఆదేశాలు జారీ చేశారు. అయితే, తొమ్మిది ప్రాజెక్టుల జాబితాలో ఏడు తెలంగాణకు సంబంధించినవి కాగా, ఇందులో నాలుగు ఉమ్మడి వరంగల్‌లోనివే ఉన్నాయి. తాజాగా మంగళవారం ఇదే అంశంపై కేంద్రమంత్రి షెకావత్ రెండు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, మరోమారు జిల్లా ప్రాజెక్టులు తెరపైకి వచ్చాయి. ఆపాలన్న ప్రాజెక్టులు ఇవే... కేంద్రం ఆపాలని సూచించిన ప్రాజెక్టుల జాబితాలో తెలంగాణకు సంబంధించినవి ఏడు ఉన్నాయి. తెలంగాణ సాగునీటి సరఫరా పథకం, సీతారామ ఎత్తిపోతలు, లోయర్ పెనుగంగ నదిపై బ్యారేజీలు, కాళేశ్వరం మూడో టీఎంసీ ఎత్తిపోతలు, గోదావరి ఎత్తిపోతలు, తుపాకులగూడెం, రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు నీటి మళ్లింపు పథకాలపై అభ్యంతరాలు చెప్పింది. ఇందులో రామప్ప, పాకాల సరస్సు మళ్లింపు, కాళేశ్వరం మూడో టీఎంసీ, తుపాకులగూడెం(సమ్మక్క సాగర్), గోదావరి ఎత్తిపోతల పథకాలు ఉమ్మడి వరంగల్‌లోని కీలక ప్రాజెక్టులు. తెలంగాణకే తలమానికంగా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దేవాదుల ఎత్తిపోతల పథకం కూడా తుది దశకు చేరింది. తుపాకులగూడెం పనులు శరవేగంగా సాగుతుండగా, రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు నీటి మళ్లింపుపై కూడా జల్‌శక్తి శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మీడియా సమావేశంలో ఏ ప్రాజెక్టు కట్టాలన్నా అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్‌దేనని గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేయడంపై జిల్లాలో చర్చ జరుగుతోంది. డీపీఆర్‌ల తయారీపై కసరత్తు అపెక్స్ కౌన్సిల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర నివేదికలను వారంలోగా సిద్ధం చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు కసరత్తు మొదలెట్టారు. మంగళవారం సమావేశం ముగిసిన వెంటనే నీటిపారుదలశాఖ కార్యదర్శి ఉమ్మడి వరంగల్‌లో ప్రాజెక్టుల ఇన్‌చార్జ్‌లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కాళేశ్వరం మూడో టీఎంసీతో సహా అభ్యంతరాలు వ్యక్తమైన నాలుగు ప్రాజెక్టులపైనా నివేదికలు సిద్ధం చేయడంపై దృష్టి సారించారు. ఈ మేరకు కాళేశ్వరం ఎత్తిపోతలు, గోదావరి ఎత్తిపోతల మూడో దశ, తుపాకులగూడెం, రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు నీటి మళ్లింపు పథకాలకు సంబంధించి పర్యవేక్షక, కార్యనిర్వాహక ఇంజినీర్లకు మౌఖిక ఆదేశాలు అందాయి. అపెక్స్ కౌన్సిల్‌కు ముందే నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్.. కౌన్సిల్ తర్వాత కూడా స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ కాళేశ్వరం ఎత్తిపోతల డీపీఆర్‌ను ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం పరిధిని మార్చి రోజుకు రెండు టీఎంసీల నుంచి మూడు టీఎంసీలు మళ్లించేలా సామర్థ్యాన్ని పెంచింది. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘం పరిశీలనకు ఇవ్వకుండానే పనులు చేపట్టారని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రాజెక్టు పరిధి లేదా వ్యయంలో మార్పు జరిగితే మళ్లీ ఆమోదం పొందాల్సి ఉంటుందని కౌన్సిల్ సూచించినట్లు తెలిసింది. అదేవిధంగా రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సు వరకు మళ్లింపు పథకంపై కొత్త డీపీఆర్‌ను సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
నేడు అపెక్స్ కౌన్సిల్ సమావేశం
-
మా నీళ్లు.. మా హక్కు
సాక్షి, అమరావతి: ట్రిబ్యునల్ కేటాయించిన జలాలు మా రాష్ట్ర హక్కు.. వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తాగు, సాగునీటి సౌకర్యాలను మెరుగుపర్చడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామన్న విషయాన్ని అపెక్స్ కౌన్సిల్‌కు స్పష్టంచేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై మంగళవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యేందుకు సోమవారం ఢిల్లీకి వచ్చిన ఆయన.. రాత్రి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో అపెక్స్ కౌన్సిల్లో లేవనెత్తాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ వివరాలు.. ► శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచే కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, ఎస్సెల్బీసీ ద్వారా రోజూ 2.95 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉందని.. అదే నీటి మట్టం నుంచి నీటిని తరలించడానికే రాయలసీమ ఎత్తిపోతలను చేపడితే తప్పేంటని ప్రశ్నించాలని నిశ్చయించారు. ► అలాగే, శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా 796 అడుగుల నుంచే రోజూ నాలుగు టీఎంసీలను నాగార్జునసాగర్‌కు తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉందని.. ఈ సీజన్ ఆరంభంలో సాగర్‌లో నీటి నిల్వలున్నా.. కృష్ణా బోర్డు ఆదేశాలను ధిక్కరించి తెలంగాణ నీటిని తరలిస్తోందని.. దీనివల్లే నీటిమట్టం తగ్గిపోతోందన్న అంశాన్ని ప్రస్తావించాలని నిర్ణయించారు. శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా కాలువలోకి ప్రస్తుతమున్న డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు చేరుతాయని.. ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి సగటున 20 రోజులు కూడా ఉండదనే వాస్తవాన్ని అపెక్స్ కౌన్సిల్‌కు వివరించనున్నారు. ► నీటి మట్టం 854 అడుగుల్లో ఉంటే కాలువలోకి ఏడు వేల క్యూసెక్కులే చేరుతాయని.. అదే 841 అడుగులకు చేరితే కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు చేసినా నీటిని తరలించలేమని వివరించనున్నారు. ► దీనివల్ల తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ఆయకట్టులో సాగునీరు, తాగునీటికి ఎదురవుతున్న ఇబ్బందులను చెప్పనున్నారు. ► దీనికి పరిష్కారంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం మినహా మరొక మార్గంలేదని స్పష్టం చేయనున్నారు. ► రాయలసీమ ఎత్తిపోతల ద్వారా వాటాకు మించి ఒక్క చుక్కను కూడా అదనంగా తరలించబోమని.. పాత ఆయకట్టుకే నీళ్లందిస్తామని.. తెలంగాణ ప్రాజెక్టులకు ఎలాంటి విఘాతం కలగదని స్పష్టంచేయాలని సమావేశంలో నిర్ణయించారు. కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయాలి ► కృష్ణా బోర్డు ఏర్పాటై ఏడేళ్లవుతున్నా ఇప్పటికీ దాని పరిధిని ఖరారు చేయకపోవడం.. వర్కింగ్ మ్యాన్యువల్‌ను ఆమోదించకపోవడంపై అపెక్స్ కౌన్సిల్‌ను ప్రశ్నించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ► ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం నిర్వహణ బాధ్యతలను ఏపీకి అప్పగించారని.. కానీ, ఎడమ గట్టు కేంద్రాన్ని తెలంగాణ అధీనంలో ఉంచారని.. అదే సాగర్ నిర్వహణ బాధ్యతలను తెలంగాణకు అప్పగించారని.. కానీ, ఏపీ భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను తెలంగాణ అధీనంలో ఉంచడంపైనా ప్రశ్నించనున్నారు. ► తక్షణమే కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి.. శ్రీశైలం, సాగర్లను బోర్డు పరిధిలోకి తేవాలని డిమాండ్ చేయనున్నారు. అలాకాని పక్షంలో శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రంతోపాటు ప్రాజెక్టును పూర్తిస్థాయలో ఏపీ అధీనంలోకి తేవాలని.. సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఏపీ పరిధిలోకి తీసుకొచ్చేలా కోరాలని నిర్ణయించారు. న్యాయబద్ధంగానే నీటిని పంపిణీ చేయాలి ► కేడబ్ల్యూడీటీ–2 తుది తీర్పు వెలువడే వరకూ 2015లో జూన్ 18, 19న కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలను పంపిణీ చేయాలని మరోసారి కేంద్రాన్ని కోరాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ► కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని ప్రతిపాదించనున్నారు. ► బేసిన్లో జూన్ 2, 2014 నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ఆధారంగానే గోదావరి జలాలను పంపిణీ చేయాలని అపెక్స్ కౌన్సిల్‌ను కోరనున్నారు. ► గోదావరి బోర్డు పరిధిని ఖరారు చేసి.. వర్కింగ్ మ్యాన్యువల్‌ను ఆమోదించాలని కోరనున్నారు. -
‘అపెక్స్’కు వేళాయె
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలపై చర్చించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో కేంద్ర జల శక్తి శాఖ నిర్వహించనున్న అపెక్స్ కౌన్సిల్ భేటీకి తెలంగాణ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు కేంద్రం, బోర్డులు లేవనెత్తే అన్ని అంశాలకు గట్టిగా సమాధానం ఇచ్చేలా సమగ్ర నివేదికలు తయారు చేసింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కౌన్సిల్ చైర్మన్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన వెబినార్ ద్వారా జరిగే ఈ భేటీలో తెలంగాణ, ఏపీ సీఎంలు, కేంద్ర జల సంఘం అధికారులు, కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లు పాల్గొన నున్నారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, వాటి డీపీఆర్‌ల సమర్పణ, బోర్డుల పరిధి వంటి అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. పునఃకేటాయింపులు.. సమ న్యాయం అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్రం ముందు లేవనెత్తాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ఇంజనీర్లతో చర్చించారు. కేంద్రం తీరును గట్టిగా ఎండగట్టేలా నివేదికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా కేంద్రం తీరు వల్లే వివాదాలు పెరిగాయని, వారి పట్టింపు లేనితనం వల్లే అవి ముదురుతున్నాయన్న అంశాలను అపెక్స్ భేటీలో ఎత్తిచూపాలని నిర్ణయించారు. అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టంలోని సెక్షన్–3 మేరకు ఏ రాష్ట్రమైనా ఫిర్యాదు చేసిన ఏడాదిలో పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో అవే అంశాలతో ట్రిబ్యునల్‌కు సిఫార్సు చేయాలని స్పష్టంగా ఉన్నా అలాంటి చర్యలేవీ తీసుకోలేదంటున్న రాష్ట్రం ఈ అంశంపై కేంద్రాన్ని కడిగేయాలని నిర్ణయించింది. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం మొత్తం కేటాయింపుల్లో కేవలం 35 శాతమే ఉన్నాయని, తెలంగాణలో ఉన్న ఆయకట్టు ప్రాంతం 62.5 శాతాన్ని లెక్కలోకి తీసుకుంటే ప్రస్తుత కేటాయింపులు మాత్రం సరిపోవని తెలంగాణ ఇప్పటికే కేంద్రం దృష్టికి తెచ్చింది. పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా రాష్ట్రానికి కేటాయింపులు 299 టీఎంసీల నుంచి 500 టీఎంసీలకు పెరగాలని రాష్ట్రం అంటోంది. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు 77 టీఎంసీల నీటి కేటాయింపుల కోసం విజ్ఞప్తి చేసినా, ట్రిబ్యునల్ పట్టించుకోని దృష్ట్యా, దీనిపై పునఃసమీక్షించి కేటాయింపులు చేయాలని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని గట్టిగా కోరనుంది. ఇక రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 (ఏ), సెక్షన్ (బీ)లకు సంబంధించి ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు ఎలా ఉండాలి, నీటి లోటు ఉన్నప్పుడు నీటి కేటాయింపులు జరపాలన్నది బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణకు సంబంధించిన అవసరాలను, ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను దృష్టిలో పెట్టుకొని విచారణ చేయాలని కేంద్రం స్పష్టంగా సూచించకపోవడంతో ట్రిబ్యునల్‌లో రాష్ట్రానికి న్యాయం జరగట్లేదని ప్రభుత్వం బలంగా భావిస్తోంది. ఈ అంశాలనే ప్రధాన అస్త్రాలుగా అపెక్స్ భేటీలో కేంద్రాన్ని నిలదీయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇక బేసిన్లో లేని ప్రాంతాలకు కృష్ణా నది నీటిని ఏపీ ప్రభుత్వం తరలించుకొని వెళుతున్నా, పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు చేపట్టినా, వాటిని నిలుపుదల చేయడంలో బోర్డు విఫలమైన తీరును ఎండగట్టే అవకాశం ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కాల్వలను విస్తరించడంపై అభ్యంతరం తెలపడంతోపాటు వాటిని ఆపించేలా ఒత్తిడి తీసుకురానుంది. కృష్ణా, గోదావరి బేసిన్లలో కొత్త ప్రాజెక్టులేవీ లేవని, అవన్నీ పాత ప్రాజెక్టులేనని నిరూపించే జీవోలు, అనుమతుల వివరాలతో తెలంగాణ సిద్ధమైంది. -
న్యాయబద్ధంగా నీటి కేటాయింపులు
వరదలు ఉధృతంగా ఉన్నప్పుడు భారీగా నీరు సముద్రంలో కలుస్తోంది. అలాంటప్పుడు వాడుకునే నీటికి లెక్కలు కట్టడం భావ్యం కాదు. వృథాగా పోతున్న నీటిని ఎవరైనా వాడుకోవచ్చనేదే మా విధానం. – రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాలను రెండు రాష్ట్రాలకు శాస్త్రీయంగా కేటాయించాలని అపెక్స్ కౌన్సిల్‌కు స్పష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 తీర్పు వెలువడే వరకు 2015లో జూన్ 18, 19న రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారమే జలాలను పంపిణీ చేయాలని స్పష్టం చేయనుంది. పరీవాహక ప్రాంతం(బేసిన్)లో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2014 జూన్ 2 నాటికి పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ఆధారంగానే గోదావరి జలాలను (ఆంధ్రప్రదేశ్ 776, తెలంగాణ 650 టీఎంసీలు) పంపిణీ చేయాలని తెగేసి చెప్పాలని నిర్ణయించింది. ఈ నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్లో కృష్ణా, గోదావరి నదీ జలాల్లో వాటా విషయంలో తెలంగాణ లేవనెత్తే అభ్యంతరాలను సాక్ష్యాధారాలతో కొట్టిపారేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. గోదావరిలో 75 శాతం నీటి లభ్యత కంటే ఎక్కువగా ఉన్న జలాలపై పూర్తి హక్కు దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ఉందని, ఆ నీటిని కేటాయిస్తే ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ) ప్రతిపాదించిన మేరకు నదుల అనుసంధానం పనులు చేపడతామని స్పష్టం చేసేందుకు సిద్ధమైంది. పూటకో మాట.. రోజుకో విధానమా? ► కృష్ణా జలాల పంపిణీ విషయంలో తెలంగాణ సర్కార్ పూటకో మాట.. రోజుకో విధానం అనుసరిస్తుండటాన్ని అపెక్స్ కౌన్సిల్లో ఎండగట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ► కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 811 టీఎంసీల నికర జలాల్లో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్, 299 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకునేందుకు అంగీకరిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి సమక్షంలో రెండు రాష్ట్రాల అప్పటి జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శులు ఆదిత్యనాథ్ దాస్, ఎస్కే జోషిలు సంతకం చేసిన అంశాన్ని ఎత్తిచూపాలని నిర్ణయించింది. ► కేడబ్ల్యూడీటీ–2 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మిగులు జలాల్లో కేటాయించిన 197.50 టీఎంసీలను విభజన చట్టంలో షెడ్యూలు 11లో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు గుంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులకు.. తెలంగాణలో కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేయనుంది. ► శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు పూర్తిగా నిండి.. గేట్లు ఎత్తేసిన సమయంలో.. దిగువ ప్రాంతాలకు ముంపు ముప్పును తగ్గించడానికి రెండు రాష్ట్రాలు మళ్లించే వరద జలాలను లెక్కలోకి తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరనుంది. ► కేడబ్ల్యూడీటీ–1 నాలుగింట మూడొంతుల నీటి లభ్యత (75 శాతం) ఆధారంగా కృష్ణా నదిలో 2,130 టీఎంసీలు ఉంటాయని అంచనా వేసి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది. వాటిని కేడబ్ల్యూడీటీ–2 పరిరక్షిస్తూనే.. మూడింట రెండొంతుల (66.66 శాతం) లభ్యత.. 75 శాతం నీటి లభ్యత మధ్య మిగిలిన 448 టీఎంసీల మిగులు జలాలను మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 194 టీఎంసీలు (పునరుత్పత్తితో 197.50 టీఎంసీలు) కేటాయించింది. ఈ జలాలను విభజన చట్టంలో 11వ షెడ్యూలులో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగ, హంద్రీ–నీవా, తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్‌ను కోరనుంది. విభజన రోజు ఆధారంగా గోదావరి జలాల పంపిణీ ► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 1,360 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని.. పునరుత్పత్తితో కలిపి 1,430 టీఎంసీల లభ్యత ఉంటుందని 2004లో వ్యాప్కోస్ నివేదిక ఇచ్చింది. ► 1970–71 నుంచి 2017–18 వరకు పోలవరం వద్ద 3,007 టీఎంసీల మిగులు జలాలు, 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 1,948 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని వ్యాప్కోస్ లెక్క కట్టింది. ఎగువ రాష్ట్రాలు తమకు కేటాయించిన వాటా జలాల్లో 1,400 టీఎంసీలను వినియోగించుకోకపోవడం వల్లే ఈ స్థాయిలో మిగులు జలాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ► ఉమ్మడి రాష్ట్రం విడిపోయే నాటికి అంటే 2014 జూన్ 2 నాటికి గోదావరి జలాల్లో 660 టీఎంసీలను వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్, 472 టీఎంసీలు వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేశాయి. మరో 116 టీఎంసీలను వినియోగించుకునే సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్, 178 టీఎంసీలు ఉపయోగించుకునేలా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని అపెక్స్ కౌన్సిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. -
అదనపు టీఎంసీతో లబ్ధి ఎంత?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ప్రస్తుతం ఉన్న 2 టీఎంసీల నీటి ఎత్తి పోతలకు అదనంగా మరో టీఎంసీ నీటి ఎత్తిపోతలకు సంబంధించి చేపడుతున్న పనులతో ఎంత కొత్త ఆయకట్టు వినియోగంలోకి వస్తుందో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులకు కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవని స్పష్టం చేసిన కేంద్రం, పర్యావరణ అనుమతులపై సైతం ఆరా తీయగా, తాజాగా అదనపు టీఎంసీతో చేకూరే ప్రయోజనాలపై వివరణ కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంగళవారం రాష్ట్రానికి లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2015లో సమర్పించిన వ్యయ అంచనాల మేరకు టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపిందని లేఖలో ప్రస్తావిస్తూ, ప్రస్తుత అంచనా వ్యయాలు ఎంతో చెప్పాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. 98 రోజుల పాటు రోజుకు 2 టీఎంసీల చొప్పున 195 టీఎంసీల నీటి ఎత్తిపోతలకు మాత్రమే టీఏసీ అనుమతిచ్చిందని గుర్తుచేసింది. అయితే అదనంగా రోజుకు మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ప్రతిపాదన ఏదైనా సిద్ధం చేశారా? అలాంటి ప్రతిపాదన ఉంటే.. ఆ వివరాలను తమకు తెలపాలని కేంద్రం ఆదేశించింది. ఇక అదనపు టీఎంసీ పనులపై కేంద్ర జల సంఘానికి ఏవైనా ప్రతిపాదన పంపారా? అని ప్రశ్నిం చింది. నీటి వినియోగానికి సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్నంత తమకు అందజేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో పాటే ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2, వరద కాల్వ, సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద స్థిరీకరణ ఆయకట్టు వివరాలనూ కోరింది. పాత ఆయకట్టునే కొత్తగా చూపిస్తున్నారంటూ.. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులతో కొత్తగా వృధ్ధిలోకి వచ్చే ఆయకట్టు పెద్దగా లేదని, ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టునే కాళేశ్వరం ఆయకట్టు కింద చూపుతున్నారని వివిధ పార్టీల ఎంపీలు, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ వివరాలను కోరినట్లుగా తెలిసింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను సమర్పించాలని పలుమార్లు కోరినా రాష్ట్రం స్పందించలేదు. కాళేశ్వరం అంచనా వ్యయం రూ.80,150 కోట్లుగా గతంలో పేర్కొన్నారని, ప్రస్తుతం సవరించిన అంచనాలు ఎంతో తెలపాలని కేంద్రం ఆదేశించింది. దీనిపై కొనసాగింపుగా ప్రస్తుతం ప్రాజెక్టు అదనపు టీఎంసీతో వృద్ధిలోకి వచ్చే ఆయకట్టు, ప్రయోజనాల వివరాలను కోరడంతో కేంద్రం కాళేశ్వరం అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు కనబడుతోందని ఇరిగేషన్ వర్గాలే అంటున్నాయి. -
డీపీఆర్‌లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్ పరిధిలో చేపట్టిన కొత్త ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్)లను ఈ నెల 10లోగా సమర్పించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించింది. అదే సమయంలో అనుమతిలేని ప్రాజెక్టులపై ముందుకెళ్లరాదని స్పష్టం చేసింది. బోర్డు ఆదేశంతో ప్రాజెక్టుల సాంకేతిక అనుమతి కోసం గోదావరి నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘానికి, వాటి ఆమోదం కోసం అపెక్స్ కౌన్సిల్‌కు నివేదికలు సమర్పించేందుకు తెలంగాణ అంగీకరించగా ఏపీ ఇప్పటికే కొన్ని డీపీఆర్‌లను ఇచ్చింది. మిగిలిన ప్రాజెక్టుల డీపీఆర్‌లను సాంకేతిక అనుమతి బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్‌కు ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. గోదా వరి బేసిన్ పరిధిలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, నీటి వాటాలు, కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, మళ్లింపు జలాల్లో వాటా, టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటు అంశాలపై చర్చించేందుకు గోదావరి బోర్డు శుక్రవారం హైదరాబాద్‌లోని ‘జలసౌధ’లో సమావేశమైంది. బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శులు రజత్‌కుమార్, ఆదిత్యనాథ్దాస్లతోపాటు ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోర్డు ఎజెండా అంశాలతోపాటు ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలపై నాలుగు గంటలపాటు చర్చిం చారు. ఈ భేటీలో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లపై వాడివేడిగా చర్చ జరిగింది. ఆ ప్రాజెక్టులన్నీ రీ ఇంజనీరింగ్ చేసినవే: తెలంగాణ బోర్డు భేటీలో పలు అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులు వాదనలు బలంగా వినిపించారు. ముఖ్యంగా గోదావరి నదిలో తమకు 967 టీఎంసీల మేర వాటా ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన విషయాన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్ గుర్తుచేశారు. తమ వాటా మేరకే నీటి వినియోగాన్ని చేసుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని తెలిపారు. తమ వాటాల్లోంచే నీటిని వినియోగిస్తామన్నారు. అయితే దీనిపై ఏపీ అభ్యంతరం తెలిపింది. బచావత్ అవార్డు ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేయలేదని బోర్డు దృష్టికి తెచ్చింది. కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం, తమ్మిడిహెట్టి, ఛనాకా–కొరటా, రాజంపేట, పింపార్డ్ ప్రాజెక్టులన్నీ కొత్తవేనని, వాటికి ఎలాంటి అనుమతులు లేవని వాదించింది. ఏపీ వాదనపై అభ్యంతరం తెలిపిన తెలంగాణ... ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులనే రీ ఇంజనీరింగ్ చేశామని, వాటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం అటవీ, పర్యావరణ సహా అన్ని అనుమతులు ఇచ్చిందని స్పష్టం చేసింది. దీన్ని ఏపీ ఖండించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులిచ్చే ముందు దిగువ రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని, అదేమీ జరగని దృష్ట్యా తెలంగాణకు ఇచ్చిన అనుమతులను పునఃపరిశీలించాలని కోరుతూ కేంద్రానికి ఇప్పటికే లేఖలు రాసినట్లు వివరించింది. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు ఏపీ మళ్లిస్తున్నందున తమకు 45 టీఎంసీల వాటా రావాలని తెలంగాణ మరోమారు కోరింది. అయితే దీనికి అభ్యంతరం చెప్పిన ఏపీ... ఉమ్మడి రాష్ట్రానికి 45 టీఎంసీలని అవార్డులో ఉందని, ఈ మళ్లింపు జలాల్లో తమకు వాటా దక్కుతుందని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనకు పంపినందున అక్కడి నుంచి వచ్చే ఆదేశాల వరకు ఆగాలని బోర్డు ఇరు రాష్ట్రాలకు సూచించింది. పోలవరం బ్యాక్ వాటర్ సర్వే చేయాలని తెలంగాణ కోరింది. గరిష్ట వరదలు నమోదైనప్పుడు తెలంగాణలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతాయని చెప్పగా ఇప్పటికే కేంద్ర జల సంఘం అధ్యయనం చేసి తెలంగాణకు ఎలాంటి ముంపు లేదని నిర్ధారించిందని ఏపీ స్పష్టం చేసింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ టెలిమెట్రీపై నిపుణులతో కమిటీ.. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ప్రధాన ప్రాంతాల్లో నీటి ప్రవాహ లెక్కల నమోదు కోసం టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. ఏయే ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయాలనే విషయమై ఇరు రాష్ట్రాలతోపాటు సీడబ్ల్యూసీ, పుణేలోని సీడబ్ల్యూపీఆర్ఎస్లోని ఇంజనీర్లతో బోర్డు ఓ కమిటీని నియమించింది. సత్వరమే ‘అపెక్స్’ఎజెండా: చంద్రశేఖర్ అయ్యర్ కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్లు గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాల గురించి వివరణ ఇవ్వాలని తెలంగాణను ఆదేశించినట్లు వెల్లడించారు. అలాగే అపెక్స్ భేటీలో చర్చించాల్సిన ఎజెండా అంశాలను సత్వరమే పంపాలని కోరగా ఇరు రాష్ట్రాలు అంగీకరించాయన్నారు. తెలంగాణ చేపట్టిన పెద్దవాగు ఆధునీకరణ పనులను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ఏపీ ఒప్పుకున్నట్లు తెలిపారు. అనుమతులు లేని ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లరాదని ఇదివరకే ఇరు రాష్ట్రాలను కోరామని, అదే విషయాన్ని మరోమారు స్పష్టం చేసినట్లు తెలిపారు. ఎస్సారెస్పీ డీపీఆర్‌నూ అడగటం విచిత్రం... రాష్ట్రంలో ఎలాంటి కొత్త ప్రాజెక్టులు లేవని బోర్డుకు చెప్పాం. పాత ప్రాజెక్టులకే రీ ఇంజనీరింగ్ చేశాం తప్పితే కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదని వివరించాం. కాళేశ్వరం పాత ప్రాజెక్టేనని కేంద్రం లేఖ సైతం ఇచ్చింది. ప్రాజెక్టుల డీపీఆర్‌లపై ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాక తేలుస్తాం. రాష్ట్రానికి 967 టీఎంసీల వాటా ఉంది. ఈ వాటాల్లోంచే నీటిని వినియోగిస్తాం. ఇక ఎస్సారెస్పీ ప్రాజెక్టు డీపీఆర్‌ను అడగటం విచిత్రం. 2014 జూన్ 2కు ముందు పూర్తయిన డీపీఆర్‌లు అడగొద్దని స్పష్టంగా చెప్పాం.– రజత్‌కుమార్, నీటిపారుదల శాఖ కార్యదర్శి -
‘అపెక్స్’లోనే తేల్చుదాం!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల నియంత్రణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ కోర్టులోకి నెట్టింది. కృష్ణాబోర్డు ఇప్పటికే తయారు చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై తెలుగు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న దృష్ట్యా, దీన్ని కేంద్ర జల వనరులశాఖ మంత్రి, ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో చర్చించి తుది నిర్ణయానికి రావాలని నిర్ణయించింది. కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో ఉన్న సమస్యలపై గురువారం హోంశాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం బోర్డు అధికారులతో చర్చించింది. ఈ భేటీలో బోర్డు సిద్ధంచేసిన వర్కింగ్ మాన్యువల్‌ను సంఘానికి అందించారు. ప్రాజెక్టుల నియంత్రణ తమ పరిధిలో లేనందున శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటి వినియోగంలో ఇరు రాష్ట్రాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని, తమ ఆదేశాలను పట్టించుకోవడం లేదని బోర్డు అధికారులు స్థాయీ సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ దృష్ట్యా ప్రాజెక్టుల నియంత్రణను తమకు అప్పగించాలని కోరడంతో పాటుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో భేటీ జరిపి తుది నిర్ణయం చేద్దామని పార్లమెంటరీ కమిటీ సూచించింది. ఇక టెలీమెట్రీ అంశంపైనా ఈ భేటీలో ఎలాంటి చర్చ జరగలేదని బోర్డు వర్గాలు తెలిపాయి. -
అపెక్స్ కౌన్సిల్ నిర్ణయమే ఫైనల్
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో ఎవ్వరికీ వ్యక్తిగత నిర్ణయం తీసుకునే అధికారంలేదని, అపెక్స్ కౌన్సిల్ నిర్ణయమే ఫైనల్ అని హెచ్‌సీఏ ఇన్చార్జ్ అధ్యక్షుడు కె.అనిల్ కుమార్ అన్నారు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలు కాదని సెక్రటరీ సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల యువ క్రికెటర్లకు ఎంతో ఇబ్బంది అవుతోందని ఆయన పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోకుండా జోనల్ టోర్నమెంట్లు ప్రకటించడం తప్పు అని, ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లు జరుగుతుండగా జోనల్ మ్యాచ్‌లు ఏర్పాటు చేసేందుకు సిద్ధం కావడం సరికాదన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్‌సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాండురంగ మూర్తి, కోశాధికారి మహేంద్రతో కలిసి మాట్లాడుతూ... ఇటీవల అపెక్స్ కమిటీలో నిర్ణయించిన సెలెక్షన్ కమిటీ పంపిన జట్టుతోపాటు, సెక్రటరీ మరో జట్టును కర్ణాటకకు పంపడంతో రెండు జట్లనూ ఆడనివ్వలేదని, దీంతో యువ క్రికెటర్లు ఎంతో నిరాశకు గురయ్యారని గుర్తుచేశారు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకే సెక్రటరీ, అధ్యక్షులు అందరూ పనిచేయాలని సెక్రటరీ సొంతంగా ఏర్పాటు చేసిన జోనల్ కమిటీలు చెల్లవని ఈ విషయాన్ని క్రికెటర్ల తల్లిదండ్రులు గ్రహించాలని తెలిపారు. -
హెచ్‌సీఏలో గొడవ ముదిరింది!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కార్యదర్శి శేష్ నారాయణ్, జి.వివేకానంద్ నేతృత్వంలోని అపెక్స్ కౌన్సిల్ మధ్య గత కొంత కాలంగా సాగుతున్న విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. ఇప్పటి వరకు అవినీతి, నిధుల గోల్మాల్వంటి అంశాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగించిన ఇరు వర్గాలు ఇప్పుడు జట్టు ఎంపిక విషయంలో కూడా తమ అహాన్ని బయట పెట్టాయి. ఈ నెల 18 నుంచి ఆగస్టు 15 వరకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) ఒక టోర్నీ నిర్వహిస్తోంది. 2018–19 రంజీ సీజన్ సన్నాçహాల్లో భాగంగా జరిగే ఈ టోర్నీలో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా హైదరాబాద్ జట్టు బరిలోకి దిగుతోంది. అయితే ఇందులో పాల్గొనే ఆటగాళ్లపై సందిగ్ధత నెలకొంది. అటు కార్యదర్శి, ఇటు అపెక్స్ కౌన్సిల్ రెండు వేర్వేరు జట్లను ప్రకటించాయి. మాదంటే మాదే అధికారిక జట్టని ఇరు వర్గాలు చెబుతున్నాయి. శివాజీ యాదవ్, రమేశ్, నిరంజన్, ఎంపీ అర్జున్, సయ్యద్ మిరాజ్‌లతో కూడా సెలక్షన్ కమిటీ ఆదివారం అపెక్స్ కౌన్సిల్ జట్టును ప్రకటించింది. ఈ కమిటీని కూడా శనివారమే ఏర్పాటు చేశారు. త్వరలో జరుగబోయే ఏజీఎంలో ఈ కమిటీ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేస్తామని కౌన్సిల్ స్పష్టం చేసింది. అయితే నిబంధనల ప్రకారం కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు పాత కమిటీనే కొనసాగుతుంది కాబట్టి పాత సెలక్షన్ కమిటీతోనే జట్టును ఎంపిక చేసినట్లు శేష్ నారాయణ్ చెబుతున్నారు. ఈ సెలక్షన్ కమిటీలో అరవింద్ శెట్టి, నిరంజన్, విష్ణువర్ధన్ సభ్యులుగా ఉన్నారు. ఈ తరహాలో జట్ల ఎంపిక క్రికెటర్లను ఆందోళనలో పడేసింది. తాము జట్టులోకి ఎంపికైనట్లా, కానట్లా... అసలు టోర్నీకి వెళ్లాల్సి ఉందా లేదా అని వారంతా సంకోచంలో ఉన్నారు. చివరకు ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఆసక్తికరం. హైదరాబాద్ జట్లు కార్యదర్శి ప్రకటించిన హైదరాబాద్ జట్టు: సీవీ మిలింద్ (కెప్టెన్), రోహిత్ రాయుడు, అభిరత్ రెడ్డి, ఠాకూర్ తిలక్ వర్మ, హిమాలయ్ అగర్వాల్ (వికెట్ కీపర్), చందన్ సహాని, యతిన్ రెడ్డి, టి. రవితేజ, సాకేత్ సాయిరామ్, టీపీ అనిరుధ్, తనయ్ త్యాగరాజన్, ముదస్సిర్ హుస్సేన్, కె. సుమంత్ (వికెట్ కీపర్), సమిత్ రెడ్డి, మల్లికార్జున్, అలంకృత్ అగర్వాల్, ఎన్. అర్జున్ యాదవ్ (కోచ్), నోయెల్ డేవిడ్ (ఫీల్డింగ్ కోచ్), మహబూబ్ అహ్మద్ (మేనేజర్), భీషం ప్రతాప్ సింగ్ (ఫిజియో), నవీన్ రెడ్డి (ట్రెయినర్). అపెక్స్ కౌన్సిల్ ప్రకటించిన హైదరాబాద్ జట్టు: అంబటి రాయుడు (కెప్టెన్), పి. అక్షత్ రెడ్డి (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, రోహిత్ రాయుడు, బి. సందీప్, కొల్లా సుమంత్ (వికెట్ కీపర్), టి. రవితేజ, ఆకాశ్ భండారి, మెహదీహసన్, ప్రజ్ఞాన్ ఓజా, ఎం. రవికిరణ్, ముదస్సర్ హుస్సేన్, సీవీ మిలింద్, ఎ. వరుణ్ గౌడ్, చందన్ సహాని, ఠాకూర్ తిలక్ వర్మ, ఎన్పీ సింగ్ (కోచ్), ఇంద్ర శేఖర్ రెడ్డి (మేనేజర్), ప్రతాప్ సింగ్ (ఫిజియో), నవీన్ రెడ్డి (ట్రెయినర్). -
సర్వ వివాద నివారిణి.. ‘అపెక్స్ కౌన్సిల్’
► కేంద్ర జల వనరుల శాఖకు లేఖలు రాసిన కృష్ణా, గోదావరి బోర్డులు ► తక్షణమే ఇరు రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించాలని సూచన సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్ర జల వనరుల శాఖ నేతృత్వాన ఇరు రాష్ట్రాల సీఎంలతో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించ డమే పరిష్కార మార్గమని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు కేంద్ర జల వనరుల శాఖకు స్పష్టం చేశాయి. కొత్త ప్రాజెక్టులపై వివాదం సమసిపోవాలన్నా, మళ్లింపు జలాలకు పరిష్కారం దొరకాలన్నా, నీటి వాటాలపై స్పష్టత రావాలన్నా అపెక్స్ కౌన్సిల్ భేటీ అత్యావశ్యమని తెలిపాయి. ఈ మేరకు రెండు బోర్డులు శుక్రవారం విడివిడిగా కేంద్ర జల వనరుల శాఖకు లేఖలు రాశాయి. అన్నింటికీ అదే మందు... కృష్ణా, గోదావరి బేసిన్‌లోని వివాదాలపై గత రెండేళ్లలో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించిన కేంద్రం.. ఇరు రాష్ట్రాల మధ్య ఓ అవగాహన కుదర్చడంతో తాత్కాలిక పరిష్కారం దొరికిం ది. ఈ ఏడాది ఎలాంటి భేటీ జరగలేదు. దీంతో జల వివాదాలు మరింత ముదిరాయి. తెలంగాణ రీ–ఇంజనీరింగ్ చేస్తున్న పాల మూరు–రంగారెడ్డి, డిండి, సీతారామ, భక్తరామదాస, తుమ్మిళ్ల, కంతనపల్లి వంటి ప్రాజెక్టులను కేంద్రం, బోర్డు అనుమతులు లేవని ఏపీ అంటోంది. ప్రతిగా ఏపీ చేపట్టిన పులికనుమ, సిద్ధాపురం, గాజులదిన్నె, గుండ్రే వుల, శివభాష్యం సాగర్, మున్నేరు, ముచ్చు మర్రి, గురు రాఘవేంద్ర, ఆర్డీఎస్ కుడి కాల్వ అంశాలని తెలంగాణ తెరపైకి తెచ్చింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 85(సి) నిబం« ధన కింద ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపడితే దానికి బోర్డు నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా, ఎలాంటి అనుమతులు, కేటాయింపు లు లేకుండా చేపడుతున్న ఈ ప్రాజెక్టులను కేంద్రం నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవా లని కోరింది. దీనిపై బోర్డు ముందు వాదనలు జరిగినప్పటికీ పరిష్కారం దొరకలేదు. జలాల మళ్లింపు మరింత జటిలం... ఇక నదీ జలాల మళ్లింపు అంశం మరింత వివాదాస్పదంగా మారింది. పట్టిసీమ ద్వారా ఏపీ తరలిస్తున్న నీటిలో తెలంగాణకు 45 టీఎంసీలు రావాలని, పోలవరం ద్వారా మరో 45 టీఎంసీలు దక్కాలని తెలంగాణ అంటోం ది. దీనికి బదులుగా ఏపీ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు నకు విరుద్ధంగా తెలంగాణ సర్కార్ పలు ప్రాజెక్టుల ద్వారా 163 టీఎంసీల జలాలను కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి మళ్లిస్తోం దని అంటోంది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో 14(బీ) క్లాజ్ ప్రకారం 163 టీఎంసీల మళ్లింపు జలాల్లో ఏపీకి వాటా ఇవ్వాలని అంటోంది. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ఏపీకి లభించే 811 టీఎంసీల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీలు దక్కుతాయని ఒప్పందం ఉంది. గోదావరిలో లభ్యంగా ఉన్న 1,480 టీఎంసీలకు సంబంధించి ఎలాంటి ఒప్పందం లేదు. నీటి లభ్యత, పరీవాహకం ఆధారంగా తెలంగాణకు 954 టీఎంసీ, మిగితావి ఏపీవన్న అవగాహనతో ముందు కెళుతున్నాయి. ఈ నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ వీటన్నిటికీ మార్గం చూపుతుందని బోర్డులు కేద్రానికి సూచించాయి. -
మీ వాదనలు సరిగా లేవు
- ఏపీ, తెలంగాణలను ఉద్దేశించి ట్రిబ్యునల్ వ్యాఖ్య - 8వ అంశంపై వాదనలు సమర్థనీయంగా లేవు - తెలంగాణ ప్రయోజనాలు ఉమ్మడి ఏపీ పట్టించుకోలేదన్న వాదన తిరస్కరణ - చట్టంలో ఆస్తుల విభజనను పలు సెక్షన్లు సూచిస్తున్నాయి - అందుకే నీటి పంపకాలు కూడా రెండు రాష్ట్రాల మధ్యే - కర్ణాటక, మహారాష్ట్ర వాదనల్లో బలం ఉందన్న ట్రిబ్యునల్ సాక్షి, న్యూఢిల్లీ: ‘మీరు లేవనెత్తిన అంశాలపై మీ వాదనలు సమర్థనీయంగా లేవు.. మీరు సరిగా వివరించలేకపోయారు’ ఓ సందర్భం లో తెలంగాణ, ఏపీలను ఉద్దేశించి స్వయంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ చేసిన వ్యాఖ్యలివీ! కృష్ణా జలాలను ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-89 ప్రకారం నాలుగు రాష్ట్రాలకు పంచాలంటూ ఇరు రాష్ట్రాలు చేసిన వాదనల్లో ఏ ఒక్కటీ ట్రిబ్యునల్‌ను మెప్పించలేపోయాయి. ఆ వాదనలేవీ నిలబడలేని తీరుకు 124 పేజీల తీర్పు అద్దం పట్టింది. సెక్షన్-89 పరిధిపై విచారణ జరుగుతున్నప్పుడు అన్ని రాష్ట్రాల సమ్మతితో 9 అంశాలపై విచారణ జరగాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో ఎనిమిదో అంశంపై ఏపీ, తెలంగాణలు తాము లేవనెత్తిన అంశంపై సమర్థనీయంగా వాదించలేకపోయాయని ట్రిబ్యునలే తీర్పులో పేర్కొంది. ‘‘ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నిర్దిష్ట కేటాయింపులు జరపకుండా.. తెలంగాణ, ఏపీ ప్రాజెక్టులకే కేటాయింపులు జరి పితే.. తక్కువ నీటి ప్రవాహం ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ ప్రొటొకాల్ నిర్ధారణ సాధ్యమవుతుందా’’ అన్న అంశాన్ని ఏపీ, తెలంగాణ లేవనెత్తడంతో దీన్ని 8వ అంశంగా చేర్చా రు. దీనికి ట్రిబ్యునల్ తీర్పులో సమాధానమిస్తూ.. ‘‘వాస్తవానికి ఈ అంశంపై ఎక్కువగా వాదనలు చేయలేదు. అలాగే ఈ అంశానికి మద్దతుగా ఏ వివరణా లేదు. అందువల్ల ఈ వాదనను నిలబెట్టడానికి మా వద్ద ఎలాంటి కారణం లేదు’’ అని పేర్కొంది. ఇలాంటి కీలక అంశంపై కూడా సవివరంగా వాదించకపోవడం అంతిమంగా ఉభయ రాష్ట్రాలు నష్టపోయే పరిస్థితికి దారితీసింది. ఆస్తుల విభజనే ప్రాతిపదికగా: విచారణ సందర్భంగా ట్రిబ్యునల్... పలుమార్లు ఆస్తులు పంచుకున్న రీతిలోనే నీటిని పంచుకుంటే ఎలా ఉంటుందని వ్యాఖ్యానిస్తూ వచ్చింది. కానీ ఈ వ్యాఖ్యలను నిశితంగా పరిగణనలోకి తీసుకుని ఏపీ, తెలంగాణలు బలమైన వాదనలు వినిపించడంలో విఫలమయ్యాయి. తీర్పు కూడా ఈ వ్యాఖ్యలను బలపరుస్తూ ఆస్తుల మాదిరే నీటిని పంచుకోవాలన్న ప్రస్తావనలతో ఉంది. కర్ణాటక తరపున సీనియర్ న్యాయవాది అనిల్ దివాన్ చేసిన వాదనల్లో బలం కనిపించిందని పేర్కొంది. సెక్షన్ 48 రెండు రాష్ట్రాలు భూములు, వస్తువులను, అలాగే సెక్షన్ 49 నగదు, బ్యాంకు నిల్వలను, సెక్షన్ 51 రుణాలు తదితరాలను, సెక్షన్ 52 పెట్టుబడుల్ని పంచుకోవాలని ఆయన వాదించారు. ఇలా సెక్షన్ 67 వరకు ఇలాంటి నిబంధనలే ఉన్నాయంటూ ఆయన చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్నట్టు ట్రిబ్యునల్ తీర్పులో అవగతమవుతోంది. అలాగే నీటి వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటులో ఏపీ, తెలంగాణకే చోటుందని, ఇతర రాష్ట్రాలకు ఇందులో చోటు లేదని మహారాష్ట్ర తరపు సీనియర్ న్యాయవాది చేసిన వాదనలను కూడా పరిగణనలోకి తీసుకుంది. సెక్షన్ 89లో ‘సక్సెసర్ స్టేట్స్’ అన్న ప్రస్తావన ఉందని, దానికి కేవలం కొత్త రాష్ట్రాలని మాత్రమే అర్థమని అంధ్యార్జున చేసిన వాదనలను ప్రస్తావించింది. అలాగే ఇతర రాష్ట్రాలు విడిపోయినప్పుడు విడిపోయిన రాష్ట్రాలకు సంబంధించి మాత్రమే కేటాయింపులు జరిగాయి తప్ప ఏ ఇతర రాష్ట్రాలను ఆ వివాదంలో చేర్చలేదన్న కర్ణాటక, మహారాష్ట్ర వాదనలను తీర్పు ప్రముఖంగా ప్రస్తావించింది. తెలంగాణ వెనుకబాటుపై ఏమందంటే వెనకబాటుతనం, నీళ్ల కోసమే రాష్ట్ర ఏర్పాటు, తమ ప్రాంత ప్రయోజనాలను ఉమ్మడి రాష్ట్రం ట్రిబ్యునల్ ముందు వినిపించకపోవడం వంటి అంశాలను తెలంగాణ ప్రస్తావించిందని ట్రిబ్యునల్ పేర్కొంది. అయితే ఇవేవీ సెక్షన్ 89ను అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయాలన్న వాదనలకు బలం చేకూర్చేలా లేవని స్పష్టం చేసింది. ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా తెలంగాణ ప్రయోజనాలను కూడా వినిపించిందని పేర్కొంది. తెలంగాణలో ఎగువ ప్రాంతానికి 20 టీఎంసీల నీటిని కేటాయించాలని ఉమ్మడి ఏపీ చేసిన వాదనలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. దీంతో ఈ వాదనలను లోతుగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనిపించిందని, ఒకవేళ కొన్ని నీళ్లు ఆంధ్రా ప్రాంతానికి ఎక్కువగా వచ్చినా, తెలంగాణకు తక్కువగా వచ్చినా.. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల సమయంలో సర్దుబాటు చేసుకోవచ్చంది. నీటి కోసమే తెలంగాణ ఏర్పడిందన్న వాదనలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. దీన్ని బలపరస్తూ ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని ‘కారణాలు, లక్ష్యాలు’ శీర్షిక కింద కూడా కనీస ప్రస్తావన లేదంది. ట్రిబ్యునల్‌కు ఆ అధికారం ఉంది విచారణకు ముందు అన్ని రాష్ట్రాల సమ్మతితో రూపొందించుకున్న 9 అంశాలతో పాటు విచారణ సందర్భంగా తలెత్తిన మరో అంశంపై కూడా ట్రిబ్యునల్ వివరణ ఇచ్చింది. సెక్షన్ 89 పరిధి ఏంటన్న అంశాన్ని ట్రిబ్యునల్ ఎలా విచారిస్తుందని, కేవలం నీటి వివాదాన్ని మాత్రమే పరిష్కరిస్తుందని చేసిన వాదనలపై తీర్పులో సుదీర్ఘ ప్రస్తావన చేసింది. భవిష్యత్తులో తలెత్తే వివాదాన్ని కూడా పరిష్కరించే అధికారం ట్రిబ్యునల్‌కు ఉందని, అందువల్లే ట్రిబ్యునల్ పరిధిని నిర్వచించేందుకు విచారణ చేపట్టినట్టు పేర్కొంది. -
ప్యాకేజీపై విస్తృత ప్రచారం చేయండి
టీడీపీ నేతలతో చంద్రబాబు సాక్షి, అమరావతి: హోదా కన్నా మెరుగైన ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని, చంద్రబాబు ప్యాకేజీని అంగీకరించారంటే అది హోదాకంటే మెరుగైందే అయి ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని తాము నిర్వహించిన సర్వేలో తేలిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు చెప్పారు. ఇదే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రులకు, పార్టీ నేతలకు సూచించారు. టీడీపీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం గురువారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. నదీ జలాలకు సంబంధించి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సమర్ధంగా వాదనలు వినిపించామని చంద్రబాబు చెప్పారు. -
నేటి మధ్యాహ్నాం ఏపీ కేబినెట్ భేటీ
విజయవాడ : ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు ఏపీ కేబినెట్ విజయవాడలో సమావేశం కానుంది. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశ నిర్ణయాలపై ఈ కేబినెట్లో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో వర్షాల కారణంగా విజృంభిస్తున్న విష జర్వాలు, స్విస్ ఛాలెంజ్ విధానం కేసు విచారణలో ఎదురవుతున్న విమర్శలతోపాటు వెలగపూడికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. అలాగే పలు సంస్థలకు కేబినెట్ భూ కేటాయింపులు చేయనుంది. -
బాధ్యత కేంద్రానిదే!
♦ తెలంగాణకు న్యాయం చేయాల్సింది కేంద్రమేన్న రాష్ట్ర ప్రభుత్వం ♦ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది ♦ దానిని ఇప్పుడైనా సరిచేయండి ♦ పాలమూరు, డిండిలు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులే ♦ ప్రధాని సైతం 2014 ఏప్రిల్ 22న పాలమూరు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ♦ పట్టిసీమ, పోలవరంల కింద తెలంగాణకు 90టీఎంసీలు రావాలి ♦ ఈ మేరకు కృష్ణాలో వాటా 389 టీఎంసీలకు పెంచాలి ♦ పరీవాహకం, ఆయకట్టు ఆధారంగా వాటా పెంచాలని విజ్ఞప్తి ♦ పొరుగు రాష్ట్రాలతో నిర్మాణాత్మక సహకారానికి కట్టుబడి ఉన్నామని వెల్లడి ♦ అపెక్స్ కౌన్సిల్ ముందు తెలంగాణ ప్రజెంటేషన్ ♦ బోర్డు సూచించిన 47 చోట్ల టెలిమెట్రీ అమలుకు ఓకే సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల విషయంలో న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నదీ జలాల కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొంది. దాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వమైనా సరిచేయాలని అర్థించింది. ఏపీ ఆరోపిస్తున్నట్టు పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టులేమీ కాదని పునరుద్ఘాటించింది. వాటికి ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలు ఇచ్చారని గుర్తు చేసింది. గోదావరి, కృష్ణా ట్రిబ్యునల్ల గత తీర్పుల మేరకు పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల కింద తెలంగాణకు న్యాయంగా 90 టీఎంసీల వాటా దక్కాలని, ఆ మేరకు రాష్ట్ర వాటాను పెంచాలని విజ్ఞప్తి చేసింది. జల వనరుల పంపకాల విషయంలో పొరుగు రాష్ట్రాలతో నిర్మాణాత్మక సహకారానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 17 పేజీల ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ.. వాస్తవాలు, వాటిపై జరిగిన నిర్ణయాలు, ట్రిబ్యునల్ తీర్పులను వివరించారు. సీఎం ప్రజెంటేషన్‌లోని ప్రధాన అంశాలివీ.. ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరు, డిండి ⇒ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఎత్తిపోతలతో కూడిన సాగునీటిపై ఆధారపడి ఉంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలను అత్యంత తక్కువ సాగునీటి సౌకర్యం గల జిల్లాలుగా కేంద్రం కూడా గుర్తించింది. ⇒ పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు కొత్తగా చేపట్టారని.. కృష్ణా డెల్టా రైతులకు నష్టం చేకూర్చేలా ఉందని ఏపీ ఆరోపిస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణ ప్రక్రియ ఆలోచనతో మొదలై, పరిశోధన, డిజైన్, వాస్తవ అమలు, పూర్తి చేయడం వరకు ఉంటుంది. కేవలం ఆలోచనల దశలోనే ఉంటే కొత్త ప్రాజెక్టవుతుంది. కానీ పాలమూరు-రంగారెడ్డి, డిండిలను ఉమ్మడి ఏపీలోనే చేపట్టారు. వాటికి నీటి కేటాయింపులు చేసి, నిర్మాణమూ ప్రారంభించారు. ⇒ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013 ఆగస్టు 8న జీవో 72 ఇచ్చారు. ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోల్లో హామీ ఇచ్చాయి. 2014 ఏప్రిల్ 22న అప్పటి ప్రధాని సైతం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని బహిరంగ సభలో హామీ ఇచ్చారు. డిండి ప్రాజెక్టు చేపట్టేందుకు 2007 జూలై 7న జీవో 159 ఇచ్చారు. 2010 డిసెంబర్ 10న ప్రధాని కార్యాలయం సైతం డిండిని జాతీయ ప్రాజెక్టుగా పరిగణనలోకి తీసుకొనేందుకు ప్రతిపాదన కోరింది. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంపై ఉంది. ఈ ప్రాజెక్టులకు వినియోగిస్తున్న నీరు రాష్ట్ర కేటాయింపుల్లోంచే ఉంది గనుక ఇవి కృష్ణా డెల్టాకు ఏ మాత్రం నష్టం చేకూర్చవు. ⇒ నదీ బోర్డుల నిర్వహణ గురించి చెప్పే విభజన చట్టం షెడ్యూల్-11లో గోదావరి బేసిన్ వివరాలను అసంపూర్తిగా ఉంచారు. దేవాదుల, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ వరద కాల్వ స్టేజ్-2, ఇందిరాసాగర్ ఎత్తిపోతల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తాడిపుడి, పుష్కర ఎత్తిపోతల వివరాలేవీ ఆ జాబితాలో లేవు. కృష్ణా బేసిన్‌లోని ఎస్ఎల్బీసీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి, ఎస్సార్బీసీ, ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర పథకాల వివరాలూ పొందుపర్చలేదు. 47 చోట్ల టెలిమెట్రీకి ఓకే ‘కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో లెక్కలు పక్కాగా ఉండేందుకు పారదర్శక పర్యవేక్షణ వ్యవస్థ అవసరం. ఈ విషయంలో ప్రస్తుత తీరు అసంతృప్తికరంగా ఉంది. కాబట్టి ప్రధాన పాయింట్ల వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో లెక్కింపుకు టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. వాటి పరిశీలనకు సంయుక్త బృందాలు ఏర్పాటు చేయాలి’ అని రాష్ట్రం కోరింది. ఇరు రాష్ట్రాల్లో బోర్డు సూచించిన 47 చోట్ల టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు ప్రతిపాదనకు అంగీకరించింది. నీటి వాటా పెరగాలి 1978 గోదావరి అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు రాగానే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని తెలంగాణ స్పష్టం చేసింది. ‘‘80 టీఎంసీల కేటాయింపుల్లో 21 టీఎంసీలు కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు పోగా 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి వస్తాయని ఒప్పందంలోనే ఉంది. ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున ఆ నీటి వాటా హక్కు తెలంగాణదే. బచావత్ అవార్డు ప్రకారం పోలవరం కాకుండా మరేదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంలో పై రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ప్రస్తుతం ఏపీ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం కాదు. కేంద్రం కూడా లోక్‌సభలోనే ఈ మేరకు వెల్లడించింది. ఈ లెక్కన పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగా పరిగణించి, దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీలు ఇవ్వాలి. తెలంగాణకు అదనంగా 90 టీఎంసీల వాటా రావాలి. మొత్తం నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచాలి’’ అని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. నిపుణుల కమిటీ సభ్యుల పక్షపాతం కృష్ణా బేసిన్లో నీటి నిర్వహణ తీరుతెన్నులపై కేంద్ర జల వనరుల శాఖ చొరవ హర్షణీయమని ప్రజెంటేషన్‌లో తెలంగాణ పేర్కొంది. అయితే నిపుణుల కమిటీ ఏర్పాటులో రాష్ట్రాన్ని సంప్రదించలేదని గుర్తు చేసింది. ‘‘తటస్థంగా ఉండాల్సిన కమిటీ సభ్యులు కొందరు పక్షపాతంతో వ్యవహరించారు. కమిటీలో ఉన్న మొహిలే గతంలో శ్రీకృష్ణ కమిటీలో జల వనరుల అంశానికి టెక్నికల్ మెంబర్‌గా ఉం డి తెలంగాణకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారు. మరో సభ్యుడైన ఎంకే గోయల్ కృష్ణా బేసిన్లో ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు నీటి లభ్యతపై అధ్యయనం చేస్తున్న కన్సల్టెన్సీలో పని చేస్తున్నా రు’’ అని ఫిర్యాదు చేసింది. వీరిద్దరినీ తొలగించి తటస్థ సభ్యులను నియమించాలని డి మాండ్ చేసింది. పరీవాహకాన్ని బట్టి కేటాయింపు పెంచాలి సాగర్ ఎగువన లోయర్ కృష్ణా సబ్ బేసిన్ (కే-7) పరీవాహక ప్రాంతం 22,952 చదరపు కిలోమీటర్లని తెలంగాణ వివరించింది. ‘‘ఇందులో 20,164 చదరపు కిలోమీటర్లు (88 శాతం) తెలంగాణ పరిధిలో ఉండగా కేవలం 2,788 చదరపు కిలోమీటర్లు (12) శాతం ఏపీలో ఉంది. సాగర్ ఎగువన ఆయకట్టు పరిధిలో తెలంగాణలో 40 లక్షల ఎకరాలుంది. కానీ అందులో 5 లక్షల ఎకరాలకే నీరందుతోంది. కృష్ణా బేసిన్ పరిధిలో తెలంగాణ జనాభా దాదాపు 2 కోట్లుంటే ఆ పరిధిలో ఏపీ జనాభా కేవలం 78 లక్షలే. ఏపీ చెబుతున్న 512 టీఎంసీల నీటి వినియోగంలో 350 టీఎంసీలు కృష్ణా బేసిన్‌కు ఆవలే వినియోగించుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో ఎస్ఎల్బీసీకి ప్రతిపాదించిన 45 టీఎంసీల నీటి వాటాలో 30 టీఎంసీలను గోదావరి నుంచి పోలవరం ద్వారా ఏపీ మళ్లిస్తోంది. వీటన్నింటి దృష్ట్యా తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేలా చూడాలి’’ అని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. -
పుల్లలు పెడుతూ స్నేహమంటారా?
• చంద్రబాబుపై మండిపడిన హరీశ్ • స్నేహంగా మెలిగితే సమస్యలు పరిష్కారమవుతాయన్న బాబు • మరి ప్రాజెక్టులకు ఎందుకు అడ్డుపడుతున్నారని నిలదీసిన హరీశ్ • కేసీఆర్ జోక్యంతో సద్దుమణిగిన వాగ్వాదం సాక్షి, హైదరాబాద్: అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ మంత్రి హరీశ్‌రావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాదనల సందర్భంగా ఇరు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా మెలిగితే సమస్యలు పరిష్కారమవుతాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఓవైపు స్నేహపూర్వకమంటూనే మరోవైపు తెలంగాణ ప్రాజెక్టులకు పుల్లలు పెడుతున్నారని, అడ్డు పడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులు కట్టవద్దని అపెక్స్ భేటీలో ఎలా వాదిస్తారని.. స్నేహపూర్వకంగా మెలిగేవారు ఇలా చేస్తారా? అని బాబును నిలదీశారు. నల్లగొండ జిల్లాలో ఊళ్లను ఖాళీ చేయించి మరీ పులిచింతలలో నీళ్లు నింపుకొనేందుకు ఏపీకి సహకరించామని, పంటలు ఎండిపోతున్నాయంటే సాగర్‌కు నీళ్లు విడుదల చేశామని పేర్కొన్నారు. కానీ ఏపీ మాత్రం ప్రతి విషయంలో అడ్డుతగులుతోందని మండిపడ్డారు. కర్ణాటకను ఒప్పించి ఆర్డీఎస్ పనులు చేయించుకుంటే అడ్డుపడ్డారన్నారు. నందిగామ ప్రాంతంలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నందున సాగర్ ఎడమ కాల్వ నీళ్లు అక్కడికి చేరేదాకా శ్రద్ధ తీసుకోవాలని ఏపీ మంత్రి దేవినేని ఉమ కోరగా.. హరీశ్ తీవ్రంగా స్పందించారు. ‘‘సాగర్‌కు నీటి విడుదల కోరుతారు. శ్రీశైలం నీటిని మాత్రం విడుదల చేయరు..’ అని విమర్శించారు. ఇలా వాగ్వాదం పెరగడంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. రెండు రాష్ట్రాల రైతులు, ప్రజల అవసరాల మేరకు ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రాంత రైతుల సాగునీటి, ప్రజల తాగునీటి అవసరాలను తాము దృష్టిలో పెట్టుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఉమాభారతి సైతం జోక్యం చేసుకున్నారు. ప్రశాంతంగా కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని.. అప్పుడప్పుడూ కూర్చొని చాయ్ తాగుతూ మాట్లాడుకోవాలని సూచించారు. దీంతో హరీశ్ శాంతించారు. -
రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఉదయం 11 గంటలకు చంద్రబాబు భేటీ కానున్నారు. ఏపీకి ప్రత్యేక సాయంపై ఆయన ఈ సందర్భంగా మోదీకి కృతజ్ఞతలు తెలపనున్నారు. అలాగే మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన నిర్వహించే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మరోవైపు అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రాత్రే ఢిల్లీ వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ఆయన నిన్న రాత్రి గవర్నర్ నరసింహాన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో గవర్నర్‌తో వివిధ అంశాలపై చర్చించారు. -
ఢిల్లీకి రె‘ఢీ’!
- నీళ్ల పంచాయితీపై రేపే అపెక్స్ కౌన్సిల్ భేటీ - ఇరు రాష్ట్రాలకు నోటీస్ ఇచ్చిన కేంద్ర జల వనరుల శాఖ - నేడు ఢిల్లీకి బయల్దేరనున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ - మొత్తం ఐదు అంశాలతో ఎజెండా ఖరారు సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జల వనరుల శాఖ బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ భేటీకి అంతా సిద్ధమైంది. సమావేశానికి సంబంధించి సోమవారం కేంద్ర జల వనరుల శాఖ ఇరు రాష్ట్రాలకు నోటీసులు పంపింది. ఇందులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారమే ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ఆయనతో పాటు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, అధికారుల బృందం వెళ్లనుంది. ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఇక ఎజెండాలో చేర్చిన అంశాలపై రాష్ర్టం కసరత్తు ముగించింది. తీర్పులు, జీవోలు, ఒప్పం దాలు, నివేదికల కాపీల్ని సిద్ధం చేసింది. ఎజెండాలో చేర్చని రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)ను ఆరో అంశంగా చేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నట్లుగా తెలిసింది. ఇదీ ఎజెండా..: అపెక్స్ కౌన్సిల్ ఎజెం డాలో కేంద్రం ఐదు ప్రధాన అంశాలను చేర్చింది. ఈ మేరకు కేంద్ర జల వనరుల శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ నరేశ్‌కుమార్ ఇరు రాష్ట్రాలకు సమాచారం పంపారు. 21వ తేదీ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు శ్రమశక్తి భవన్‌లోని కేంద్రమంత్రి ఉమాభారతి చాంబర్లో సమావేశం జరుగుతుందని వివరించారు. ఎజెండాలోని అంశాలను నోటీస్‌లో వివరించారు. సుప్రీంకోర్టు పరిష్కరించాలని సూచించిన పాలమూరు, డిండి ప్రాజెక్టులను తొలి అంశంగా చేర్చారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి తాత్కాలిక విధానం, రిజర్వాయర్ల పరిధిలో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో లెక్కలు పారదర్శక ంగా ఉండేందుకు టెలీమెట్రీ విధానం, ఒక వాటర్ ఇయర్లో నీటి వాటాల్లో హెచ్చుతగ్గులుంటే వాటి సర్దుబాటు, గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు నీటి తరలిస్తూ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను ఎజెండాలో చేర్చారు. వీటితో పాటు ఏవైనా ఇతర అంశాలుంటే కేంద్రమంత్రి సమ్మతితో చేపట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ఒక్కో రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇంజనీర్ ఇన్ చీఫ్‌తో కూడిన ఐదుగురు ప్రతినిధుల బృందం హాజరు కావాలని సూచించారు. పూర్తయిన కసరత్తు.. అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో చేర్చినవాటితోపాటు ప్రత్యేకంగా ప్రస్తావనకు తేవాలని నిర్ణయించిన అంశాలపై తెలంగాణ కసరత్తు పూర్తి చేసింది. పాలమూరు, డిండి ప్రాజెక్టులపై గతంలో ఇచ్చిన జీవోలు, కల్వకుర్తి వాటాల పెంపునకు సంబంధించి ఉమ్మడి ఏపీలో చేసిన ప్రతిపాదనలు, నీటి వాటాల్లో గత రెండున్నరేళ్లుగా ఏపీ చేసిన ఉల్లంఘనలు, ఆర్డీఎస్ ఆధునికీకరణ పనుల్లో ఏపీ సహాయ నిరాకరణకు సంబంధించి అన్ని ఆధారాలతో అధికారులు నివేదిక సిద్ధం చేశారు. రెండేళ్లుగా నీటి విడుదలపై బోర్డుకు రాష్ట్రానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను సైతం సిద్ధం చేశారు. సీఎం సూచనల మేరకు నీటిపారుదల శాఖ అధికారులు సోమవారం సాయంత్రం వరకు కసరత్తు కొనసాగించారు. దీనిపై బుధవారం ఉదయం సీఎం, మంత్రి హరీశ్‌రావులు మరోమారు చర్చించే అవ కాశం ఉంది. సాయంత్రం సీఎం, మంత్రి, అధికారుల బృందం ఢిల్లీకి బయలుదేరుతుందని నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. -
అన్యాయాన్ని ఎలుగెత్తుదాం
⇒ అపెక్స్ కౌన్సిల్లో మన వాణిని గట్టిగా వినిపిద్దాం: సీఎం కేసీఆర్ ⇒ కృష్ణా, గోదావరిలో 60 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని వివరిద్దాం ⇒ పాలమూరు, డిండి ముమ్మాటికీ పాతవే ⇒ కల్వకుర్తికి నీటి వాటా పెంపుపై ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ణయం ⇒ ఏపీ ఉల్లంఘనలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలి ⇒ అన్ని వివరాలతో సిద్ధంకండి ⇒ మంత్రి హరీశ్, అధికారులతో సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల పంపకాల్లో తెలంగాణకు 60 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని అపెక్స్ కౌన్సిల్ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా జలాల వినియోగంలో ఏపీ ఉల్లంఘనలను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాలని, జలాల్లో రాష్ట్ర వాటాలను మరింత పెంచాలన్న వాదనలు బలంగా వినిపించేందుకు సన్నద్ధమైంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకు రావాల్సిన 90 టీఎంసీల వాటాను గట్టిగా డిమాండ్ చేయాలని, బేసిన్ పరిధిలో వాడే ప్రతి నీటి చుక్కకు లెక్క ఉండేలా టెలీమెట్రీ విధానం అమలు చేయాలని కోరనుంది. పాలమూరు, డిండి ప్రాజెక్టులు కొత్తవి కావని, ఉమ్మడి ఏపీలోనే వాటిని చేపట్టిన అంశాన్ని స్పష్టంచేయనుంది. ఈ నెల 21 కేంద్ర మంత్రి ఉమా భారతి ఆధ్వర్యంలో జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం తన అధికార నివాసంలో మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఈఎన్సీ విజయ్ ప్రకాశ్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. జలాల విషయంలో ఉమ్మడి ఏపీలో జరిగిన అన్యాయమే ప్రస్తుతం కూడా కొనసాగుతోందని, వీటిని పరిష్కరించి తగిన న్యాయం చేసేలా కేంద్రాన్ని కోరాలని సీఎం నిర్ణయించారు. అపెక్స్ కౌన్సిల్లో చర్చకు వచ్చే ప్రతీ అంశంపై ఆధారాలు, నివేదికలతో సహా ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు, ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవోలతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర జలవనరుల శాఖ ఎజెండా రాష్ట్రానికి అందిన తర్వాత మరోమారు సమావేశమై చర్చించనున్నారు. మన వాటా కోసం పట్టుపడదాం కృష్ణా జలాల్లో తెలంగాణకు పెంచాల్సిన వాటాపై ట్రిబ్యునల్‌లో జరుగుతున్న విచారణపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. బచావత్ అవార్డు ప్రకారం గోదావరి నదిపై ఏదైనా ప్రాజెక్టు ద్వారా కృష్ణాకు నీటిని తరలిస్తే.. అంతే వాటా ఎగువ రాష్ట్రాలకు వస్తుందన్నారు. ఈ లెక్కన ఏపీ చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో.. తెలంగాణకు 90 టీఎంసీల వాటా దక్కుతుందని సీఎం ఈ సందర్భంగా అన్నట్లు తెలిసింది. ఈ 90 టీఎంసీల వాటాను రాష్ట్రానికి ఇవ్వాలని.. ఈ లెక్కన రాష్ట్రానికికి 389 టీఎంసీల వాటా కోరాలని నిర్ణయించారు. ఆ ప్రాజెక్టులు పాతవే.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు, డిండి ప్రాజెక్టులపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఈ రెండు ప్రాజెక్టులు కొత్తవి కావని, వీటికి ఉమ్మడి ఏపీలోనే అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 2008 నుంచి డిండి, 2013లో పాలమూరు ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి జీవోలు ఇచ్చారని గుర్తు చేశారు. కల్వకుర్తి వాటాను 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచే నిర్ణయం కూడా ఉమ్మడి ఏపీలోనే జరిగిందన్నారు. గోదావరి పరిధిలో చేపట్టిన కంతనపల్లి, కాళేశ్వరం, చనాకా కొరాటా, సీతారామ ప్రాజెక్టులేవీ కొత్తవి కావని, వాటన్నింటికి గతంలో నీటి కేటాయింపులు జరిపిన విషయాన్ని అపెక్స్ దృష్టికి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఏపీ ఉల్లంఘనలను వివరిద్దాం.. కృష్ణా జలాల్లో ఏపీ రెండున్నరేళ్లుగా పాల్పడుతున్న ఉల్లంఘనల అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. 2014-15 నుంచి కృష్ణా జలాల్లో తనకున్న వాటాకు మించి.. ఏపీ అధికంగా నీటిని తరలిస్తున్న అంశంపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. 2014 నుంచి ఇప్పటివరకు సుమారు 90 టీఎంసీల నీటిని అధికంగా వినియోగించినా.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సమర్పించిన లెక్కల్లో చూపలేదన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 4,300 క్యూసెక్కులు తోడుతున్నామని ఏపీ చెబుతున్నా.. 12 వేల క్యూసెక్కులకు పైగా తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఉల్లంఘనలను కేంద్రం ముందు పెట్టి టెలీమెట్రీ విధానం తక్షణం అమల్లోకి వచ్చేలా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. ఆ లెక్కలన్నీ తీయండి సీఎం కేసీఆర్‌తో సమావేశానికి ముందు నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి హరీశ్ సుదీర్ఘంగా చర్చించారు. అపెక్స్ భేటీలో ఏపీ ప్రస్తావనకు తెచ్చే అంశాలకు ఎలా జవాబు ఇవ్వాలన్న అంశంపై కసరత్తు చేశారు. పోతిరెడ్డిపాడు కింద 2014-15లో 33 టీఎంసీలు, 2015-16లో 13 టీఎంసీలు, 2016-17లో 33 టీఎంసీల మేరకు ఏపీ అధికంగా వాడుకుందని, ఆ లెక్కలన్నీ తీయాలని అధికారులకు సూచించారు. -
చర్చంతా 'కృష్ణా'పైనే..
‘అపెక్స్ కౌన్సిల్’ ఎజెండాను ఖరారు చేసిన చైర్పర్సన్ ఉమాభారతి ≈ పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపైనే ప్రధానంగా చర్చ ≈ పట్టిసీమ, పోలవరం జలాల్లో వాటాపై తేల్చేది కృష్ణా ట్రిబ్యునలేనని స్పష్టీకరణ ≈ గోదావరి ప్రాజెక్టులపై చర్చకు స్పష్టమైన హామీ ఇవ్వని కేంద్ర జల వనరుల శాఖ ≈ ఈనెల 21న అపెక్స్ కౌన్సిల్ సమావేశం.. ≈ పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులతో ఏపీకి తీవ్ర నష్టం ≈ శ్రీశెలం నుంచి 120 టీఎంసీలు తోడుకోనున్న తెలంగాణ సర్కారు ≈ రాయలసీమ, నాగార్జునసాగర్, పులిచింతల ఆయకట్టు, కృష్ణా డెల్టాకు కష్టాలే ≈ ఏపీ ప్రభుత్వం కౌన్సిల్లో సమర్థంగా వాదనలు వినిపించాలి ≈ రాష్ట్ర ప్రజలకు జరిగే అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి ≈ సాగునీటి రంగ నిపుణుల సూచన సాక్షి, హైదరాబాద్ : కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో చేపట్టిన ప్రాజెక్టులపైనే ‘అపెక్స్ కౌన్సిల్’లో ప్రధానంగా చర్చించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎజెండాను ఖరారు చేసింది. ఈ నెల 21న కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖరరావులకు సమాచారం పంపింది. పోలవరం, పట్టిసీమ ఎత్తిపోతల తదితర గోదావరి ప్రాజెక్టులపైనా చర్చించాలన్న ప్రతిపాదనపై కేంద్ర జల వనరుల శాఖ మంత్రి, అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం గమనార్హం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర జల వనరుల వాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జీత్ సింగ్ శుక్రవారం వేర్వేరుగా లేఖలు రాశారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల వివాదాన్ని పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 21న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి సిద్ధమయ్యారు. పట్టిసీమ ఎత్తిపోతల, పోలవరం ప్రాజెక్టుల ద్వారా కృష్ణా డెల్టాకు ఏపీ ప్రభుత్వం మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో 90 టీఎంసీల వాటా తమకు కేటాయించాలని, దానిపై చర్చించాలన్న తెలంగాణ సర్కారు ప్రతిపాదనపై కృష్ణా ట్రిబ్యునల్‌లో తేల్చుకోవాలని ఇప్పటికే సూచించామని, అపెక్స్ కౌన్సిల్లో దాన్ని చర్చించలేమని స్పష్టం చేశారు. సమర్థంగా వాదనలు వినిపిస్తేనే... ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు 21న జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎంతో కీలకమైనది. రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడాలంటే... అనుమతుల్లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై కౌన్సిల్లో ఏపీ ప్రభుత్వం సమర్థంగా వాదనలు వినిపించాలని సాగునీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల ఏపీకి వాటిల్లే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెబుతున్నారు. ఈ విషయంలో ఏమాత్రం విఫలమైనా రాష్ట్ర ప్రజానీకానికి తీరని అన్యాయం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. సమయాన్ని బట్టి ఆర్డీఎస్‌పై చర్చిద్దాం ఆర్డీఎస్(రాజోలి బండ డైవర్షన్ స్కీం) కుడి కాలువ ను తవ్వేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందని, దానికి అనుమతులు లేవంటూ తెలంగాణ సర్కారు చేసిన ఫిర్యాదుపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. సమయాన్ని బట్టి ఈ అంశంపై అపెక్స్ కౌన్సిల్లో చర్చిద్దామని హామీ ఇచ్చింది. గోదావరి జలాల వినియోగంపై తమను సంప్రదించకుండా మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడం, ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో అనుమతి లేకుండా 135 టీఎంసీల వినియోగానికి సిద్ధమవడంపై చర్చించాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదననూ కేంద్రం సున్నితంగా తోసిపుచ్చింది. ఈ అంశాన్ని అజెండాలో చేర్చలేమని, వీలును బట్టి చర్చిద్దామంటూ దాటవేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అజెండాను ఖరారు చేసిన అపెక్స్ కౌన్సిల్ చైర్ పర్సన్ ఉమాభారతి.. ఈ నెల 21న సమావేశానికి హాజరు కావాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లకు శుక్రవారం రాత్రి నోటీసులు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆ ప్రాజెక్టులతో ఏపీ ఎడారే! రాయలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు కృష్ణా డెల్టా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కృష్ణా నది వరప్రదాయిని. ఈ నదిపై ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు ఇప్పటికే లెక్కలేనన్ని ప్రాజెక్టులు, బ్యారేజీలు, లిఫ్ట్‌లు కట్టడంతో దిగువకు చుక్కనీరు రాని దుస్థితి నెలకొంది. అన్ని అడ్డంకులు దాటుకొని, శ్రీశైలంలోకి నీరు వచ్చినా.. దాన్ని తోడేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతుల్లేకుండా పాలమూరు-రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌లను ఏర్పాటు చేస్తోంది. ఈ లిఫ్ట్‌ల ద్వారా శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీల నీటిని తోడుకోవాలని నిర్ణయించింది. శ్రీశైలం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు. ఈ మట్టం వద్ద గరిష్టంగా 215 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సిల్ లెవల్ 840 అడుగులు అయినప్పటికీ శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉంటే తప్ప దాని ద్వారా రాయలసీమకు నీరివ్వడం సాధ్యం కాదు. వెలిగొండ ప్రాజెక్టుకు నీరివ్వాలన్నా శ్రీశైలంలో 854 అడుగుల మట్టాన్ని కొనసాగించాలి. కానీ, 800 అడుగల వద్దే నీటిని తోడుకునేలా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మిస్తోంది. రోజుకు 2 టీఎంసీల చొప్పున తోడేస్తే.. భారీ వరద ఉంటే తప్ప శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులకు చేరడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు కనీవినీ ఎరుగని నష్టం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీశైలం నుంచి నీటిని తెలంగాణ తోడేస్తే రాయలసీమతోపాటు దిగువనున్న నాగార్జునసాగర్, పులిచింతల ఆయకట్టు, కృష్ణా డెల్టాకు కష్టాలు తప్పవు. -
పాలమూరు, డిండిపైనే దృష్టి!
అపెక్స్ కౌన్సిల్లో వీటిపైనే తొలి చర్చ - ఎజెండాకు కేంద్రమంత్రి ఉమాభారతి ఆమోదం - నేడు రాష్ట్రాలకు ఎజెండా కాపీలు - డీపీఆర్‌లు ఇవ్వకపోవడంపై ఏపీ, తెలంగాణలపై బోర్డు ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులే ప్ర దాన అంశంగా అపెక్స్ కౌన్సిల్ ఎజెండా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్ భేటీలో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో కేంద్ర జల వనరుల శాఖ దీనికి తొలి ప్రాధాన్యం ఇచ్చినట్టు సమాచారం. వీటిపై చర్చ ముగిసిన తర్వాత పట్టిసీమ, పోలవరం కింద తెలంగాణకు దక్కే 90 టీఎంసీల వాటా, కృష్ణాలో ఏపీ ఉల్లంఘనలు, బోర్డు నియంత్రణపై, అలాగే ఏపీ తెరపైకి తెచ్చిన జూరాలలో నీటి వినియోగం, గోదావరి బేసిన్ పరిధిలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ అంశాలను చర్చించాలని నిర్ణయించింది. ఈ మేరకు సమావేశ ఎజెండాకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఓకే చెప్పినట్లుగా సమాచారం. ఎజెండా కాపీలను కేంద్రం శనివారం ఉదయం పంపే అవకాశాలున్నాయని తెలంగాణ నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. సమావేశాలు రెండ్రోజులపాటు నిర్వహించేం దుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు తెలి సింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలసంఘం అనుమతి లేకుండా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 120 టీఎంసీలు తరలిం చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాల మూరు, డిండి ఎత్తిపోతల పథకాలను నిలిపివేయాలంటూ గుంటూరు జిల్లాకు చెందిన రైతులు సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు.. నెలరోజుల్లోగా అపెక్స్ కౌన్సిల్ నిర్వహించి వివాదాన్ని పరిష్కరించాలంటూ జూలైలో కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకే పాలమూరు డిండికి తొలి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది. 19లోగా డీపీఆర్‌లు ఇవ్వండి కృష్ణా జలాలను వినియోగించుకుంటూ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల వివరాలు కోరుతున్నా సమర్పించకపోవడంపై కృష్ణా బోర్డు తెలంగాణ, ఏపీపై మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు సంబంధించి ఏపీ.. పాలమూరు, డిండి, కల్వకుర్తిలపై తెలంగాణ ప్రభు త్వం డీపీఆర్‌లను సమర్పించాలంటూ శుక్రవారం 2 రాష్ట్రాలకు లేఖలు రాసింది. డీపీఆర్‌లు ఇవ్వకుంటే ఎలా స్పందించాలంటూ కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి బోర్డుకు లేఖ రాసిన నేపథ్యంలో.. బోర్డు తుది హెచ్చరికగా రెండు రాష్ట్రాలకు ఈ లేఖలు పంపింది. ఈ నెల 19లోగా డీపీఆర్‌లు ఇవ్వాలని ఆదేశించింది. ఇరు రాష్ట్రాలు ఇచ్చే డీపీఆర్‌లనే అపెక్స్ కౌన్సిల్ ముందు పెడతామని స్పష్టం చేసింది. -
19న అపెక్స్ కౌన్సిల్ భేటీ?
- ఆ తేదీ తమకు ఓకే అని కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ - ఇంకా తేల్చని తెలంగాణ ప్రభుత్వం - 20 నుంచి అసెంబ్లీ నేపథ్యంలో 19వ తేదీపై తర్జనభర్జన - హరీశ్‌రావు ఢిల్లీ నుంచి వచ్చాక సీఎంతో చర్చించి నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి వీలుగా ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండే అపెక్స్ కౌన్సిల్ తొలి భేటీ 19న ఢిల్లీలో జరిగే అవకాశం ఉంది. వివాదాల పరిష్కారంకోసం అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో సన్నాహాలు ఆరంభించిన కేంద్ర జల వనరుల శాఖ భేటీకి సంబంధించిన తేదీలపై అభిప్రాయాలు కోరగా, ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 19వ తేదీని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జిత్సింగ్కు లేఖ రాశారు. అయితే ఈ తేదీపై తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న దృష్ట్యా, చంద్రబాబు సూచించిన తేదీకి తెలంగాణ సమ్మతిస్తుందా? లేక మరో తేదీని సూచిస్తుందా? అన్నది తెలియరాలేదు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు తిరిగొచ్చాక, సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం చేస్తారని నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. గొడవంతా కొత్త ప్రాజెక్టులపైనే..: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రెం డు రాష్ట్రాల మధ్య రెండేళ్లుగా అనేక వివాదాలు తలెత్తాయి. తెలంగాణ రీ డిజైన్ చేస్తు న్న ప్రాణహిత, కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టులతో పాటు వాటర్ గ్రిడ్‌పైనా అనేక అనుమానాలు లేవనెత్తుతూ ఏపీ ప్రభుత్వం కేంద్రం, నదీ బోర్డులకు ఫిర్యాదు చేసింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఉమ్మడి ఏపీలోనే అనుమతులిచ్చారని, రీ డిజైన్ ప్రాజెక్టులన్నింటికీ గతంలోనే అన్ని అనుమతులున్నాయని తెలంగాణ అంటోంది. కృష్ణాలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయిం పు లే లేనప్పుడు, ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడం ఎందుకని ప్రశ్నిస్తోంది. నిర్ణీత కేటాయింపుల్లోంచే తమ వాటా నీటిని వాడుకుంటున్నామని చెబుతోంది. ఏపీ మా త్రం పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని తరలిస్తోందని తెలంగాణ వాదిస్తోంది. 90టీఎంసీల అదనపు వాటాకోసం కొట్లాట: ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టును చేపట్టినందున బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తమకు 45 టీఎంసీలు, ఇదే అవార్డు ప్రకారం ఇంకా ఏదైనా ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే పైరాష్ట్రాలకు వాటా ఉంటుందని చెబుతూ మొత్తంగా 90 టీఎంసీలు తమకు దక్కుతాయని తెలంగాణ అంటోంది. వివాదాలపై బోర్డుల వద్ద చర్చ జరిగినా శాశ్వతంగా ఎలాంటి పరిష్కారం లభించడం లేదు. ఈ నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలని ఏపీ పదేపదే కోరుతున్నా, తెలంగాణ మాత్రం తిరస్కరిస్తోంది. అయితే తాజాగా పాలమూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులపై ఏపీకి చెందిన కొందరు రైతులు సుప్రీంను ఆశ్రయించడం, అపెక్స్ కౌన్సిల్ భేటీలో దీన్ని పరిష్కరించుకోవాలని కోర్టు సూచించడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ భేటీకి కేంద్రం సిద్ధమైంది. మంగళవారం ఈ అంశంపై తెలంగాణ నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్కే జోషి, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీతో భేటీ అయ్యారు. తేదీల ఖరారు, తెలంగాణ అభ్యంతరాలపై చర్చించారు. -
మా సమస్యలపై చర్చించండి
- అపెక్స్ కౌన్సిల్ భేటీపై కేంద్రానికి హరీశ్‌రావు విజ్ఞప్తి - పట్టిసీమ మళ్లింపులో తమకు వాటా రావాలని స్పష్టీకరణ - పోతిరెడ్డిపాడు లెక్క తేల్చాలని ఉమాభారతికి విన్నపం - పెసరకు మద్దతు ధరపై రాధామోహన్‌కు విజ్ఞప్తి - పటాన్చెరు రహదారికి నిధులిచ్చేందుకు గడ్కరీ అంగీకారం సాక్షి, న్యూఢిల్లీ: నదీ జలాల వివాద పరిష్కారం కోసం కేంద్రం నిర్వహించనున్న అపెక్స్ కౌన్సిల్ భేటీలో తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతికి రాష్ట్ర నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు ఉమాభారతి, రాధామోహన్‌సింగ్, నిర్మలా సీతారామన్, గడ్కరీతో హరీశ్ వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదికి మళ్లిస్తోందని.. బచావత్ అవార్డు ప్రకారం ఆ మళ్లింపులో తెలంగాణకు వాటా ఉంటుందని చెప్పారు. ఈ వాటా సంగతి తేల్చి, తమకు నీటిని కేటాయించే అంశాన్ని అపెక్స్ కౌన్సిల్ భేటీ ఎజెం డాలో పెట్టి, చర్చించాలని కోరామన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ఎక్కువ నీళ్లు తీసుకెళుతూ.. లెక్కల్లో తక్కువగా చూపుతోందని, దీనిపైనా చర్చించాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. అసలు ఈ తీరును నివారిం చేందుకు ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు ఇరు రాష్ట్రా ల్లో పర్యవేక్షించేలా సంయుక్త పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేయాలని.. టెలీమెట్రీ పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించామన్నారు. ఇందిర మ్మ వరద కాలువ ప్రాజెక్టును సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిందని.. పెట్టుబడి ఆమోద ప్రక్రియ పూర్తయితే కేంద్ర సాయం అందుకునే వీలున్నందున ఆ ప్రక్రియను పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. నిజాంసాగర్ కాలువల ఆధునీకరణకు సాంకేతిక సలహా కమిటీ ఆమోదం వచ్చేలా చూడాలని కోరామన్నారు. పెసర పంటకు ‘మద్దతు’ తెలంగాణలో పెసర పంట ఇప్పటికే మార్కెట్లోకి వచ్చినందున... కేంద్రం ప్రకటించిన మద్దతు ధర అక్టోబర్ 1 నుంచి కాకుండా సెప్టెంబర్ నుంచే అమలయ్యేలా చూడాలని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను హరీశ్‌రావు కోరారు. ప్రస్తుతం మార్కెట్లో కేవలం రూ.3,500కు అమ్ముకోవాల్సిన దుస్థితి ఉందని.. దీంతో రైతులు నష్టపోతున్నారని వివరించారు. రూ.425 బోనస్‌తో కలిపి రూ.5,225 మద్దతు ధరను తక్షణం అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్ర మంత్రి అంగీకరించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయించారని భేటీ అనంతరం హరీశ్‌రావు వివరించారు. అలాగే జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ మిషన్ అమలులో ఉన్న సాంకేతిక సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆహార ధాన్యాల నిల్వ కోసం నిర్మిస్తున్న గిడ్డంగులకు సబ్సిడీ అందించాలని కోరగా.. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి, ఉత్తర్వులు జారీ చేశారని హరీశ్ వివరించారు. ఇక ముంబై-హైదరాబాద్ జాతీయ రహదారి పటాన్చెరు-హైదరాబాద్ మధ్య బాగా పాడైనందున దానిని నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి హరీశ్ విజ్ఞప్తి చేశారు. అందుకు అవసరమైన రూ.48 కోట్ల విడుదలకు గడ్కరీ అంగీకరించారని, రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారని హరీశ్ తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కోల్డ్ స్టోరేజీ యూనిట్లకు కేంద్ర వాటా కింద రూ.65 కోట్లు ఇవ్వాలని నిర్మలా సీతారామన్‌కు హరీశ్‌రావు వినతిపత్రం సమర్పించారు. -
డిసెంబర్ వరకు కొనసాగనున్న సెలక్టర్లు
ముంబై: సందీప్ పాటిల్ నేతృత్వంలోని సీనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ పదవీ కాలం మరో సారి పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఐదుగురు సభ్యులు కొనసాగవచ్చని సమాచారం. బీసీసీఐలో సంస్కరణల అమలు కోసం లోధా కమిటీ డిసెంబర్ వరకు గడువు విధించిన నేపథ్యంలో ఆలోగా కొత్త కమిటీని ఎంపిక చేయకుండా దీనిని కొనసాగించాలని బోర్డు భావిస్తోంది. లోధా సిఫారసుల ప్రకారం డిసెంబర్ 15లోగా అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు కోసం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అదే విధంగా డిసెంబర్ 30లోగా బోర్డులోని వేర్వేరు కమిటీలను కూడా ఏర్పాటు చేయాలి. వీటిలో సెలక్షన్ కమిటీ కూడా ఒకటి. అయితే లోధా ప్రతిపాదనల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఐదుగురు సభ్యుల కమిటీని మూడుకు కుదించడంతో పాటు తప్పనిసరిగా టెస్టు ఆడినవారినే నియమించాలి. పాటిల్ సహా ఐదుగురు సభ్యుల కమిటీ పదవీకాలం ఈ ఏడాది ఆరంభంలోనే ముగిసినా... టి20 ప్రపంచకప్ నేపథ్యంలో వారికి ఒకసారి పొడిగింపు లభించింది. -
డిసెంబర్ 30లోగా అన్ని ఎన్నికలు జరపండి
బీసీసీఐకి లోధా ప్యానెల్ ఆదేశం న్యూఢిల్లీ: బీసీసీఐకి జస్టిస్ లోధా కమిటీ మరోసారి డెడ్‌లైన్ విధించింది. అపెక్స్ కౌన్సిల్‌కు ఎన్నికలతో పాటు వార్షిక సర్వసభ్య సమావేశాన్ని డిసెంబర్ 15లోగా జరపాలని ఆదేశించింది. ఆదివారం జరిగిన లోధా కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈనెల 21న బోర్డు ఏజీఎంను ఏర్పాటు చేయాలని భావించింది. అరుుతే ఈ సమావేశంలో 2015-16కు సంబంధించిన వ్యాపార వ్యవహారాలనే చర్చించాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎలాంటి చర్చ జరగవద్దని సూచించింది. మరోవైపు నూతనంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు కొత్త నిబంధనలు, కొత్త కమిటీలను కూడా డిసెంబర్ 30లోగా ఏర్పాటు చేయాలని గడువు విధించింది. దీంతో పాటు నవంబర్ 15లోపు ఆయా రాష్ట్ర సంఘాల ఎన్నికలను పూర్తి చేయాలని చెప్పింది. -
'అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి'
హైదరాబాద్: అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి, కృష్ణానదీ యాజమాన్యం బోర్డు పరిధిపై నోటిఫికేషన్ జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రఘువీరా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రం నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా శ్రీశైలం రిజర్వాయరు నుంచి 120 టిఎంసీల కృష్ణాజలాలను తరలించుకుపోయే విధంగా పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మిస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే ఏపీలో 48 లక్షల ఎకరాల సాగుభూమి నీరు అందక బీడు భూమిగా మారిపోయే ప్రమాదముందని లేఖలో పేర్కొన్నారు. దీని ఫలితంగా 2 కోట్ల మంది ప్రజలకు త్రాగునీటి కొరత, జల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుందని చెప్పారు. దాంతో ఏపీ థార్ ఎడారిలా మారిపోతుందని అన్నారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ రాష్ట్రం గానీ, ఏపీ గానీ కొత్త ప్రాజెక్టులు నిర్మించాలంటే నదీ యాజమాన్యం బోర్డుల సిఫారసు, కేంద్ర జలవనరుల కమీషన్ సిఫారసు, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి అని అన్నారు. దీనికి సంబంధించి విభజన చట్టం, సెక్షన్ 84, సబ్ సెక్షన్ (3) లో స్పష్టంగా ఉందని రఘువీరా లేఖలో తెలిపారు. -
అపెక్స్ కౌన్సిల్‌ను సమావేశపరచండి
పాలమూరు, డిండి వివాదంపై కేంద్రానికి సుప్రీం ఆదేశం - ఆ ప్రాజెక్టులకు అనుమతులు లేవన్న కేంద్రం - డీపీఆర్‌ను అడిగినా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదని నివే దన - అవి పాత ప్రాజెక్టులేనన్న తెలంగాణ - కాదు కొత్తవే.. ఇంకా సర్వే కూడా పూర్తికాలేదన్న ఏపీ సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 84, 85, షెడ్యూలు 11ను పరిగణనలోకి తీసుకోవాలని, అలాగే అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరపాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని నాగార్జునసాగర్ దిగువన గల ఆయకట్టు రైతులు ఆళ్ల గోపాలకృష్ణారావు, తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టి ఈ ఆదేశాలు జారీచేసింది. జస్టిస్ జగదీశ్ సింగ్ కెహర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తొలుత తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లకు విచారణార్హతే లేదని, కాబట్టి వీటిని తిరస్కరించాలని కోరారు. నదీ జలాల వివాదాలతో రైతులకు ప్రత్యక్షంగా సంబంధం లేదని, రాష్ట్రాల మధ్య ఉండే వివాదాలు రాష్ట్రాలే తగిన వేదికల వద్ద పరిష్కరించుకోవాల్సి ఉంటుందని వాదించారు. ఈ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా జోక్యం చేసుకుంటూ నదీ జలాల వివాదాల పరిష్కారానికి సంబంధిత అత్యున్నత న్యాయ సంస్థలు ఉన్నాయని, వాటిని ఆశ్రయించడంలో ఇబ్బందులు ఏంటని ప్రశ్నించారు. ఇందుకు వైద్యనాథన్ స్పందిస్తూ సంబంధిత సంస్థలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకే ఆశ్రయించిందని, పౌరులు నేరుగా వాటిని ఆశ్రయించలేరని వివరించారు. అనుమతులు లేవన్న కేంద్రం అయితే తెలంగాణ వాదనలపై కేంద్రం వైఖరి ఏంటని జస్టిస్ కెహర్ ప్రశ్నించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ఖాద్రీ స్పందిస్తూ సదరు రెండు ప్రాజెక్టులకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. చట్టంలో పొందుపరిచిన మేరకు సెక్షన్ 84, 85 ప్రకారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కే ఆర్ఎంబీ) వీటికి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని, కానీ అలాంటి అనుమతులు ఏవీ లేవని పేర్కొన్నారు. వీటి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను సమర్పించాలని కేఆర్ఎంబీ, కేంద్ర జల వనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లు కోరినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని నివేదించారు. ఈవాదనలతో వైద్యనాథన్ విభేదించారు. సదరు రెండు ప్రాజెక్టులు కొత్తవి కావని, పాతవేనని, అందువల్లే డీపీఆర్ సమర్పించలేదని తెలిపారు. దీంతో ఖాద్రీ స్పందిస్తూ ఈ రెండు ప్రాజెక్టులు పాతవి కావని, పాత ప్రాజెక్టులే అయితే ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 11వ షెడ్యూలులో పొందుపరిచి ఉండేవారని వాదించారు. ఈ వాదనలతో వైద్యనాథన్ విభేదిస్తూ.. ‘ఉమ్మడి రాష్ట్రంలో మిగులు జలాలపై ఆధారపడి అనేక ప్రాజెక్టులు నిర్మించారు. అలాంటి ప్రాజెక్టులన్నింటినీ చట్టంలో పేర్కొనలేదు. పాలమూరు, డిండి ప్రాజెక్టులు మిగులు జలాలపై ఆధారపడి కడుతున్నవే. ఈ రెండు ప్రాజెక్టులు పాతవే. ఈ వివాదాన్ని తేల్చేందుకు అపెక్స్ కౌన్సిల్ ఉంది..’ అని పేర్కొన్నారు. అయితే.. 11వ షెడ్యూలులో పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను ప్రస్తావించలేదని, అందువల్ల అవి కొత్త పథకాలే అవుతాయి కదా? అని జస్టిస్ కెహర్ ప్రశ్నించారు. తిరిగి వైద్యనాథన్ స్పం దిస్తూ ఆయా ప్రాజెక్టులకు సంబంధించి గతంలోనే ఉమ్మడి ప్రభుత్వం పాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసిందని, కొత్తవి కావని పేర్కొన్నారు. ఏపీ తరపు సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదిస్తూ ఈ ప్రాజెక్టులు కొత్తవేనని, వీటికి సర్వే కూడా పూర్తికాలేదని వాదించారు. డీపీఆర్ లేకుండా ప్రాజెక్టుకు అనుమతులు కూడా లభించవని అన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశమవ్వాలి.. ఈ నేపథ్యంలో జస్టిస్ కెహర్ జోక్యం చేసుకుంటూ అపెక్స్ కౌన్సిల్ ఏం చెబుతోందని, దాని విధులేంటని ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, గోదావరి నదీ యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్.. పునర్ వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఏర్పాటయ్యాయని రైతుల తరపు సీనియర్ న్యాయవాది వి.వి.గిరి తెలిపారు. ట్రిబ్యునల్ అవార్డుల ప్రకారం నీటిని వాడుకోవాలని, వివాదాలు తలెత్తినప్పుడు, ప్రాజెక్టుల నిర్మాణం జరపాలని నిర్ణయించినప్పుడు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. రాకెట్ వేగంతో పాలమూరు, డిండి సాక్షి,హైదరాబాద్: పాలమూరు, డిండి ప్రాజెక్టులకు పట్టిన శని విరగడైందని, రాకెట్ వేగంతో పాలమూరు, డిండి పనులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు చేసిన సూచనలను సీఎం స్వాగతించారు. సుప్రీంకోర్టు స్పందనతో పాలమూరు ప్రాజెక్టుకు శాశ్వతంగా అడ్డంకులు తొలగినట్లేనని వ్యాఖ్యానించారు. ఏపీ అభ్యంతరాలకు ఎక్కడా పెద్దగా విలువ లేనందున, పాలమూరు, డిండి ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు. ఆగమేఘాల మీద పనులను పూర్తి చేసి ప్రాజెక్టు ఫలితాలను ప్రజలకు అందిస్తామని సీఎం స్పష్టం చేశారు. -
అపెక్స్ కౌన్సిల్ భేటీ అనవసరం!
- కేంద్ర జల వనరుల శాఖ, కృష్ణా బోర్డులకు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల వినియోగం, ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం అనవసరమని కేంద్ర జల వనరుల శాఖ, కృష్ణా బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు కేంద్ర జల వనరుల మంత్రి అధ్యక్షతన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ వాదనను తిప్పికొట్టింది. నదీ జలాల వినియోగంలో ఎక్కడా, ఎలాంటి చట్టాల ఉల్లంఘనలకు తాము పాల్పడలేదని... తమకున్న వాటాలను వాడుకునేలా మాత్రమే ప్రాజెక్టులను చేపట్టామని వివరించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కేంద్ర జల వనరుల శాఖ, కృష్ణా బోర్డులకు లేఖలు రాశారు. ఏపీ ఫిర్యాదు నేపథ్యంలో.. కేంద్ర జల సంఘం, బోర్డుల అనుమతి లేకుండానే కృష్ణా, గోదావరి నదులపై 200 టీఎంసీల నీటిని వాడుకునేలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టిందని కేంద్ర జల వనరుల శాఖ, బోర్డులకు గత నెలలో ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జీ-5 బేసిన్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో కలిపి కాళేశ్వరం, జీ-9 బేసిన్లో తమ్మిడిహెట్టి, జీ-7 బేసిన్లో ఛనాకా-కొరట, పింపార్డ్, రాజాపేట, జీ-9లో తుపాకులగూడెం, జీ-10లో సీతారామ ప్రాజెక్టులను చేపడుతున్నారని.. కృష్ణాలోని కే-7 బేసిన్లో పాలమూరు, డిండి లతోపాటు కల్వకుర్తి ప్రాజెక్టు నీటి వినియోగాన్ని పెంచారని అందులో పేర్కొంది. ఈ అంశంపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని, అప్పటి వరకూ ఆయా ప్రాజెక్టుల పనులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన కేంద్రం, బోర్డులు అభిప్రాయం చెప్పాల్సిందిగా వారం కింద తెలంగాణకు లేఖలు రాశాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులపై వివరణ ఇస్తూ ప్రభుత్వం లేఖలు రాసింది. ఏపీ ఆరోపిస్తున్నట్లుగా ప్రాజెక్టుల నిర్మాణంలో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని స్పష్టం చేసింది. గోదావరిలో బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 954.23 టీఎంసీల మేరకే నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ చేస్తున్నామని తెలిపింది. ‘తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు’కు కేటాయించిన 23.76 టీఎంసీల నీటిని సైతం గోదావరిలో పారిశ్రామిక, గృహ అవసరాల కోసం కేటాయించిన 66.24 టీఎంసీల్లోంచే వాడుకుంటున్నామని వివరించింది. లేఖలోని ఇతర ప్రధానాంశాలు.. - కాళేశ్వరం ఎత్తిపోతల, తమ్మిడిహెట్టి ప్రాజెక్టులు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగమే. దీనికి సంబంధించి ఉమ్మడి ఏపీలో 2008లో ఇచ్చిన జీవో నం.238 ప్రకారమే నడుచుకుంటూ... వెనుకబడిన ఏడు జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందించాలని నిర్ణయించాం. - ఉమ్మడి ఏపీలో చేపట్టిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను సమీకృతం చేసి సీతారామ ఎత్తిపోతల పథకం చేపట్టాం. రాజీవ్‌సాగర్, దుమ్ముగూడెం ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ సహాయ నిరాకరణ చేయడంతోనే సమీకృతం చేయాల్సి వచ్చింది. - పెన్‌గంగ దిగువన చేపడుతున్న ఛనాకా-కొరట, పింపార్డ్, రాజాపేట బ్యారేజీల నిర్మాణం సంయుక్తంగా చేపట్టాలని 2013 జూలైలోనే ఒప్పందాలు జరిగాయి. ఆ ప్రక్రియే ప్రస్తుతం ముందుకెళుతోంది. - తుపాకులగూడెంను ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌లో కంతనపల్లికి బదులుగా చేపడుతున్నాం. రాష్ట్రానికి ఉన్న గోదావరి జలాల వాటా మేరకే ఈ ప్రాజెక్టును చేపడుతున్నాం. - పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు, కల్వకుర్తి సామర్థ్యం పెంపు అంశాలు ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయి. ఈ కేసులో ఏపీ సైతం ప్రతివాదిగా ఉంది. అందువల్ల వాటిపై ప్రత్యేకంగా చర్చ అవసరం లేదు. -
ముందుగా ఉన్నతాధికారుల భేటీ
కృష్ణా జల వివాదాల వ్యవహారం... ఈ నెల మూడో వారంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ప్రారంభోత్సవానికి కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి ఈ నెల మూడోవారంలో రానున్న నేపథ్యంలో జరగనున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన అపెక్స్ కౌన్సిల్ భేటీకి ముందుగా ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యే ఆస్కారముంది. అపెక్స్ కౌన్సిల్ భేటీలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా అపెక్స్ కౌన్సిల్ సమావేశానికంటే ముందుగా ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు... ఈఎన్సీలు మరోసారి భేటీ కావాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని తెలంగాణ అధికారులు ధ్రువీకరించారు. అపెక్స్ కౌన్సిల్ భేటీకి అవసరమైన ఎజెండా తయారీకి కూడా అధికారుల సమావేశం ఉపయోగపడుతుందని చెప్పారు. నాగార్జున సాగర్‌లో నీటి లభ్యత, డిమాండ్, భవిష్యత్ తాగునీటి అవసరాల గణాంకాల విషయంలో రెండు రాష్ట్రాలు పొంతనలేని లెక్కలు చెబుతున్నాయి. రెండు రాష్ట్రాల ఈఎన్సీలు కూర్చుని ఒకే రకమైన గణాంకాలు సమర్పించాలని బోర్డు సూచించింది. సమావేశమైతే జరిగింది కానీ.. నీటి వినియోగం, డిమాండ్ విషయంలో ఏకాభిప్రాయానికి రావడం సాధ్యం కాలేదు. రెండు రాష్ట్రాలు పరస్పర సహకార ధోరణిలో వెళితేతప్ప సమస్యకు పరిష్కారం లభించదని సూచిస్తూ కృష్ణా నదీ బోర్డు ఇటీవల రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది. బోర్డు ద్వారా సమస్యకు పరిష్కారం లభించే అవకాశం లేకపోవడంతో అపెక్స్ కౌన్సిల్ భేటీయే ఇందుకు మార్గంగా భావిస్తున్నారు. తద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
అపెక్స్ కౌన్సిల్‌పైనే ఆశలు!
మూడోవారంలో భేటీ కృష్ణా జలాల వివాదం పరిష్కారందిశగా ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి ఈనెల మూడో వారంలో తెరపడవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ‘మిషన్ కాకతీయ’ ప్రారంభోత్సవానికి మూడో వారంలో హైదరాబాద్ రానున్న కేంద్ర జలవనరులశాఖ మంత్రి, అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ ఉమా భారతి ఇరు రాష్ట్రాల సీఎంలతో ఉమ్మడిగా సమావేశం నిర్వహించి వివాదానికి పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నాయి. ఇప్పటికే వివాదంపై కృష్ణా నదీ బోర్డు చేతులెత్తేసిన పరిస్థితుల్లో అపెక్స్ కౌన్సిల్ ఒక్కటే రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చగలదని పేర్కొంటున్నాయి. కృష్ణా జలాలపై సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కరించుకోవడానికి రెండు రాష్ట్రాల సీఎంలు ముందుకు వస్తే తప్ప కృష్ణా జలాల వివాదానికి తెరపడదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని ఇరు రాష్ట్రాల అధికారులు కేంద్ర జలవనరులశాఖ అధికారులకు చెప్పినట్లు సమాచారం. కేంద్ర జలవనరుల మంత్రి నేతృత్వంలోని ‘అపెక్స్ కౌన్సిల్’లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. కేంద్ర మంత్రి ఉమా భారతి తెలంగాణకు వచ్చినప్పుడు అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తే ఆమె సమక్షంలో ఇద్దరు సీఎంలు చర్చించుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు కేంద్రానికి నివేదించారని తెలిసింది. ఇందుకు కేంద్ర జలవనరులశాఖ అధికారుల నుంచి సానుకూల స్పందన వచ్చిందని, అపెక్స్ కౌన్సిల్ భేటీ దిశగా ప్రయత్నాలు చేస్తామని వారు పేర్కొన్నట్లు సమాచారం. మిషన్ కాకతీయ ప్రారంభోత్సవ తేదీకి ముందు లేదా తర్వాత రోజు అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ‘ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో వెళితేనే సమస్యకు పరిష్కారం ఉంటుంది. బోర్డుకు ఎన్ని లేఖలు రాసినా, బోర్డు ఎన్ని వివరాలు కోరినా.. అది సమస్యను పరిష్కరించలేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చిన 60 రోజుల్లోగా నోటిఫై చేయాలనే నిబంధన ఉన్నా కేంద్రం పట్టించుకోలేదు. పంతాలకు పోతే రైతులు నష్టపోతారు. వాస్తవ పరిస్థితిని దృష్టి లో పెట్టుకొని సీఎంలు సమస్య పరిష్కరించుకోవాలి’ అని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. న్యాయ సలహా కోరే యోచనలో బోర్డు! ఇక కృష్ణా జలాల వివాదంపై బోర్డు న్యాయ సలహా తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. సాగర్‌లో నీటి లభ్యత, డిమాండ్, భవిష్యత్ తాగునీటి అవసరాల గణాంకాలను పేర్కొంటూ రెండు రాష్ట్రాలు బోర్డుకు రాసిన లేఖల్లో పొంతన లేని లెక్కలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సమావేశమై ఒకే రకమైన గణాంకాలు సమర్పించాలని బోర్డు సూచించినా అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో చేతులెత్తేసిన కృష్ణా బోర్డు తదుపరి కార్యాచరణపై న్యాయ సలహా తీసుకోవాలని యోచిస్తున్నట్లు బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. -
అపెక్స్ కౌన్సిల్ జోక్యం కోరదాం!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ఒత్తిళ్లపై కేంద్రం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ జోక్యాన్ని కోరాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కౌన్సిల్లో కేంద్ర జల వనరుల మంత్రి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాల నీటి పారుదల మంత్రులు సభ్యులుగా ఉంటారు. రాష్ర్ట విభజన చట్టం ప్రకారం ఏపీ విద్యుత్ ప్రాజెక్టుల నుంచి రావాల్సిన 54 శాతం వాటాను న్యాయంగా ఇవ్వకపోగా, తెలంగాణలో విద్యుత్ సంక్షోభం తలెత్తే రీతిలో ఏపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరును ఈ కౌన్సిల్ ముందు ఎండగట్టాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ఈ దిశగా అడుగులేస్తోంది. శ్రీశైలంలో నీటి లోటును కారణంగా చూపుతూ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్కేజీ పండిత్ మంగళవారం లేఖ రాయడంతో, ఈ వివాదం బోర్డు పరిధిలో పరిష్కారం కాదనే నిశ్చయానికి రాష్ర్ట ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది. శ్రీశైలంలో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఎడమగట్టున విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని, ప్రాజెక్టు నీటి వినియోగంపై గతంలో జారీ చేసిన జీవోలు 69, 170లో పేర్కొన్న నిబంధనలు పాటించాలని ఏపీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాగు, సాగు నీటి అవసరాలు తీరిన తర్వాతే విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న ఆ నిబంధనలను గుర్తుచేస్తోంది. ఈ వాదనకు బలం చేకూర్చుతూ కృష్ణా బోర్డు కూడా మంగళవారం రాష్ర్ట ప్రభుత్వానికి లేఖ రాసింది. నీటి పారుదల శాఖ ప్రధాన కార్యదర్శికి రాసిన ఈ లేఖపై అర్ధరాత్రి వరకు ఉన్నతాధికారుల స్థాయిలో చర్చోపచర్చలు జరిగాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి సైతం తీసుకెళ్లారు.