ప్యాకేజీపై విస్తృత ప్రచారం చేయండి
టీడీపీ నేతలతో చంద్రబాబు
సాక్షి, అమరావతి: హోదా కన్నా మెరుగైన ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని, చంద్రబాబు ప్యాకేజీని అంగీకరించారంటే అది హోదాకంటే మెరుగైందే అయి ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని తాము నిర్వహించిన సర్వేలో తేలిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు చెప్పారు.
ఇదే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రులకు, పార్టీ నేతలకు సూచించారు. టీడీపీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం గురువారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. నదీ జలాలకు సంబంధించి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సమర్ధంగా వాదనలు వినిపించామని చంద్రబాబు చెప్పారు.