రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు | chandrababu naidu, KCR to attend apex council's first meeting | Sakshi
Sakshi News home page

రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు

Published Tue, Sep 20 2016 6:26 PM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

chandrababu naidu, KCR to attend apex council's first meeting

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఉదయం 11 గంటలకు చంద్రబాబు భేటీ కానున్నారు. ఏపీకి ప్రత్యేక సాయంపై ఆయన ఈ సందర్భంగా మోదీకి కృతజ్ఞతలు తెలపనున్నారు. అలాగే  మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన నిర్వ‌హించే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.

మరోవైపు అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రాత్రే ఢిల్లీ వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ఆయన నిన్న రాత్రి గవర్నర్ నరసింహాన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో గవర్నర్‌‌తో వివిధ అంశాలపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement