తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు సానుకూల దృక్పధంతో ఉన్నారని గవర్నర్ నరసింహన్ అన్నారు.
న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు సానుకూల దృక్పధంతో ఉన్నారని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమస్యలు వారే పరిష్కరించుకుంటామన్నారని తెలిపారు.
ఇదే విషయాన్ని హోంమంత్రికి చెప్పానని గవర్నర్ పేర్కొన్నారు. గవర్నర్ అధికారాలపై కేసీఆర్ అభ్యంతరాలు తనకు తెలియవని నరసింహన్ అన్నారు. ఆ అంశం చర్చకు రాలేదన్నారు. స్థానికత వంటి అంశాలు ఒకేసారి పరిష్కారం కావని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలవనున్నట్లు ఆయన తెలిపారు.