నేటి మధ్యాహ్నాం ఏపీ కేబినెట్ భేటీ
విజయవాడ : ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు ఏపీ కేబినెట్ విజయవాడలో సమావేశం కానుంది. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశ నిర్ణయాలపై ఈ కేబినెట్లో చర్చించనున్నారు.
అలాగే రాష్ట్రంలో వర్షాల కారణంగా విజృంభిస్తున్న విష జర్వాలు, స్విస్ ఛాలెంజ్ విధానం కేసు విచారణలో ఎదురవుతున్న విమర్శలతోపాటు వెలగపూడికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. అలాగే పలు సంస్థలకు కేబినెట్ భూ కేటాయింపులు చేయనుంది.