కేప్‌టౌన్:భారత క్రికెట్‌లో ఎంఎస్ ధోని నమోదు చేసిన రికార్డులు ఎన్నో. అయితే గతంలో ధోని సాధించిన ఒక రికార్డును భారత రెగ్యులర్ టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తాజాగా బద్ధలు కొట్టాడు. 2014లో జరిగిన ఒక టెస్టు మ్యాచ్‌లో ధోని అత్యధికంగా తొమ్మిది క్యాచ్‌లు పట్టి భారత్ తరపున ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. అయితే ఆ రికార్డును సాహా తాజాగా బ్రేక్ చేశాడు. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ టెస్టు మ్యాచ్‌లో సాహా 10 క్యాచ్‌లతో ధోని రికార్డును సవరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు పట్టిన సాహా.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఐదు క్యాచ్‌లతో ఆకట్టుకున్నాడు. తద్వారా ఒక టెస్టు మ్యాచ్‌లు అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత వికెట్ కీపర్‌గా సాహా రికార్డు సాధించాడు.
మరొకవైపు ఓవరాల్‌గా చూస్తే ఒక టెస్టులో 10 క్యాచ్‌లు పట్టిన జాబితాలో సాహా సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. అంతకుముందు ఇంగ్లండ్‌కు చెందిన బాబ్ టేలర్(1980లో భారత్‌పై), ఆసీస్‌కు చెందిన గిల్‌క్రిస్ట్(2000లో న్యూజిలాండ్)పై 10 క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్లు. ఇప్పుడు వీరి సరసన సాహా నిలిచాడు. అయితే దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ 11 క్యాచ్‌లతో తొలి స్థానంలో ఉన్నాడు. 2013లో జోహెనెస్‌బర్గ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో ఏబీ ఈ ఘనత సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment